Deepfake Alert : మోదీ ఏఐ మార్ఫింగ్ వీడియోల వివాదం.. మెటా ఇండియా హెడ్ పై పోలీస్ కేసు

సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించేలా, భయాన్ని కలిగించే సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ఏఐ టెక్నాలజీతో ఎడిట్ చేసిన వీడియోలను విచ్చలవిడిగా ఉపయోగించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Deepfake Alert : మోదీ ఏఐ మార్ఫింగ్ వీడియోల వివాదం.. మెటా ఇండియా హెడ్ పై పోలీస్ కేసు

Photo Credit: X/ @narendramodi

Meta India

ముఖ్యాంశాలు
  • మోదీ ఏఐ మార్ఫింగ్ వీడియోల వివాదం
  • మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ కేసు
  • సైబర్ క్రైమ్ పోలీసుల ముందుకు మెటా ప్రతినిధులు, విచారణ వేగవంతం
ప్రకటన

Deepfake Alert : ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన ఏఐ మార్ఫింగ్, డీప్‌ఫేక్ వీడియోల వివాదంలో ప్రముఖ టెక్ దిగ్గజం మెటాకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ వ్యవహారంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్‌తో పాటు పలువురు సోషల్ మీడియా వినియోగదారులపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించేలా, భయాన్ని కలిగించే సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ఏఐ టెక్నాలజీతో ఎడిట్ చేసిన వీడియోలను విచ్చలవిడిగా ఉపయోగించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వ్యాప్తి 
పోలీసుల నివేదికల ప్రకారం.. మెటా సంస్థకు చెందిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ మోర్ఫింగ్ వీడియోలను విస్తృతంగా షేర్ చేశారు. ఈ వీడియోల ద్వారా ప్రజలను తీవ్రంగా గురచేసే ప్రయత్నం జరిగిందని విచారణ సంస్థలు భావిస్తున్నాయి. ఈ ఆధారాల బట్టే  BNS, IT Actలోని వివిధ కఠినమైన సెక్షన్ల కింద విచారణను వేగవంతం చేశారు. ఈ ఏఐ మార్ఫింగ్ వీడియోలను ఎవరు తయారు చేశారు, వాటిని ఎలా ప్రచారం చేశారు.  వేదికలపై వీటిని నిరోధించే భద్రతా చర్యలు ఉన్నాయా లేదా అనే కోణాల్లో విచారణ సాగుతోంది.

OnePlus N6x : వన్ ప్లస్ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్.. 7,000mAh బ్యాటరీతో వచ్చిన OnePlus N6x ధర ఎంతంటే?

సైబర్ క్రైమ్ పోలీసుల విచారణ 
ఇటీవలే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మెటా ప్రతినిధులకు సమన్లు జారీ చేసి విచారణకు పిలిపించిన సంగతి తెలిసిందే. ప్లాట్‌ఫామ్‌లలో ఏఐ స్కామ్‌లు, ఫేక్ అడ్వర్టైజ్‌మెంట్లు, మార్ఫింగ్ కంటెంట్‌ను గుర్తించి తొలగించేందుకు సంస్థ వద్ద ఉన్న సాంకేతిక విధానం ఏమిటో వివరించాలని పోలీసులు కోరారు. ఎన్డీటీవీ కథనం ప్రకారం.. మెటా ప్రతినిధులు విచారణాధికారుల ముందు హాజరై తమ కంపెనీ కంటెంట్ మోడరేషన్ పాలసీ, భద్రతా చర్యలకు సంబంధించిన వివరాలను పంచుకున్నారు. అయితే ఈ వ్యవహారంపై మెటా అధికారికంగా ఇప్పటివరకు ప్రకటన విడుదల చేయలేదు.

డిజిటల్ ఆధారాల పరిశీలన 
ఈ కేసు విచారణ ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉందని, డిజిటల్ ఆధారాల ఆధారంగానే అన్ని ఆరోపణలను ధృవీకరిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఎవరినీ నేరుగా దోషిగా నిర్ధారించలేదని, సమగ్ర విచారణ పూర్తయిన తర్వాత వెలుగుచూసే వాస్తవాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. టెక్నాలజీ ఉపయోగించి ఒక వ్యక్తి ముఖం, గొంతు లేదా హావభావాలను మార్చి, వారు చెప్పని మాటలను చెప్పినట్లు చూపే మోర్ఫింగ్ వీడియోల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Deepfake Alert : మోదీ ఏఐ మార్ఫింగ్ వీడియోల వివాదం.. మెటా ఇండియా హెడ్ పై పోలీస్ కేసు
  2. OnePlus N6x : వన్ ప్లస్ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్.. 7,000mAh బ్యాటరీతో వచ్చిన OnePlus N6x ధర ఎంతంటే?
  3. Sony : గూగుల్ జెమిని ఏఐ, సూపర్ నోయిస్ క్యాన్సిలేషన్‌.. సోనీ నుంచి పవర్ఫుల్ ఆడియో డివైజెస్ లాంచ్
  4. Asus Pad T3201 : టాబ్లెట్ ప్రపంచంలో సరికొత్త హిస్టరీ.. అసుస్ ప్యాడ్ T3201 చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
  5. Nothing Phone (4a) Price Hike : స్మార్ట్‎ఫోన్ లవర్స్‎కు షాకింగ్ న్యూస్.. ఆగస్టు 1 నుంచి భారీగా పెరగనున్న నథింగ్ ఫోన్ ధరలు
  6. Infosys : ఇన్ఫోసిస్‌కు ఫ్రాన్స్ ప్రభుత్వం బిగ్ షాక్.. రూ. 2 కోట్ల జరిమానా విధిస్తూ సంచలన నిర్ణయం
  7. Kerala Boy Cardboard Robot : పాత అట్టపెట్టెలతో అమ్మకి సాయం చేసే రోబోట్.. కేరళ కుర్రాడి వినూత్న ప్రయోగం
  8. Gemini Spark AI : ఆఫీస్ పనులు చేసేసే గూగుల్ AI ఏజెంట్ వచ్చేసింది.. ఇక నిద్రపోతున్నా పనులు అయిపోతాయ్
  9. Vivo Ignite 2026 : విద్యార్థుల ఆవిష్కరణలకు కేరాఫ్ అడ్రస్..  వివో ఇగ్నైట్‌లో రూ. 35 లక్షల స్కాలర్‌షిప్‌లు సాధించే ఛాన్స్
  10. Divoom Portable Speaker : రాత్రిపూట నిద్రపట్టట్లేదా? మీ మైండ్‌ని రిలాక్స్ చేసే దివూమ్ కొత్త బ్లూటూత్ స్పీకర్ వచ్చేసింది
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »