గూగుల్ వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్ I/O లో మొదటగా ప్రకటించిన ఈ ఫీచర్‌ను ఇప్పుడు వినియోగదారులకు అందిస్తోంది. మీరు ఆన్‌లైన్‌లో లేనప్పుడు కూడా మీ స్థానంలో ఇది బాధ్యతలను నెరవేరుస్తుంది.
Photo Credit: Google
Google Gemini Spark
Gemini Spark AI : దిగ్గజ టెక్ సంస్థ గూగుల్ తమ కొత్త అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని పరిచయం చేస్తూ భారతదేశంలో జెమిని స్పార్క్ AI ఏజెంట్‌ను అధికారికంగా అందుబాటులోకి తెచ్చింది. ఇది కేవలం మీ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే చాట్‌బాట్ మాత్రమే కాదు, మీ ఆదేశాల ప్రకారం మీ డిజిటల్ పనులను స్వయంగా పూర్తి చేసే పవర్ఫుల్ పర్సనల్ ఏజెంట్. గూగుల్ వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్ I/O లో మొదటగా ప్రకటించిన ఈ ఫీచర్‌ను ఇప్పుడు వినియోగదారులకు అందిస్తోంది. మీరు ఆన్‌లైన్‌లో లేనప్పుడు కూడా మీ స్థానంలో ఇది బాధ్యతలను నెరవేరుస్తుంది.
జెమిని 3.5 ఆధారంగా పనిచేసే పవర్ ఫుల్ ఏజెంట్
ఈ జెమిని స్పార్క్ ఏజెంట్ అత్యంత పవర్ఫుల్ జెమిని 3.5 మోడల్‌పై ఆధారపడి పనిచేస్తుంది. ఇది జెమిని యాప్‌లో ఒక జనరల్ పర్పస్ AI ఏజెంట్‌లాగా ఉంటూ మీ కనెక్టెడ్ యాప్‌ల సమాచారాన్ని అర్థం చేసుకుని, లాజికల్ గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలదు. మన రోజూవారి డిజిటల్ జీవితాన్ని మరింత సులభంగా, వేగంగా నిర్వహించడంలో ఇది ఎంతో సహాయపడుతుందని గూగుల్ తెలిపింది. అయితే ఇది ఏ పని చేసినా కూడా మీరు ఇచ్చే సూచనలు, అనుమతులకు లోబడి మాత్రమే బాధ్యతలు నెరవేరుస్తుంది.
ఏమేం పనులు చేస్తుందో తెలుసా?
ఈ కొత్త AI ఏజెంట్ మీ వ్యాపార, పర్సనల్ పనులను ఎంతో తెలివిగా నిర్వహిస్తుంది. ఉదాహరణకు మీకు వచ్చిన ఈమెయిల్స్‌కు ఆటోమేటిక్‌గా రీప్లై ఇవ్వడం, సుదీర్ఘమైన మీటింగ్ నోట్స్, డాక్యుమెంట్స్ సమ్మరీని తయారు చేయడం, మీ తరఫున ఆన్‌లైన్‌లో ఆర్డర్లు ప్లేస్ చేయడం వంటి అనేక ముఖ్యమైన పనులను ఇది స్వయంగా చేయగలదు. దీనివల్ల మీరు వేరే పనుల్లో బిజీగా ఉన్నా లేదా ప్రయాణంలో ఉన్నా మీ ఆఫీస్, పర్సనల్ పనులు ఆగిపోవు.
6G Revolution : 5G స్పీడే తట్టుకోలేకపోతున్నాం.. అప్పుడే 6G నా.. భారత్ స్పీడ్ చూస్తే పక్క దేశాల మైండ్ బ్లాంక్
మీరు నిద్రపోతున్నా బ్యాక్‌గ్రౌండ్‌లో పని పూర్తి
ఈ AI ఏజెంట్ మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో నిరంతరం రన్ అవుతూనే ఉంటుంది. అంటే మీరు రాత్రి సమయంలో హాయిగా నిద్రపోతున్నా కూడా ఇది తన పని తాను చేసుకుపోతుంది. ఒకవేళ మీకు ఈ సేవలు తాత్కాలికంగా వద్దనుకుంటే, సింపుల్‌గా టాగుల్ ఆఫ్ చేసే సదుపాయం కూడా ఉంది. అలాగే ఏయే యాప్‌లలో ఈ ఏజెంట్ పని చేయాలి, ఏ యాప్‌లకు అనుమతి ఇవ్వకూడదు అనే పూర్తి కంట్రోల్ యూజర్ల చేతుల్లోనే ఉంటాయి.
ఎవరికి అందుబాటులో ఉంటుంది ?
జెమిని స్పార్క్ ఏజెంట్‌ను గూగుల్ వర్క్‌స్పేస్‌కి అనుసంధానించడానికి ఎలాంటి కష్టమైన సెటప్ ప్రాసెస్ అవసరం లేదు. Google AI Pro, Google AI Ultra పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వినియోగదారులకు ఇది చాలా త్వరలోనే అందుబాటులోకి రానుంది. సబ్‌స్క్రిప్షన్ కలిగిన యూజర్లు జిమెయిల్, గూగుల్ డాక్స్, షీట్స్ వంటి వివిధ వర్క్‌స్పేస్ టూల్స్‌లో నేరుగా ఈ ఏజెంట్‌ను ఉపయోగించి తమ పనులను వేగవంతం చేసుకోవచ్చు.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
iPhone 18 Pro Series’ A20 Pro Chipset Appears on Multiple Benchmarking Platforms Showing Performance Gains