జూన్ 2026 లో దేశవ్యాప్తంగా దాదాపు 53.8 లక్షల మంది (5,383,415) కొత్త మొబైల్ సబ్‌స్క్రైబర్లు పెరిగారు.
Photo Credit: Pexels/Pascal
Airtel Vs Jio : భారత టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) ఇటీవల జూన్ 2026 నెలకి సంబంధించిన టెలికాం సబ్‌స్క్రిప్షన్ నివేదికను విడుదల చేసింది. ఈ వివరాల ప్రకారం దేశంలో కొత్త మొబైల్ కస్టమర్లను ఆకర్షించడంలో భారతీ ఎయిర్‌టెల్ అగ్రస్థానంలో నిలిచి సంచలనం సృష్టించింది. దిగ్గజ సంస్థ రిలయెన్స్ జియోను దాటుకుని ఎయిర్‌టెల్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. జూన్ నెలలో దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా, ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ తమ కస్టమర్ల సంఖ్యను పెంచుకోగా, మరొక ప్రభుత్వ సంస్థ ప్రభుత్వ ఎంటీఎన్‌ఎల్ మాత్రం యూజర్లను కోల్పోయింది.
ఎయిర్‌టెల్ వర్సెస్ జియో
జూన్ 2026 లో దేశవ్యాప్తంగా దాదాపు 53.8 లక్షల మంది (5,383,415) కొత్త మొబైల్ సబ్‌స్క్రైబర్లు పెరిగారు. ఇందులో అత్యధికంగా ఎయిర్‌టెల్ ఏకంగా 29.89 లక్షల (2,989,976) కంటే ఎక్కువ మంది కొత్త వినియోగదారులను తన ఖాతాలో వేసుకుంది. ఇక రెండో స్థానంలో నిలిచిన రిలయెన్స్ జియో 21.46 లక్షల (2,146,980) కొత్త యూజర్లను పొందింది. ఆశ్చర్యకరంగా వొడాఫోన్ ఐడియా కూడా కోలుకుంటూ 1.63 లక్షల (163,757) మందిని, బిఎస్‌ఎన్‌ఎల్ 94,006 మంది కొత్త వైర్‌లెస్ కస్టమర్లను జోడించాయి. అయితే MTNL మాత్రం 11,284 మంది కస్టమర్లను కోల్పోయి నష్టాల్లో నిలిచింది.
మొత్తం మార్కెట్ షేర్ లో ఎవరు టాప్?
కొత్త కస్టమర్లలో ఎయిర్‌టెల్ టాప్‌లో ఉన్నప్పటికీ, దేశంలో మొత్తం సబ్‌స్క్రైబర్ల సంఖ్య, మార్కెట్ షేర్ పరంగా రిలయెన్స్ జియోనే ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. జూన్ ముగిసే నాటికి జియో వద్ద 50.35 కోట్లు (503.58 మిలియన్లు) సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. దీంతో జియో మార్కెట్ వాటా 39.27 శాతంగా ఉంది. రెండో స్థానంలో ఉన్న ఎయిర్‌టెల్ 48.68 కోట్ల (486.80 మిలియన్లు) కస్టమర్లతో 37.96 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇక వొడాఫోన్ ఐడియా 19.88 కోట్ల యూజర్లతో (15.50%) మూడో స్థానంలో, బిఎస్‌ఎన్‌ఎల్ 9.30 కోట్ల యూజర్లతో (7.25%) నాలుగో స్థానంలో ఉన్నాయి. దేశ వైర్‌లెస్ మార్కెట్‌లో ప్రైవేట్ ఆపరేటర్ల వాటా ఏకంగా 92.73 శాతంగా ఉండగా, ప్రభుత్వ సంస్థల వాటా 7.27 శాతానికి పరిమితమైంది.
Apple : యాపిల్ మైండ్ బ్లాకింగ్ ప్లాన్.. త్వరలోనే మార్కెట్‌లోకి ఫస్ట్ టచ్‌స్క్రీన్ ఓఎల్‌ఈడీ మ్యాక్‌బుక్ ప్రో
5G FWA లో జియోదే ఆధిపత్యం
దేశంలో వైర్‌లెస్ టెలి-డెన్సిటీ మే నాటి 90.61% నుంచి జూన్ చివరి నాటికి 90.96% కి పెరిగింది. మరోవైపు 5G ఫైబర్/హోమ్ ఇంటర్నెట్ (5G FWA) విభాగంలో జియో ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. జూన్ చివరి నాటికి దేశంలో మొత్తం 5G FWA సబ్‌స్క్రైబర్ల సంఖ్య 1.29 కోట్లకు (12.93 మిలియన్లు) చేరింది. ఇందులో రిలయెన్స్ జియో ఒక్క నెలలోనే 1.45 లక్షల మందిని చేర్చుకుని మొత్తం 91.14 లక్షల 5G FWA యూజర్లతో మొదటి స్థానంలో ఉంది. ఎయిర్‌టెల్ 56,773 మంది కొత్త సబ్‌స్క్రైబర్లతో మొత్తం 38.21 లక్షల FWA కస్టమర్లను కలిగి ఉంది. ఇక UBR FWA విభాగంలో జియో వద్ద జూన్ నాటికి 49.34 లక్షల మంది యూజర్లు ఉన్నారు.
ప్రకటన
ప్రకటన
Honor X6e Launched With MediaTek Helio G81 Ultra SoC, 7,500mAh Battery: Price, Specifications