ఇందులో 16-ఇంచుల IPS 2.5K డిస్‌ప్లేను అందించారు. ఇది 2560x1600 పిక్సెల్స్ రెసల్యూషన్, 16:10 ఆస్పెక్ట్ రేషియో, 300 నిట్స్ బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది.
Photo Credit: COLORFUL
COLORFUL Rimbook L1 Plus
COLORFUL Rimbook L1 Plus : ప్రముఖ టెక్నాలజీ ఉత్పత్తుల తయారీ సంస్థ కలర్‌ఫుల్ భారత వినియోగదారుల కోసం తన సరికొత్త ల్యాప్‌టాప్ కలర్‌ఫుల్ రీమ్‌బుక్ L1 ప్లస్‌ను అధికారికంగా పరిచయం చేసింది. ముఖ్యంగా స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, కంటెంట్ క్రియేటర్స్, రోజువారీ మల్టీటాస్కింగ్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఈ ల్యాప్‌టాప్‌ను రూపొందించారు. ప్రీమియం మ్యాట్ మెటల్ టాప్ కవర్‌తో వచ్చే ఈ డివైజ్, చూడటానికి ఎంతో స్టైలిష్‌గా ఉండటమే కాకుండా హ్యాండ్లింగ్‌లో చాలా తేలికగా అనిపిస్తుంది.
కళ్లు చెదిరే 2.5K డిస్‌ప్లే, స్మూత్ రిఫ్రెష్ రేట్
డిస్‌ప్లే విషయంలో ఈ ల్యాప్‌టాప్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఇందులో 16-ఇంచుల IPS 2.5K డిస్‌ప్లేను అందించారు. ఇది 2560x1600 పిక్సెల్స్ రెసల్యూషన్, 16:10 ఆస్పెక్ట్ రేషియో, 300 నిట్స్ బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఏకంగా 92.52% స్క్రీన్-టు-బాడీ రేషియో, 100% sRGB కలర్ గామట్ కలిగి ఉండటం వల్ల ఫొటోగ్రాఫర్లు, గ్రాఫిక్ డిజైనర్లు, వీడియో ఎడిటర్లకు ఖచ్చితమైన కలర్స్, షార్ప్ ఇమేజ్ డిస్‌ప్లే అనుభూతి లభిస్తుంది.
పవర్‌ఫుల్ ప్రాసెసర్, స్టోరేజ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్
ఈ ల్యాప్‌టాప్ విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. హెవీ టాస్క్‌లు, ఎడిటింగ్ పనుల కోసం ఇందులో AMD రైజెన్ 7 7735HS పవర్‌ఫుల్ ప్రాసెసర్, AMD రేడియాన్ 680M గ్రాఫిక్స్ కార్డ్ అందించారు. దీనికి తోడు 16GB LPDDR5-6400 RAM, 512GB PCIe Gen4 NVMe SSD స్టోరేజ్ అందుబాటులో ఉంది. వినియోగదారులు ఆఫీస్, స్కూల్ లేదా వ్యక్తిగత పత్రాలను సులభంగా క్రియేట్ చేసుకునేందుకు ఇందులో WPS ఆఫీస్ సాఫ్ట్‌వేర్ ముందస్తుగానే ఇన్‌స్టాల్ చేసి వస్తుంది.
స్లిమ్ డిజైన్, ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ కనెక్టివిటీ
కనెక్టివిటీ పరంగా ఈ ల్యాప్‌టాప్‌లో వై-ఫై 6, బ్లూటూత్ 5.2, టైప్-సి పోర్ట్‌లతో సహా పలు అధునాతన ఆప్షన్లు ఉన్నాయి. రోజంతా సులభంగా వాడేందుకు 65Wh బ్యాటరీని అమర్చారు, ఇది 65W USB టైప్-సి PD ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇక బాడీ కొలతల విషయానికొస్తే, ఈ ల్యాప్‌టాప్ మందం కేవలం 16.65 మిమీ, బరువు 1.4 కిలోలు మాత్రమే ఉంటుంది. దీని వల్ల ప్రయాణాల్లో వెంట తీసుకెళ్లడం చాలా ఈజీ. ఈ ల్యాప్‌టాప్ ధర, సేల్స్ అందుబాటు వివరాలను కంపెనీ త్వరలోనే ప్రకటించనుంది.
ప్రకటన
ప్రకటన