Photo Credit: CMF By Nothing
CMF ఫోన్ 2 ప్రో 256GB వరకు ఆన్‌బోర్డ్ నిల్వతో అమర్చబడింది
ఇండియాలో గత ఏడాది పరిచయం అయిన CMF ఫోన్ 1కు కొనసాగింపుగా CMF ఫోన్ 2 ప్రో దేశీయ మార్కెట్‌లోకి అడుగుపెడుతోంది. దీనికి 120 హెచ్‌జెడ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.77 అంగుళాల AMOLED డిస్‌ప్లేను అందించారు. అలాగే, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో పోసెసర్‌తో ఇది శక్తిని గ్రహిస్తుంది. అంతేకాదు, 50- మెగాపిక్సెల్ ప్రైమరీ కెమారాతో కూడిన ట్రిపుల్ కెమారాను యూనిట్‌ను అటాచ్ చేశారు. నాలుగు కలర్ ఆప్షన్‌లలో వస్తోన్న ఈ మొబైల్ ఐపీ54- రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంటుంది.మే 5 నుంచి అమ్మకానికి,8జీబీ+128జీబీ ర్యామ్ స్టోరేజీ వేరియంట్ CMF ఫోన్ 2 ప్రో ధర మన దేశంలో రూ. 18999గా ఉంది. దీంతోపాటు లేత ఆకుపచ్చ, నారింజ, తెలుపు, నలుపు కలర్ ఆప్షన్‌లలో ఇది CMF ఇండియా వైబ్‌సైట్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్‌లో మే 5 నుంచి అమ్మకానికి అందుబాటులోకి రానుంది. వినియోగదారులు హెడీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, ఎస్‌బీఐ కార్డుల ద్వారా కొనుగోలుపై రూ. 1000 డిస్కౌంట్‌ను సొంతం చేసుకోవచ్చు.
ఆండ్రాయిడ్ 15- ఆధారిత నథింగ్ ఓఎస్ 3.2తో ఈ కొత్త మోడల్ రన్ అవుతుంది. మూడేళ్ల ప్రైమరీ ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లతోపాటు ఆరేళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను పొందుతుందని కంపెనీ ప్రకటించింది. దీని డిస్‌ప్లే హెఛ్‌డీఆర్10+ సపోర్ట్, పాండా గ్లాస్ రక్షణతో వస్తుంది. దీనికి ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో ప్రాసెసర్‌తోపాటు 8జీబీ ర్యామ్‌ను అటాచ్ చేశారు. ర్యామ్ బూస్టర్ ఫీచర్‌తో కూడిన ఆన్‌బోర్డ్ ర్యామ్‌ని 16జీబీ వరకూ పెంచుకోవచ్చు.
CMF ఫోన్ 2 ప్రో కెమెరా విషయానికి వస్తే.. 1/1.57 అంగుళాల సెన్సార్‌తో కూడిన 50- మెగాపిక్సెల్ కెమెరా, 50- మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 8- మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాతో వచ్చే ట్రిపుల్ కెమెరా యూనిట్‌ను అందించారు. ఇందులో టెలిఫోటో కెమెరా 2ఎక్స్ ఆప్టికల్ జూమ్, 20ఎక్స్ డిజిటల్ జూమ్‌తో వస్తుంది. అలాగే, 16- మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. దీనికి మెరుగైన అవుట్‌పుట్ కోసం నథింగ్స్ ట్రూలెన్స్ ఇంజిన్ 3.0 టెక్నాలజీని అందించారు.
ఈ ఫోన్ కనెక్టివిటీ ఆప్షన్‌లలో 5జీ, బ్లూటూత్ 5.3, Wi-Fi 6, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్‌లను అందించారు. ఆప్టికల్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. ఇది దుమ్ము, స్ప్లాష్ నియంత్రణకు ఐపీ54 రేటింగ్‌ను కలిగి ఉంది. స్క్రీన్ షాట్స్, ఫోటోలు, వాయిస్ నోట్స్ లాంటివి త్వరగా యాక్సెస్ చేసేందుకు ఎసెన్షియల్ కీ ని అందించారు. వైర్డ్, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చే 5000 mAh బ్యాటరీ 47 గంటల కాలింగ్ లైఫ్‌ను అందించడంతోపాటు ఒకే ఛార్జ్‌పై 22 గంటల వరకూ యూట్యూబ్ స్ట్రీమింగ్‌కు సపోర్ట్ చేస్తుందని ప్రచారంలో ఉంది. ఇది 164× 7.8× 78 ఎంఎం పరిమాణంతో 185 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.
ప్రకటన
ప్రకటన