పోర్టబుల్ డిజైన్‌తో వచ్చే ఈ స్పీకర్ వినియోగదారుల ఏకాగ్రతను పెంచడంతో పాటు మానసిక ఒత్తిడిని తగ్గించడంలో అద్భుతంగా తోడ్పడుతుందని కంపెనీ చెబుతోంది.
Photo Credit: Divoom
Divoom Portable Speaker
Divoom Portable Speaker : ప్రముఖ ఆడియో పరికరాల తయారీ సంస్థ దివూమ్ మార్కెట్లోకి అత్యంత ప్రత్యేకమైన దివూమ్ ఫ్లోటూ బ్లూటూత్ స్పీకర్‌ను లాంచ్ చేసింది. ఇది కేవలం పాటలు వినడానికి మాత్రమే కాకుండా, రోజంతా పనులతో అలసిపోయిన మైండ్‌ను ప్రశాంతంగా ఉంచడానికి, నిద్రలేనితనంతో బాధపడేవారికి సహాయపడేలా రూపొందించబడింది. పోర్టబుల్ డిజైన్‌తో వచ్చే ఈ స్పీకర్ వినియోగదారుల ఏకాగ్రతను పెంచడంతో పాటు మానసిక ఒత్తిడిని తగ్గించడంలో అద్భుతంగా తోడ్పడుతుందని కంపెనీ చెబుతోంది.
ధర ఎంత.. ఎక్కడ లభిస్తుంది?
ఈ దివూమ్ ఫ్లోటూ బ్లూటూత్ స్పీకర్ అంతర్జాతీయ మార్కెట్‌లో 99.99 డాలర్ల ధరకు అందుబాటులోకి వచ్చింది. అంటే మన భారతీయ కరెన్సీలో దీని విలువ దాదాపు రూ. 9,500 వరకు ఉంటుంది. సౌండ్, మైండ్ రిలాక్సేషన్ కోరుకునే వారి కోసం ప్రత్యేకంగా తెచ్చిన ఈ స్పీకర్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ద్వారా కూడా సులభంగా కొనుగోలు చేయవచ్చు.
అద్భుతమైన ఫీచర్లు, పెర్ఫార్మెన్స్
ఇది ఒక త్రీ-ఇన్-వన్ మల్టీఫంక్షనల్ స్పీకర్. ఇందులో 10W పవర్‌ఫుల్ ఆడియో అవుట్‌పుట్ లభిస్తుంది. ఫోన్ నుంచి బ్లూటూత్ ద్వారా ఆడియో బుక్స్, పాటలు ప్లే చేసుకోవడమే కాకుండా మైక్రో SD కార్డ్ ద్వారా కూడా నేరుగా మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు. ఇందులో అమర్చిన బిల్ట్-ఇన్ బ్యాటరీ సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 8 గంటల పాటు నాన్‌స్టాప్‌గా పనిచేస్తుంది. దీనికి IPX4 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా ఇచ్చారు, దీనివల్ల నీటి చుక్కలు లేదా చిన్నపాటి చినుకులు పడినా స్పీకర్ పాడవుతుందనే భయం ఉండదు.
స్మార్ట్ అలారం, పోమోడోరో టైమర్!
ట్రావెలింగ్ చేసే అలవాటు ఉన్నవారు హోటళ్లలో దీనిని స్మార్ట్ అలారం క్లాక్‌లాగా ఉపయోగించుకోవచ్చు. ఉదయాన్నే మిమ్మల్ని లేపడానికి సాధారణ రింగ్‌టోన్‌తో పాటు మనసుకు ప్రశాంతతను ఇచ్చే సౌండ్స్‌ను సెట్ చేసుకోవచ్చు. అలారం మోగే సమయంలో దీనిలోని లైట్ మెల్లమెల్లగా వెలుగును పెంచుతూ మిమ్మల్ని సహజంగా నిద్రలేపుతుంది. అలాగే చదువుకునే విద్యార్థులు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు తమ ఫోకస్ పెంచుకోవడానికి దీనిలోని పోమోడోరో టైమర్‌ను ఉపయోగించి సమయాన్ని పర్ఫెక్ట్‌గా మేనేజ్ చేసుకోవచ్చు.
90కి పైగా ప్రశాంతమైన వైట్ నాయిస్ సౌండ్స్
ఈ స్పీకర్‌లోని అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ దాని బిల్ట్-ఇన్ వైట్ నాయిస్ జెనరేటర్. ఇందులో వర్షం పడుతున్న శబ్దం, ఉరుములు, క్యాంప్‌ఫైర్ మంటల చప్పుడు, సముద్రపు అలల సవ్వడి వంటి 90 కంటే ఎక్కువ రకాల ప్రశాంతమైన శబ్దాలు ఉన్నాయి. రాత్రిపూట పడుకునే ముందు ఇవి వినడం వల్ల మనస్సు తేలికపడి త్వరగా నిద్ర పట్టడానికి సహాయపడుతుందని కంపెనీ పేర్కొంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
iPhone 18 Pro Series’ A20 Pro Chipset Appears on Multiple Benchmarking Platforms Showing Performance Gains