ఇప్పుడు బెంగళూరులోని హెబ్బాళ్ స్టోర్ ఈ అనుభవాన్ని మరింత విస్తృతం చేయనుంది

అమెరికాలో పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ ధర 256GB వేరియంట్‌కి $1,799 ఉండగా గురువారం ఉదయం స్టోర్ అవుట్‌సైడ్ బ్యారికేడ్ డిజైన్‌ను యాపిల్ ఆవిష్కరించింది.

ఇప్పుడు బెంగళూరులోని హెబ్బాళ్ స్టోర్ ఈ అనుభవాన్ని మరింత విస్తృతం చేయనుంది

హెబ్బాల్ స్టోర్ కోసం బారికేడ్ గురువారం ఉదయం బయటపడిందని ఆపిల్ తెలిపింది

ముఖ్యాంశాలు
  • బెంగళూరులో ప్రారంభం యాపిల్ స్టోర్
  • నెమలి రెక్కల ఆకృతులతో ఆకట్టుకుంటున్న స్టోర్ డిజైన్
  • ముంబై, ఢిల్లీ తరహాలో కస్టమర్లకు సేవలు
ప్రకటన

కుపర్టినో ప్రధాన కేంద్రంగా ఉన్న టెక్ దిగ్గజం యాపిల్, భారతదేశంలో తన మూడవ అధికారిక రిటైల్ స్టోర్‌ను బెంగళూరులో ప్రారంభించబోతోంది. సెప్టెంబర్ 2న మధ్యాహ్నం 1 గంటకు ఫీనిక్స్ మాల్‌లోని యాపిల్ హెబ్బాళ్ స్టోర్ ప్రారంభం కానుంది. ఇది ముంబైలోని యాపిల్ BKC, ఢిల్లీ సాకేత్‌లోని యాపిల్ సాకేత్ స్టోర్ తరువాత వస్తున్న మూడో స్టోర్ కావడం విశేషం. ఈ ప్రారంభం, కొద్ది రోజుల్లో విడుదల కానున్న ఐఫోన్ 17 సిరీస్ లాంచ్‌తో సమానంగా జరగనుంది.దీంతో ఈవెంట్ మరింత స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుంది.గురువారం ఉదయం స్టోర్ అవుట్‌సైడ్ బ్యారికేడ్ డిజైన్‌ను యాపిల్ ఆవిష్కరించింది. భారతదేశ జాతీయ పక్షి అయిన నెమలి రెక్కల అందాన్ని ప్రతిబింబించే ఆకృతులతో ఈ స్టోర్ డిజైన్ రూపొందించబడింది. భారతదేశంలో యాపిల్ మూడవ స్టోర్ ప్రారంభోత్సవాన్ని ఈ కళాకృతి మరింత ప్రత్యేకం చేస్తుంది,” అని యాపిల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ డిజైన్ తో ఆపిల్ ఇండియన్ కస్టమర్లను మరింత చేరువ చేసుకునే విధంగా ప్రణాళిక రచిస్తుంది.

ఈ స్టోర్‌లో ఆపిల్ స్పెషలిస్ట్స్, క్రియేటివ్, జీనియస్సెస్, మరియు బిజినెస్ టీమ్స్ కస్టమర్లకు ప్రత్యక్ష సేవలు అందించబోతున్నారు. అదనంగా, టుడే ఎట్ ఆపిల్ పేరుతో ఉచిత ఇంటరాక్టివ్ సెషన్‌లు కూడా నిర్వహించనున్నారు. ఈ సెషన్‌ల ద్వారా కస్టమర్లు తమ కొత్త యాపిల్ పరికరాలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడంతో పాటు కళ, కథ చెప్పడం, ఉత్పాదకత, కోడింగ్ వంటి అంశాలపై నిపుణుల సూచనలు పొందవచ్చు. యాపిల్ రిటైల్ విస్తరణలో భాగంగా ఈ కొత్త స్టోర్ ద్వారా కూడా ఐఫోన్‌లు, మాక్ కంప్యూటర్లు, యాపిల్ వాచ్ వంటి అన్ని యాపిల్ ఉత్పత్తులను నేరుగా చూసి కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. అదనంగా, ట్రేడ్-ఇన్ ఆప్షన్లు, డివైస్ సెటప్ సపోర్ట్ మరియు టెక్నికల్ సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయి. కొత్తగా ఆపిల్ ఫోన్లు కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు ఇప్పుడు ప్రోడక్ట్ తో డైరెక్ట్ ఇంట్రక్ట్ అయి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని ఎక్స్పీరియన్స్ పొందవచ్చు. ప్రోడక్ట్ విషయంలో ఎటువంటి సందేహం ఉన్నా కూడా ఆపిల్ టెక్నికల్ టీం ఆన్ స్పాట్ సపోర్ట్ అందిస్తారు.

