Lenovo Legion R9000P Gaming Laptop launched: టెక్నాలజీ పరంగా సరికొత్త రికార్డు సృష్టించిన ఈ ల్యాప్‌టాప్, రాబోయే రోజుల్లో గేమింగ్, ప్రొఫెషనల్ డిజైనింగ్ రంగాలలో డిస్‌ప్లే నాణ్యతను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు
Photo Credit: PR Newswire
Lenovo Legion R9000P
Lenovo Legion R9000P Gaming Laptop launched: ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్ లెనోవో ల్యాప్‌టాప్ ప్రియుల కోసం ఒక సరికొత్త సంచలన డివైజ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ఇంక్‌జెట్ ప్రింటెడ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో పనిచేసే సరికొత్త గేమింగ్ ల్యాప్‌టాప్ లెనోవో లెజియన్ R9000Pను కంపెనీ అధికారికంగా లాంచ్ చేసింది. టెక్నాలజీ పరంగా సరికొత్త రికార్డు సృష్టించిన ఈ ల్యాప్‌టాప్, రాబోయే రోజుల్లో గేమింగ్, ప్రొఫెషనల్ డిజైనింగ్ రంగాలలో డిస్‌ప్లే నాణ్యతను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
ఏమిటీ ఐజేపీ ఓఎల్ఈడీ టెక్నాలజీ..?
ఈ ల్యాప్‌టాప్‌లో వాడిన సరికొత్త స్క్రీన్‌ను టెక్నికల్ భాషలో ఐజేపీ ఓఎల్ఈడీ డిస్‌ప్లే అని కూడా పిలుస్తారు. ఇది డిస్‌ప్లేలను తయారు చేసే అత్యంత ఆధునిక, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ. ఈ పద్ధతిలో మైక్రోస్కోపిక్ ఇంక్‌జెట్ నాజిల్‌ను ఉపయోగించి, ఒక ప్రత్యేకమైన లిక్విడ్ లైట్ ఎమిటింగ్ మెటీరియల్‌ను గ్లాస్ లేదా ప్లాస్టిక్ షీట్‌పై స్ప్రే చేస్తారు. దీనివల్ల సాధారణ ఓఎల్ఈడీ స్క్రీన్ల తయారీకి అవసరమయ్యే అత్యంత ఖరీదైన వాక్యూమ్ ఎవాపరేషన్ పరికరాలు, మెటల్ మాస్క్‌ల అవసరం అస్సలు ఉండదు. ఈ టెక్నాలజీ వల్ల ల్యాప్‌టాప్ తయారీ ప్రక్రియ చాలా వేగంగా అవ్వడమే కాకుండా, ప్రొడక్షన్ ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుంది.
టెక్స్ట్ బ్లర్ అవ్వదు, పిక్చర్స్ అదిరిపోతాయి..
ఫీచర్ల విషయానికి వస్తే, ఈ గేమింగ్ ల్యాప్‌టాప్ 16 ఇంచుల భారీ స్క్రీన్ సైజుతో వస్తుంది. గేమర్స్ కు అదిరిపోయే స్మూత్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం ఇందులో ఏకంగా 240Hz హై-రిఫ్రెష్ రేట్‌ను అందించారు. ఈ డిస్‌ప్లేలో రియల్ ఆర్‌జీబీ స్ట్రైప్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇది సబ్‌పిక్సెల్స్‌ను పక్కపక్కనే అమరుస్తుంది. దీనివల్ల సాధారణ ఓఎల్ఈడీ స్క్రీన్లలో కనిపించే త్రిభుజాకార లేఅవుట్ లోపం తలెత్తదు. ఫలితంగా స్క్రీన్‌పై ఉన్న అక్షరాలు అస్సలు బ్లర్ అవ్వకుండా చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే కలర్ ఫ్రింజింగ్ సమస్య లేకపోవడం వల్ల ఇమేజ్ క్వాలిటీ, వీడియో విజువల్స్ క్రిస్టల్ క్లియర్‌గా ఉంటాయి.
Nvidia GeForce : గేమర్లకు బంపర్ ఆఫర్.. ఎన్విడియా నుంచి మోస్ట్ అవేటెడ్ జీఫోర్స్ నౌ క్లౌడ్ గేమింగ్ లాంచ్
ప్రొఫెషనల్స్ కోసం 99% DCI-P3 కలర్ రేంజ్..
ఈ సరికొత్త ల్యాప్‌టాప్ డిస్‌ప్లే 99% DCI-P3 కలర్ గేమట్ కవరేజ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనివలన మీరు ల్యాప్‌టాప్‌ను ఏ బ్రైట్‌నెస్ లెవెల్‌లో ఉంచినా సరే, స్క్రీన్‌పై కనిపించే కలర్ క్వాలిటీ అస్సలు మారదు. కలర్ పర్ఫార్మెన్స్ ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఈ ప్రత్యేక ఫీచర్ వల్ల కేవలం హై-ఎండ్ గేమింగ్ ఆడేవారికే కాకుండా ప్రొఫెషనల్ గ్రాఫిక్ డిజైనర్లు, వీడియో ఎడిటర్లు, ఆడియో-విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రియులకు ఈ ల్యాప్‌టాప్ ఒక అద్భుతమైన డివైజ్‌గా మారనుంది.
ధర ఎంత ఉండబోతోంది..?
లెనోవో కంపెనీ ఈ ల్యాప్‌టాప్‌ను గ్రాండ్‌గా అనౌన్స్ చేసినప్పటికీ.. దీని ధర, ఇతర పూర్తి స్పెసిఫికేషన్ల (ఇంజన్, ప్రాసెసర్, ర్యామ్ వంటి వివరాలు) గురించి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారాన్ని బయటపెట్టలేదు. అయితే ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ఐజేపీ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను పరిచయం చేసిన ల్యాప్‌టాప్ కాబట్టి దీని ధరపై టెక్ మార్కెట్లో భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ఈ ల్యాప్‌టాప్ సేల్స్ డేట్, ప్రైస్ డీటెయిల్స్‌ను బ్రాండ్ అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. డిస్‌ప్లే టెక్నాలజీలో సరికొత్త అనుభూతిని పొందాలనుకునే వారు ఈ ల్యాప్‌టాప్ కోసం మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
iPhone 18 Pro Series’ A20 Pro Chipset Appears on Multiple Benchmarking Platforms Showing Performance Gains