Infosys : ఇన్ఫోసిస్‌కు ఫ్రాన్స్ ప్రభుత్వం బిగ్ షాక్.. రూ. 2 కోట్ల జరిమానా విధిస్తూ సంచలన నిర్ణయం

ఫ్రాన్స్ కార్మిక చట్టాల ప్రకారం ప్రతి కంపెనీ తమ ఉద్యోగుల పనివేళల రికార్డులను పక్కాగా నిర్వహించడం తప్పనిసరి.

Infosys : ఇన్ఫోసిస్‌కు ఫ్రాన్స్ ప్రభుత్వం బిగ్ షాక్.. రూ. 2 కోట్ల జరిమానా విధిస్తూ సంచలన నిర్ణయం

Infosys

ముఖ్యాంశాలు
  • ఇన్ఫోసిస్‌కు ఫ్రాన్స్ ప్రభుత్వం బిగ్ షాక్
  • రూ. 2 కోట్ల జరిమానా విధిస్తూ సంచలన నిర్ణయం
  • ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌పై ఫ్రాన్స్ లేబర్ అథారిటీ సీరియస్ యాక్షన్
ప్రకటన

Infosys : భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‎కు ఫ్రాన్స్ లోకల్ లేబర్ అథారిటీ ఐల్-డి-ఫ్రాన్స్ తీవ్ర షాక్ ఇచ్చింది. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల పనివేళలను రికార్డ్ చేసే ట్రాకింగ్ సిస్టమ్‌లో స్థానిక కార్మిక చట్టాలకు అనుగుణంగా లేని లోపాలు ఉన్నట్లు గుర్తించి 1.75 లక్షల యూరోల (దాదాపు రూ. 2 కోట్లు) జరిమానా విధించింది. కంపెనీ సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. ఇన్ఫోసిస్ ఉపయోగిస్తున్న టైమ్-ట్రాకింగ్ సిస్టమ్ కొన్ని వర్గాల ఉద్యోగుల పనివేళలను ఖచ్చితంగా నమోదు చేయడంలో విఫలమైందని ఫ్రాన్స్ అథారిటీ నిర్ధారించింది. సిస్టమ్ యొక్క విశ్వసనీయత, ఆడిట్ చేసే సామర్థ్యం, వర్కింగ్ అవర్స్ పర్యవేక్షణపై అక్కడి అధికారులు కీలక ప్రశ్నలు లేవనెత్తారు.

ఫ్రాన్స్ లేబర్ లాస్ చాలా స్ట్రిక్ట్ 
ఫ్రాన్స్ కార్మిక చట్టాల ప్రకారం ప్రతి కంపెనీ తమ ఉద్యోగుల పనివేళల రికార్డులను పక్కాగా నిర్వహించడం తప్పనిసరి. అవసరమైనప్పుడు సంబంధిత అధికారులకు ఈ రికార్డులను చూపించాల్సి ఉంటుంది, అలాగే ఉద్యోగులు కూడా తమ వర్కింగ్ అవర్స్ వివరాలను చూసుకునే హక్కు కలిగి ఉంటారు. ఈ జరిమానాపై ఇన్ఫోసిస్ స్పందిస్తూ.. ఈ ఫైన్ వల్ల కంపెనీ ఆర్థిక స్థితి, బిజినెస్ లేదా ఇతర కార్యకలాపాలపై ఎలాంటి పెద్ద ప్రభావం ఉండదని తెలిపింది. ప్రస్తుతం ఫ్రాన్స్ అథారిటీ నుంచి వచ్చిన సమాచారాన్ని సమీక్షిస్తున్నామని, తదుపరి చర్యలపై చర్చిస్తున్నామని వెల్లడించింది. అయితే తమ టైమ్-రికార్డింగ్ సిస్టమ్‌ను మార్చాలని ఆదేశాలు వచ్చాయో లేదో కంపెనీ స్పష్టత ఇవ్వలేదు.
 