భారతదేశంలో యాపిల్ రిటైల్ స్టోర్స్ చరిత్ర:

2023 ఏప్రిల్‌లో ముంబైలోని BKC స్టోర్తో యాపిల్ తన మొదటి అధికారిక స్టోర్‌ను ప్రారంభించింది. జియో వరల్డ్ డ్రైవ్ మాల్‌లో ఉన్న ఈ స్టోర్‌లో చేతితో తయారుచేసిన కలప సీలింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తర్వాత, కొద్ది రోజులకే ఢిల్లీలోని సాకేత్ స్టోర్ ప్రారంభమైంది. ఈ రెండు స్టోర్స్‌లోనూ కస్టమర్లకు పరికరాలపై అనుభవం పొందే అవకాశం, టెక్నికల్ సపోర్ట్, పర్సనలైజ్డ్ గైడెన్స్ లాంటి సేవలు అందించబడ్డాయి. ఇప్పుడు బెంగళూరులోని హెబ్బాళ్ స్టోర్ ఈ అనుభవాన్ని మరింత విస్తృతం చేయనుంది. ఇది బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆపిల్ కస్టమర్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు. యాపిల్ భారతదేశం అంతటా విస్తరించే పథకంలో భాగంగా ఈ స్టోర్ లో ప్రారంభోత్సవం జరుపుకుంటూ వెళ్తుంది. భవిష్యత్తులో ఇండియాలో ఉన్న మెట్రో సిటీస్ అన్నిటిలో కూడా ఆపిల్ స్టోర్స్ ప్రారంభించే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది.

Comments
Facebookలో షేర్‌ Gadgets360 Twitter Shareట్వీట్ షేర్ Snapchat రెడ్డిట్ వ్యాఖ్యానించండి

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. దయచేసి మీ ఫోన్లను రీస్టార్ట్‌ చేయండి అని ఎయిర్‌టెల్ వినియోగదారులకు సూచించింది
  2. లీకైన ఒప్పో ఎఫ్ 31 సిరీస్.. అదిరే లుక్స్‌తో రానున్న న్యూ మోడల్స్
  3. హానర్ మ్యాజిక్ వి ఫ్లిప్ 2 న్యూ మోడల్.. సేల్ ఎప్పటి నుంచంటే
  4. ఇప్పుడు బెంగళూరులోని హెబ్బాళ్ స్టోర్ ఈ అనుభవాన్ని మరింత విస్తృతం చేయనుంది
  5. రత మార్కెట్‌లోకి గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లు, అద్బుతమైన ఫీచర్లు, ఎక్కడ కొనుగోలు చేయవచ్చంటే?
  6. జెమినీ కెమెరా కోచ్, ఫేస్ అన్‌బ్లర్, మ్యాజిక్ ఈరేసర్ ఫీచర్లు ఫోటోలు అందంగా చేస్తాయి
  7. రూ. 249 ప్లాన్‌ను నిలిపి వేసిన ఎయిర్ టెల్
  8. ఇక కెమెరా విషయానికి వస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను సెట్ చేశారు
  9. అదిరే ఫీచర్స్, ధరతో హానర్ X7c 5G కొత్త మోడల్
  10. Apple IDని లింక్ చేయడం ద్వారా ఆపిల్ మ్యూజిక్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »