సోనీ WH-1000XX హెడ్‌ఫోన్స్ అత్యంత ప్రీమియం మెటల్ యాక్సెంట్లు, లెదర్ ఫినిషింగ్, మెత్తటి లార్జ్ ఇయర్ కుషన్లతో రూపుదిద్దుకున్నాయి.
Photo Credit: Sony
Sony : ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ దిగ్గజం సోనీ ఇండియా తమ అత్యంత ప్రీమియం శ్రేణికి చెందిన 1000X ది కలెక్షన్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్లు WH-1000XX, WF-1000XM6 ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ రెండు పరికరాలు కూడా సోనీ అభివృద్ధి చేసిన నెక్స్ట్ జనరేషన్ నోయిస్ క్యాన్సిలేషన్ ప్రాసెసర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కాలింగ్ ఫీచర్లు, ఇన్-బిల్ట్ గూగుల్ జెమిని ఏఐ అసిస్టెంట్ ఇంటిగ్రేషన్, హై-రెసొల్యూషన్ ఆడియో మద్దతుతో రంగంలోకి దిగాయి.
ధరలు, లభ్యత వివరాలు ఇవే
భారత్‌లో సోనీ WH-1000XX హెడ్‌ఫోన్స్ ధరను రూ. 59,990గా కంపెనీ నిర్ణయించగా, సోనీ WF-1000XM6 ఇయర్‌బడ్స్ ధరను రూ. 29,990 గా నిర్ణయించారు. హెడ్‌ఫోన్లు బ్లాక్, ప్లాటినం రంగుల్లో లభిస్తుండగా, ఇయర్‌బడ్స్ బ్లాక్, ప్లాటినం సిల్వర్ రంగుల్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు ఉత్పత్తులు ఆగస్టు 7, 2026 అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, సోనీ సెంటర్, ShopAtSC.com వేదికగా అమ్మకానికి రానున్నాయి.
సోనీ WH-1000XX హెడ్‌ఫోన్స్ ఫీచర్లు
సోనీ WH-1000XX హెడ్‌ఫోన్స్ అత్యంత ప్రీమియం మెటల్ యాక్సెంట్లు, లెదర్ ఫినిషింగ్, మెత్తటి లార్జ్ ఇయర్ కుషన్లతో రూపుదిద్దుకున్నాయి. ఇందులో 30mm కస్టమ్ డ్రైవర్ యూనిట్‌తో పాటు హెచ్‌డి నోయిస్ క్యాన్సిలింగ్ ప్రాసెసర్ QN3, ఇంటెగ్రేటెడ్ ప్రాసెసర్ V3 లినేజ్ అమర్చారు. కస్టమర్ల కోసం 12 మైక్రోఫోన్లతో కూడిన మల్టీ నోయిస్ సెన్సార్ సిస్టమ్ బయటి శబ్దాలను పూర్తిగా నిరోధిస్తుంది. దీనితో పాటు 360 రియాలిటీ ఆడియో, 10-బ్యాండ్ ఈక్వలైజర్, గేమింగ్ ఈక్యూ, హెడ్ గెస్టర్ కంట్రోల్స్ ఉన్నాయి. బ్యాటరీ విషయానికొస్తే నోయిస్ క్యాన్సిలేషన్ ఆన్‌లో ఉంటే 24 గంటలు, ఆఫ్ చేస్తే ఏకంగా 32 గంటల ప్లేబ్యాక్ టైమ్ లభిస్తుంది.
Asus Pad T3201 : టాబ్లెట్ ప్రపంచంలో సరికొత్త హిస్టరీ.. అసుస్ ప్యాడ్ T3201 చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
25 శాతం మెరుగైన ఆడియో
మరోవైపు సోనీ WF-1000XM6 ఇయర్‌బడ్స్ మునుపటి మోడల్ ఎక్స్‌ఎమ్5 కంటే 25 శాతం మెరుగైన నోయిస్ రెడ్యూసింగ్‌ను అందిస్తాయని కంపెనీ ప్రకటించింది. ఇందులో ప్రాసెస్ చేయబడిన QN3e చిప్‌సెట్, బోన్ కండక్షన్ సెన్సార్లు ఉన్నాయి, ఇవి ఫోన్ మాట్లాడేటప్పుడు స్పష్టమైన వాయిస్‌ని మాత్రమే గ్రహిస్తాయి. దీనితో పాటు IPX4 వాటర్ రెసిస్టెన్స్, సీన్-బేస్డ్ లిజనింగ్, స్పీక్-టు-చాట్, క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఛార్జింగ్ కేస్‌తో కలిపి ఇది మొత్తం 24 గంటల బ్యాటరీ లైఫ్‌ని ఇస్తుంది. కేవలం 5 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్‌తో సుమారు 50 నిమిషాల పాటు ఆడియోను ఆస్వాదించవచ్చు.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
iPhone 18 Pro Series’ A20 Pro Chipset Appears on Multiple Benchmarking Platforms Showing Performance Gains