నారాయణమూర్తి 70 గంటల వ్యాఖ్యలు 
భారత్‌లో ఓవర్ టైమ్, ఎక్కువ గంటలు పనిచేయడంపై ఇన్ఫోసిస్ యాజమాన్యం ప్రోత్సహిస్తున్న సమయంలోనే ఫ్రాన్స్‌లో ఈ ఘటన వెలుగుచూడటం గమనార్హం. ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ ఎన్.ఆర్. నారాయణమూర్తి గతంలో చేసిన వారానికి 70 గంటలు పని చేయాలి అనే వ్యాఖ్యలు ఈ సందర్భంగా మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. భారత్ అంతర్జాతీయంగా పోటీపడాలంటే యవత వారానికి 70 నుంచి 72 గంటలు కష్టపడాలని ఆయన గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఫ్రాన్స్‌లో ప్రైవేట్ రంగానికి చెందిన ఫుల్ టైమ్ ఉద్యోగులకు వారానికి చట్టబద్ధమైన పనివేళలు కేవలం 35 గంటలు మాత్రమే ఉంటాయి, అంతకంటే ఎక్కువ పనిచేస్తే ఓవర్ టైమ్ అలవెన్స్ తప్పనిసరిగా చెల్లించాలి.

ఎక్స్‎లో నెటిజన్ల కౌంటర్లు, మీమ్స్ రచ్చ 
ఫ్రాన్స్ ప్రభుత్వం ఇన్ఫోసిస్‌పై జరిమానా విధించిన వార్త బయటకు రావడంతో నెటిజన్లు ఎక్స్‎లో నారాయణమూర్తి పాత వ్యాఖ్యలను గుర్తుచేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు నెటిజన్లు ఫ్రాన్స్ నిర్ణయాన్ని సమర్థిస్తూ, ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, కుటుంబ జీవితాన్ని పక్కనపెట్టి ఎక్కువ గంటలు పనిచేయించడం సరికాదని పోస్టులు పెడుతున్నారు. మరికొందరు వ్యంగ్యంగా స్పందిస్తూ "ఫ్రాన్స్‌లో పడిన ఈ 2 కోట్ల నష్టాన్ని పూడ్చడానికి ఇన్ఫోసిస్ భారతీయ ఉద్యోగులు ఇప్పుడు వారానికి 140 గంటలు పనిచేయాల్సిందేమో" అంటూ మీమ్స్ షేర్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఈ ఘటనతో మరోసారి వర్క్-లైఫ్ బ్యాలెన్స్, వర్కింగ్ అవర్స్‌పై అంతర్జాతీయంగా తీవ్రమైన చర్చ మొదలైంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Deepfake Alert : మోదీ ఏఐ మార్ఫింగ్ వీడియోల వివాదం.. మెటా ఇండియా హెడ్ పై పోలీస్ కేసు
  2. OnePlus N6x : వన్ ప్లస్ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్.. 7,000mAh బ్యాటరీతో వచ్చిన OnePlus N6x ధర ఎంతంటే?
  3. Sony : గూగుల్ జెమిని ఏఐ, సూపర్ నోయిస్ క్యాన్సిలేషన్‌.. సోనీ నుంచి పవర్ఫుల్ ఆడియో డివైజెస్ లాంచ్
  4. Asus Pad T3201 : టాబ్లెట్ ప్రపంచంలో సరికొత్త హిస్టరీ.. అసుస్ ప్యాడ్ T3201 చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
  5. Nothing Phone (4a) Price Hike : స్మార్ట్‎ఫోన్ లవర్స్‎కు షాకింగ్ న్యూస్.. ఆగస్టు 1 నుంచి భారీగా పెరగనున్న నథింగ్ ఫోన్ ధరలు
  6. Infosys : ఇన్ఫోసిస్‌కు ఫ్రాన్స్ ప్రభుత్వం బిగ్ షాక్.. రూ. 2 కోట్ల జరిమానా విధిస్తూ సంచలన నిర్ణయం
  7. Kerala Boy Cardboard Robot : పాత అట్టపెట్టెలతో అమ్మకి సాయం చేసే రోబోట్.. కేరళ కుర్రాడి వినూత్న ప్రయోగం
  8. Gemini Spark AI : ఆఫీస్ పనులు చేసేసే గూగుల్ AI ఏజెంట్ వచ్చేసింది.. ఇక నిద్రపోతున్నా పనులు అయిపోతాయ్
  9. Vivo Ignite 2026 : విద్యార్థుల ఆవిష్కరణలకు కేరాఫ్ అడ్రస్..  వివో ఇగ్నైట్‌లో రూ. 35 లక్షల స్కాలర్‌షిప్‌లు సాధించే ఛాన్స్
  10. Divoom Portable Speaker : రాత్రిపూట నిద్రపట్టట్లేదా? మీ మైండ్‌ని రిలాక్స్ చేసే దివూమ్ కొత్త బ్లూటూత్ స్పీకర్ వచ్చేసింది
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »