ప్రస్తుతం మనం వాడుతున్న పాస్‌వర్డ్‌లు, ఎన్‌క్రిప్షన్ అల్గారిథమ్‌లు సాధారణ కంప్యూటర్ల సామర్థ్యానికి అనుగుణంగా డిజైన్ చేసినవని పేర్కొన్నారు.
Photo Credit: Unsplash
Cyber Security : నేడు మనం ఉపయోగిస్తున్న ఆన్‌లైన్ బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్లు, ప్రభుత్వ డేటా వ్యవస్థలు, వ్యక్తిగత భద్రత అంతా ఎన్‌క్రిప్షన్ టెక్నాలజీ పైనే ఆధారపడి ఉన్నాయి. అయితే భవిష్యత్తులో ఈ సెక్యూరిటీ సిస్టమ్‌లు పూర్తిగా నిరుపయోగంగా మారే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్‌కు చెందిన ప్రముఖ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు, టెల్ అవీవ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మేజర్ జనరల్ (రిటైర్డ్) ఐజాక్ బెన్-ఇజ్రాయెల్ ప్రకారం.. పూర్తి సామర్థ్యంతో కూడిన క్వాంటమ్ కంప్యూటర్లు అందుబాటులోకి వస్తే, ప్రస్తుతం ఉన్న ఎన్‌క్రిప్షన్ వ్యవస్థలను క్షణాల వ్యవధిలోనే ఛేదించవచ్చని తెలిపారు. ఇది సైబర్ సెక్యూరిటీ రంగానికి అతిపెద్ద సవాలుగా మారనుందని ఆయన వెల్లడించారు.
ఎన్‌క్రిప్షన్ కోడ్‌లు ఎందుకు నిలవవు?
జెరూసలేం పోస్ట్ పోడ్కాస్ట్లో మాట్లాడిన ప్రొఫెసర్ బెన్-ఇజ్రాయెల్, ప్రస్తుతం మనం వాడుతున్న పాస్‌వర్డ్‌లు, ఎన్‌క్రిప్షన్ అల్గారిథమ్‌లు సాధారణ కంప్యూటర్ల సామర్థ్యానికి అనుగుణంగా డిజైన్ చేసినవని పేర్కొన్నారు. అయితే అత్యంత శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చిన తర్వాత ఈ పాత సెక్యూరిటీ పద్ధతులు ఏమాత్రం పనిచేయవని స్పష్టం చేశారు. సాధారణ కంప్యూటర్లు 0, 1 (బైనరీ సిస్టమ్) ఆధారంగా పనిచేస్తాయి. కానీ క్వాంటమ్ కంప్యూటర్లు క్వాంటమ్ బిట్ టెక్నాలజీని ఉపయోగిస్తాయి. దీనివల్ల ఒకే సమయంలో వేలాది గణనలను అత్యంత వేగంగా చేయగలవు. ప్రస్తుత సూపర్ కంప్యూటర్లకు వేల సంవత్సరాలు పట్టే పనిని, క్వాంటమ్ కంప్యూటర్లు సెకన్లలో పూర్తి చేయగలవని ఆయన తెలిపారు.
డేటా భద్రతపై ప్రత్యక్ష ప్రభావం
ఈ టెక్నాలజీ కేవలం కంప్యూటర్ ప్రాసెసింగ్ వేగాన్ని పెంచడం మాత్రమే కాదు, డేటా భద్రతను కాపాడే ఎన్‌క్రిప్షన్ కోడ్‌లను సులువుగా విచ్ఛిన్నం చేస్తుంది. క్వాంటమ్ కంప్యూటర్లు నేరుగా సిస్టమ్‌లను హ్యాక్ చేయకుండా, డేటాను రక్షించే ఎన్‌క్రిప్షన్ సీక్రెట్ కీలను క్షణాల్లో అంచనా వేస్తాయి. దీనివల్ల మన పాస్‌వర్డ్‌లు, సీక్రెట్ పిన్ నంబర్లు హ్యాకర్ల చేతికి సులభంగా చిక్కే ప్రమాదం ఉందట. ఈ ముప్పును ముందుగానే పసిగట్టిన ప్రపంచ దేశాలు, పెద్ద పెద్ద టెక్ కంపెనీలు ఇప్పటి నుంచే పోస్ట్-క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ అభివృద్ధిపై దృష్టి సారించాయి.
Redmi Note 17 : త్వరలోనే మార్కెట్‌లోకి రెడ్‌మీ నోట్ 17 సిరీస్.. గ్లోబల్ లీక్స్ ద్వారా మోడళ్లు, ధరలు లీక్
రక్షణ మార్గాలు, ప్రపంచ దేశాల ప్రయోగాలు
ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవడానికి ప్రధానంగా రెండు మార్గాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. మొదటిది, క్వాంటమ్ కంప్యూటర్లు కూడా హ్యాక్ చేయలేని కొత్త తరహా ఎన్‌క్రిప్షన్ అల్గారిథమ్‌లను అభివృద్ధి చేయడం. ఇలాంటివి ఇప్పటికే అందుబాటులోకి వస్తున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేయడానికి కనీసం 10 సంవత్సరాల సమయం పడుతుంది. రెండో మార్గం క్వాంటమ్ కమ్యూనికేషన్. ఇందులో క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని వాడి డేటాను సురక్షితంగా పంపుతారు. ఈ టెక్నాలజీలో సాంప్రదాయ సిగ్నల్స్ ఉండవు కాబట్టి మధ్యలో డేటాను దొంగిలించడం అసాధ్యం. కాగా చైనా ఇప్పటికే ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్ ప్రయోగాల కోసం ప్రత్యేక శాటిలైట్‌ను అంతరిక్షంలోకి పంపగా, టెల్ అవీవ్ విశ్వవిద్యాలయం కూడా రీసెర్చ్ నిమిత్తం ఒక శాటిలైట్‌ను ప్రయోగించింది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,590
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹41,061
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999