అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్‌ఎక్స్ తయారుచేసిన ఒక భారీ రాకెట్ త్వరలోనే చంద్రుడి ఉపరితలాన్ని అత్యంత వేగంగా ఢీకొట్టబోతోంది.
Photo Credit: सांकेतिक फोटो
SpaceX Falcon 9
SpaceX Falcon 9 : ప్రముఖ బిలియనీర్ ఏలన్ మస్క్‌కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్‌ఎక్స్ తయారుచేసిన ఒక భారీ రాకెట్ త్వరలోనే చంద్రుడి ఉపరితలాన్ని అత్యంత వేగంగా ఢీకొట్టబోతోంది. గతంలో లాంచ్ చేసిన ఫాల్కన్ 9 రాకెట్‌కు చెందిన అప్పర్ స్టేజ్ భాగం ప్రస్తుతం అంతరిక్షంలో భ్రమిస్తూ నేరుగా చందమామ వైపు ప్రయాణిస్తోంది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ విచిత్ర సంఘటన జరగనుందని అంతరిక్ష పరిశోధకులు వెల్లడించారు. విశేషమేమిటంటే..ఈ అరుదైన దృశ్యాన్ని భూమి పైనుంచి కూడా వీక్షించే అవకాశం ఉంటుందని సమాచారం.
2025 లూనార్ మిషన్ అప్పర్ పార్ట్ కథ ఇది
స్పేస్‌ఎక్స్ సంస్థ 2025 జనవరి 15న రెండు లూనార్ ల్యాండర్లను అంతరిక్షంలోకి పంపేందుకు ఫాల్కన్ 9 రాకెట్‌ను ప్రయోగించింది. ఆ మిషన్ విజయవంతమై ల్యాండర్లు తమ లక్ష్యాన్ని చేరుకున్నప్పటికీ రాకెట్ పైభాగం (అప్పర్ స్టేజ్) మాత్రం స్పేస్‌లోనే ఉండిపోయింది. ఆ సమయంలో కక్ష్యలో తిరుగుతూ ఉండిపోయిన ఈ భాగం మెల్లగా చంద్రుని గురుత్వాకర్షణకు లోనై ఇప్పుడు దాని వైపు దూసుకెళ్తోంది. ఈ భారీ రాకెట్ ముక్క పొడవు 12 మీటర్లు, వెడల్పు 4 మీటర్లు కాగా, దీని బరువు ఏకంగా 4,000 కిలోగ్రాములు (4 టన్నులు) ఉంటుంది.
గంటకు 8700 కిమీ వేగంతో ఆగస్టు 5న ఢీ
పరిశోధకుల అంచనా ప్రకారం.. ఈ ఫాల్కన్ 9 అప్పర్ స్టేజ్ 2026 ఆగస్టు 5వ తేదీన చంద్రుడి ఉపరితలాన్ని అత్యంత వేగంగా తాకనుంది. ఆ సమయంలో రాకెట్ వేగం గంటకు ఏకంగా 8,700 కిలోమీటర్లుగా ఉండబోతోంది. అంతటి రాకెట్ వేగంతో చంద్రుడిని ఢీకొట్టడం వల్ల అక్కడ ఒక భారీ విధ్వంసమే జరగనుంది. ఈ దెబ్బకు చందమామపై సుమారు 30 మీటర్ల వెడల్పు, 5 మీటర్ల లోతు కలిగిన ఒక పెద్ద బిలం ఏర్పడుతుందని, పెద్ద ఎత్తున మట్టి, శిథిలాలు అంతరిక్షంలోకి ఎగిరిపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు.
భూమి పైనుంచి ఎలా చూడాలి?
ఈ అరుదైన దృశ్యాన్ని భూమి పైనుంచి వీక్షించడానికి సైంటిస్టులు కొన్ని సూచనలు చేశారు. కాంతి కాలుష్యం లేని, వీధి దీపాలు, నగర వెలుగులు లేని పూర్తి చీకటి ప్రాంతాల నుంచి స్పష్టమైన ఆకాశం ఉన్నప్పుడు దీనిని చూడవచ్చు. అయితే దీనిని నేరుగా కళ్లతో చూడడం సాధ్యం కాదు, కచ్చితంగా మంచి సామర్థ్యం ఉన్న టెలిస్కోప్ అవసరమవుతుంది. ఈ ఘటన వల్ల చంద్రుడి వాతావరణంపై ఎలాంటి ప్రభావం పడుతుందో అధ్యయనం చేసేందుకు సైంటిస్టులు ఆసక్తిగా ఉన్నారు. ఆస్ట్రోనమీ పై ఆసక్తి ఉన్నవారికి ఇది ఒక గొప్ప అవకాశంగా మారనుంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
iPhone 18 Pro Series’ A20 Pro Chipset Appears on Multiple Benchmarking Platforms Showing Performance Gains