Amazon Great Freedom Sale: అమెజాన్ సేల్‌లో ఐకూ Z11 Lite పై భారీ ఆఫర్లు.. 6500mAh బ్యాటరీ ఫోన్‌పై అదనపు తగ్గింపు

ఐకూ Z11 లైట్ స్మార్ట్‌ఫోన్ 6.74 ఇంచుల HD+ LCD డిస్‌ప్లేతో వస్తుంది.

Amazon Great Freedom Sale: అమెజాన్ సేల్‌లో ఐకూ Z11 Lite పై భారీ ఆఫర్లు.. 6500mAh బ్యాటరీ ఫోన్‌పై అదనపు తగ్గింపు

Photo Credit: iQOO

iQOO Z11 Lite

ముఖ్యాంశాలు
  • అమెజాన్ సేల్‌లో ఐకూ Z11 Lite పై భారీ ఆఫర్లు
  • రూ. 18 వేలలోపే లభిస్తున్న ఆల్-రౌండర్ ఐకూ Z11 లైట్
  • భారీ ఆఫర్లతో అమెజాన్‌ను ఊపేస్తున్న ఐకూ Z11 లైట్
ప్రకటన

Amazon Great Freedom Sale: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో నిర్వహిస్తున్న గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సేల్‌లో భాగంగా ఇటీవలే భారత మార్కెట్లో లాంచ్ అయిన పవర్‌ఫుల్ 5G స్మార్ట్‌ఫోన్ ఐకూ జెడ్11 లైట్ పై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ ధర, డిస్కౌంట్ ఆఫర్లు, పూర్తి స్పెసిఫికేషన్ల వివరాలను తెలుసుకుందాం.ఐకూ Z11 లైట్ 4GB RAM + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ సాధారణ ధర అమెజాన్‌లో రూ.19,499గా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న సేల్‌లో కస్టమర్లు స్పెషల్ కూపన్ ఆఫర్ ద్వారా రూ.500 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌ల ద్వారా కొనుగోలు చేసే వారికి 10 శాతం (గరిష్టంగా రూ.1,250) వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్లు అన్నింటినీ వర్తింపజేస్తే, ఈ ఫోన్ ఎఫెక్టివ్ ఆఫర్ ప్రైస్ కేవలం రూ.17,749కే సొంతం చేసుకోవచ్చు.  

డిస్‌ప్లే, ప్రాసెసింగ్ పెర్ఫార్మెన్స్
ఐకూ Z11 లైట్ స్మార్ట్‌ఫోన్ 6.74 ఇంచుల HD+ LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 1600×720 పిక్సెల్స్ రెసొల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉండి ఎండలో కూడా డిస్‌ప్లే స్పష్టంగా కనిపించేలా చేస్తుంది. ఈ ఫోన్ మల్టీ టాస్కింగ్, గేమింగ్ కోసం ఆక్టా-కోర్  మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. సెక్యూరిటీ పరంగా ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అందించారు. ఇక సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే.. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.  

కెమెరా సెటప్ విశేషాలు
ఫోటోలు, వీడియోల కోసం ఐకూ Z11 లైట్‌లో వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో f/1.8 అపెర్చర్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, f/3.0 అపెర్చర్‌తో 0.08 మెగాపిక్సెల్ సెకండరీ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందూభాగంలో f/2.2 అపెర్చర్‌తో కూడిన 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు.  

Amazon Great Freedom Sale: స్మార్ట్ ఏఐ ఫీచర్లు, అద్భుత డిస్‌ప్లే.. గ్రేట్ ఫ్రీడమ్ సేల్లో ప్రీమియం OLED టీవీలపై లక్షల్లో డిస్కౌంట్

బ్యాటరీ, బిల్డ్ క్వాలిటీ, కనెక్టివిటీ
ఈ స్మార్ట్‌ఫోన్ అతిపెద్ద ఆకర్షణ దీని బ్యాటరీ కెపాసిటీ. ఐకూ Z11 లైట్‌లో 6500mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ అందించబడింది. దీనికి ఫాస్టుగా ఛార్జ్ అయ్యేందుకు 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఈ ఫోన్ కొలతలు 167.4 mm పొడవు, 77.1 mm వెడల్పు, 8.39 mm మందం కలిగి ఉండి, 209 గ్రాముల బరువు ఉంటుంది. దుమ్ము, నీటి చుక్కల నుంచి రక్షణ కోసం దీనికి IP65 రేటింగ్ ఇచ్చారు. ఇక కనెక్టివిటీ ఆప్షన్లలో 5G నెట్‌వర్క్, డ్యూయల్ 4G VoLTE, వై-ఫై, బ్లూటూత్ 5.4, జీపీఎస్, 3.5mm ఆడియో జాక్, యూఎస్‌బీ టైప్-సి 2.0 పోర్ట్ ఉన్నాయి.  

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Vivo S2 vs iQOO Neo 10 vs OnePlus Nord 6 : ఈ మూడింట్లో ఏది కొనడం బెస్ట్ ?
  2. Realme 16x 5G: ఈ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. టెక్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న రియల్‌మీ కొత్త ఫోన్
  3. Airtel: ఎయిర్‌టెల్ కస్టమర్లకు ఊహించని షాక్.. ఆ పాపులర్ ప్లాన్స్ క్లోజ్
  4. Pure Petrol: ఇథనాల్ లేని ప్యూర్ పెట్రోల్ కావాలా? ఈ యాప్‌తో దగ్గరలోని బంక్‌ను క్షణాల్లో కనిపెట్టేయండి
  5. Amazon Great Freedom Sale: అమెజాన్ సేల్‌లో ఐకూ Z11 Lite పై భారీ ఆఫర్లు.. 6500mAh బ్యాటరీ ఫోన్‌పై అదనపు తగ్గింపు
  6. Amazon Great Freedom Sale: స్మార్ట్ ఏఐ ఫీచర్లు, అద్భుత డిస్‌ప్లే.. గ్రేట్ ఫ్రీడమ్ సేల్లో ప్రీమియం OLED టీవీలపై లక్షల్లో డిస్కౌంట్
  7. Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా.. శామ్‌సంగ్, ఏసర్, లెనోవో ట్యాబ్‌లపై ఆఫర్ల వర్షం
  8. Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా.. గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై ఊహించని రేంజ్‌లో ధరల తగ్గింపు
  9. Samsung Galaxy A36 vs Redmi Note 17 vs Vivo T5x : రూ.25 వేలలో ఏ ఫోన్ కొనాలి?
  10. Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా.. రూ. 5 వేల బడ్జెట్‌లో 5 అద్భుతమైన స్మార్ట్‌వాచ్‌లు
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »