Nvidia GeForce launched for Gamers in India:: ఎన్విడియా జీఫోర్స్ నౌ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించి ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ ప్లాట్‌ఫామ్ సొంతంగా ఎలాంటి గేమ్స్ లైబ్రరీని కస్టమర్లకు ఉచితంగా అందించదు.
Photo Credit: Nvidia
Nvidia GeForce Now
Nvidia GeForce Launched for Gamers in India: భారతీయ గేమింగ్ ప్రియులకు అంతర్జాతీయ గ్రాఫిక్స్ దిగ్గజం ఎన్విడియా ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న తన క్లౌడ్ గేమింగ్ సర్వీస్ జీఫోర్స్ నౌను అధికారికంగా భారత మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సర్వీస్ వల్ల గేమర్లకు వచ్చే అతిపెద్ద లాభం ఏంటంటే.. ఇకపై హెవీ గ్రాఫిక్స్ ఉన్న పీసీ గేమ్స్ ఆడటానికి లక్షల రూపాయలు ఖర్చు చేసి హై-ఎండ్ గేమింగ్ కంప్యూటర్లు లేదా ఖరీదైన ల్యాప్‌టాప్‌లు కొనాల్సిన అవసరం లేదు. కేవలం సాధారణ ల్యాప్‌టాప్, మొబైల్ లేదా టాబ్లెట్ ఉంటే చాలు.. ఇంటర్నెట్ సాయంతో నేరుగా క్లౌడ్ ద్వారా భారీ గేమ్స్‌ను చాలా స్మూత్‌గా ఆడేయవచ్చు. భారతదేశంలో ఈ సర్వీస్ అత్యంత వేగవంతమైన RTX 5080 SuperPOD ఇన్ఫ్రాస్ట్రక్చర్పై రన్ అవుతుందని ఎన్విడియా వెల్లడించింది.
ఎన్విడియా జీఫోర్స్ నౌ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించి ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ ప్లాట్‌ఫామ్ సొంతంగా ఎలాంటి గేమ్స్ లైబ్రరీని కస్టమర్లకు ఉచితంగా అందించదు. అంటే, మీరు ఇప్పటికే స్టీమ్, ఎపిక్ గేమ్స్ స్టోర్ లేదా ఇతర సపోర్టెడ్ ప్లాట్‌ఫామ్‌లలో కొనుగోలు చేసిన గేమ్స్‌ను ఇక్కడ ఆడుకోవచ్చు. దీనికోసం మీ పాత గేమింగ్ అకౌంట్లను జీఫోర్స్ నౌ ప్లాట్‌ఫామ్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా దాదాపు 4,500 కంటే ఎక్కువ పాపులర్ గేమ్స్‌ను చాలా సులభంగా ఇన్స్టాల్ చేసుకుని ఆడే సదుపాయాన్ని కల్పించారు.
భారత్‌లో ఈ క్లౌడ్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఎన్విడియా సరికొత్త బ్లాక్వెల్ ఆర్టీఎక్స్ ఆర్కిటెక్చర్‌పై నడిచే సూపర్ కంప్యూటర్ సర్వర్ల సాయంతో ఆపరేట్ చేయనుంది. దీనివల్ల గేమ్ ఆడేటప్పుడు ఎలాంటి లాగ్స్ లేదా డిలే లేకుండా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. ఇందులో ఆర్టీఎక్స్ రే ట్రేసింగ్, హెచ్డీఆర్ 10 వంటి హై-ఎండ్ ఫీచర్లతో పాటు అల్ట్రావైడ్ మానిటర్లకు కూడా సపోర్ట్ లభిస్తుంది. క్లౌడ్ సర్వర్ బ్యాకెండ్‌లో రైడర్లకు 16-కోర్ vCPU, 56GB ర్యామ్, 48GB ఫ్రేమ్ బఫర్ లాంటి అపరిమిత కంప్యూటింగ్ పవర్ లభిస్తుంది. అంటే ఎంతటి హెవీ గేమ్ అయినా చాలా సునాయాసంగా రన్ అవుతుందన్నమాట.
Xiaomi : స్మార్ట్‌ఫోన్ యూజర్లకు షియోమీ బంపర్ ఆఫర్.. తక్కువ ధరలోనే 20000mAh మెగా పవర్‌బ్యాంక్ లాంచ్
గేమ్స్ డేటా, డౌన్లోడ్ల కోసం ఎన్విడియా తన సబ్స్క్రైబర్స్ అందరికీ 100GB వరకు ఉచిత సింగిల్-సెషన్ క్లౌడ్ స్టోరేజ్‌ను ఆఫర్ చేస్తోంది. ఒకవేళ గేమ్ సైజ్ పెద్దగా ఉండి మరింత స్టోరేజ్ కావాలనుకుంటే అదనపు చార్జీలు చెల్లించి క్లౌడ్ మెమరీని పెంచుకోవచ్చు. మీరు ఇన్స్టాల్ చేసే గేమ్స్ అన్నీ ఈ క్లౌడ్ కోటాలోనే సేవ్ అవుతాయి. భారతీయ కస్టమర్లను ఆకర్షించేందుకు ఎన్విడియా ఇందులో పేమెంట్స్ కోసం యూపీఐ ఆప్షన్‌ను కూడా జోడించింది. భవిష్యత్తులో యాడ్స్ ప్లే అయ్యే ఒక ఫ్రీ ప్లాన్‌ను కూడా తీసుకురాబోతున్నట్లు వెబ్సైట్లో పేర్కొన్నప్పటికీ, దాని లభ్యతపై ఇంకా అధికారిక క్లారిటీ ఇవ్వలేదు.
ఈ సర్వీస్ కోసం ఎన్విడియా ఇండియాలో రెండు రకాల ప్లాన్స్‌ను ప్రవేశపెట్టింది. మొదటిది Performance ప్లాన్ - దీని ధర నెలకు రూ.999గా ఉంది. ఇందులో 1440p రిజల్యూషన్, 60fps వేగంతో గేమ్స్ ఆడుకోవచ్చు. రెండవది Ultimate ప్లాన్ - దీని ధర నెలకు రూ.1,999. ఇందులో అత్యంత స్పష్టమైన 5K రిజల్యూషన్, 120fps అల్ట్రా స్మూత్ ఫ్రేమ్ రేట్‌తో గేమింగ్ ఎంజాయ్ చేయవచ్చు. అల్టిమేట్ ప్లాన్ యూజర్లకు సర్వర్ కనెక్టివిటీలో మొదటి ప్రాధాన్యతతో పాటు ఎక్కువ సమయం గేమ్స్ ఆడుకునే వీలుంటుంది. కేవలం ఒక రోజు ట్రై చేయాలనుకునే వారి కోసం రూ.399, రూ.799 ధరలతో డే పాస్‌లు కూడా తెచ్చారు. అంతేకాదు ప్రారంభంలో ఈ సబ్స్క్రిప్షన్ తీసుకునే వారికి మొదటి మూడు నెలల పాటు ఫ్లాట్ 20 శాతం డిస్కౌంట్ లభించనుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Cyberpunk 2077 Gets New Quests, Gameplay Features and Mod Support With Edgerunners 2 Update