భారత్‌లో అసుస్ ప్యాడ్ T3201 బేస్ వేరియంట్ అయిన 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధరను రూ. 45,990గా కంపెనీ నిర్ణయించింది.
Photo Credit: Asus
Asus Pad T3201
Asus Pad T3201 : ప్రముఖ గ్యాడ్జెట్స్ తయారీ సంస్థ అసుస్ భారతీయ వినియోగదారుల కోసం తమ లేటెస్ట్ టాబ్లెట్ అసుస్ ప్యాడ్ T3201ను అధికారికంగా విడుదల చేసింది. ప్రీమియం ఫీచర్లు, అద్భుతమైన బిల్డ్ క్వాలిటీతో వచ్చిన ఈ టాబ్లెట్ మల్టీమీడియా ప్రియులతో పాటు గేమర్లను కూడా విశేషంగా ఆకట్టుకునేలా రూపుదిద్దుకుంది. ఇందులో 12.2 అంగుళాల భారీ OLED డిస్ప్లేను అందించారు. స్మూత్ యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం 144Hz రిఫ్రెష్ రేట్‌ను కేటాయించారు. అలాగే కళ్లకు రక్షణగా లో-బ్లూ లైట్ కోసం ప్రత్యేకమైన సర్టిఫికేషన్‌ను కూడా కంపెనీ అందించడం విశేషం.
ధర, సేల్ వివరాలు ఇవే
భారత్‌లో అసుస్ ప్యాడ్ T3201 బేస్ వేరియంట్ అయిన 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధరను రూ. 45,990గా కంపెనీ నిర్ణయించింది. అలాగే 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ ఉన్న మరొక వేరియంట్ ధర రూ.49,999కి లభించనుంది. ఈ టాబ్లెట్ సేల్స్ ఆగస్టు 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అసుస్ అధికారిక ఆన్లైన్ స్టోర్లతో పాటు రిలయన్స్ డిజిటల్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రధాన ఈ-కామర్స్, రిటైల్ స్టోర్లలో ఇది కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
కళ్లు చెదిరే డిస్ప్లే.. పవర్ఫుల్ ప్రాసెసర్
ఈ టాబ్లెట్‌లో 2800 x 1840 పిక్సెల్స్ రిజల్యూషన్, 3:2 యాస్పెక్ట్ రేషియో కలిగిన 12.2 అంగుళాల OLED డిస్ప్లే ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. హెచ్‌డిఆర్ (HDR) కంటెంట్ చూసేటప్పుడు ఇది ఏకంగా 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్కు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా డాల్బీ విజన్, 100% DCI-P3 కలర్ గేమట్ మరియు కంటి రక్షణ కోసం TÜV Rheinland సర్టిఫికేషన్‌తో వస్తుంది. పెర్ఫార్మెన్స్ విషయంలో రాజీ పడకుండా ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8300 చిప్‌సెట్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ టాబ్లెట్‌లో మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజ్ పెంచుకునే సదుపాయం కూడా ఉంది.
Nothing Phone (4a) Price Hike : స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్.. ఆగస్టు 1 నుంచి భారీగా పెరగనున్న నథింగ్ ఫోన్ ధరలు
బిగ్ బ్యాటరీ సపోర్ట్.. సర్కిల్ టు సెర్చ్ ఫీచర్
కెమెరాల విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఇందులో ఫేస్ అన్‌లాక్‌తో పాటు గుగూల్ లేటెస్ట్ సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో 9,000mAh భారీ బ్యాటరీని అమర్చగా, ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల కేవలం 30 నిమిషాల్లోనే 0 నుంచి 50 శాతం వరకు ఛార్జింగ్ పూర్తవుతుందని కంపెనీ చెబుతోంది. కేవలం 6.5ఎంఎం మందం, 523 గ్రాముల బరువుతో చాలా స్లిమ్‌గా ఉండే ఈ టాబ్లెట్‌లో డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో కూడిన క్వాడ్-స్పీకర్ల వ్యవస్థ ఉంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy S26 FE Camera Specifications Leaked Ahead of Expected Launch, May Reuse Its Predecessor's Main Rear Camera