Honor Magic V Flip 2 కొత్త మోడల్ చైనా మార్కెట్లోకి వచ్చింది. గురువారం నాడు ఈ న్యూ మోడల్ అక్కడి మార్కెట్లోకి వచ్చింది. ఇక్కడి వారు ఆన్ లైన్‌లో ప్రీ ఆర్డర్ ద్వారా ఈ మొబైల్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇక దీని ధర కనిష్టంగా 70 వేలు, గరిష్టంగా 90 వేలు ఉండొచ్చని అంచనా.
Photo Credit: Honor
హానర్ మ్యాజిక్ V ఫ్లిప్ 2 IP58 మరియు IP59 దుమ్ము మరియు నీటి నిరోధక రేటింగ్‌లను కలుస్తుందని పేర్కొన్నారు
ప్రస్తుతం ఇప్పుడు ఫోన్స్‌లో ఫోల్డబుల్ మోడల్స్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. అందుకే అన్ని కంపెనీలు దాదాపుగా ఈ ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేస్తోంది. మడత పెట్టుకునే వీలున్న ఈ న్యూ మోడల్స్‌ను వినియోగదారులు ఎక్కువగానే కొనేస్తున్నారు. ఈ క్రమంలోహానర్ నుంచి ఓ న్యూ మోడల్ వచ్చింది. హానర్ మ్యాజిక్ V ఫ్లిప్ 2 గురువారం చైనాలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ 5,500mAh బ్యాటరీతో వస్తుంది. ఇక 200-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాతో పాటు, 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ మోడల్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్ ద్వారా పని చేస్తుంది. ఈ న్యూ మోడల్‌లో 16GB RAM వరకు ఆప్షన్ ఉంటుంది. ఇది 6.82-అంగుళాల LTPO OLED ఫోల్డబుల్ ఇన్నర్ స్క్రీన్, 4-అంగుళాల OLED LTPO కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 4,310mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడిన హానర్ మ్యాజిక్ V ఫ్లిప్‌కు ఎక్స్‌టెన్షన్‌గా వస్తుంది.
12GB + 256GB తో ఉండే హానర్ మ్యాజిక్ V ఫ్లిప్ 2 ధర CNY 5,499 ( ఇండియాలో సుమారు రూ. 66,900) నుండి ప్రారంభమవుతుంది. అయితే 12GB + 512GB, 12GB + 1TB వేరియంట్‌ల ధర వరుసగా CNY 5,999 (సుమారు రూ. 73,000), CNY 6,499 (సుమారు రూ. 79,100) ఉండొచ్చు. టాప్-ఆఫ్-ది-లైన్ 16GB + 1TB వెర్షన్ ధర CNY 7,499 (సుమారు రూ. 91,300)గా ఉండొచ్చని అంచనా. ఈ ఫోన్ ప్రస్తుతం దేశంలోని హానర్ ఇ-స్టోర్ ద్వారా అలాగే ఎంపిక చేసిన ఇ-కామర్స్ సైట్‌ల ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. ఇక డాన్ పర్పుల్, డ్రీమ్ వీవర్ బ్లూ, మూన్ షాడో వైట్, టైటానియం ఎయిర్ గ్రే రంగుల్లో ప్రీఆర్డర్ చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఇది ఆగస్టు 28 నుండి అమ్మకానికి వస్తుంది.
హానర్ మ్యాజిక్ V ఫ్లిప్ 2 6.82-అంగుళాల ఫుల్-HD+ (1,232×2,868 పిక్సెల్స్) OLED LTPO ప్రైమరీ ఇన్నర్ డిస్‌ప్లేతో 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 4,320Hz అల్ట్రా-హై ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్ రేట్.. 5,000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ లెవల్‌తో వస్తుంది. ఇది 1,200×1,092 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 3,840Hz అల్ట్రా-హై ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్ రేట్.. 3,600 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ లెవల్‌తో 4-అంగుళాల LTPO OLED ఔటర్ స్క్రీన్‌ను కలిగి ఉంది.
హానర్ మ్యాజిక్ V ఫ్లిప్ 2 స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 SoC ద్వారా నడుస్తుంది. ఇది 16GB వరకు LPDDR5x RAM, 1TB వరకు UFS 4.0 ఇన్ బిల్ట్ స్టోరేజీతో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 15-ఆధారిత MagicOS 9.0.1 తో వస్తుంది. హానర్ తాజా ఫోల్డబుల్ ఫోన్‌లో మీరు OISతో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ అవుట్‌వర్డ్-ఫేసింగ్ కెమెరాను, 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను పొందుతారు. లోపల 50-మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్ ఉంది. లోపలి, బయటి కెమెరాలు రెండూ 4K వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తాయి.
హానర్ మ్యాజిక్ V ఫ్లిప్ 2 5,500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 7.5W వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G VoLTE, Wi-Fi 7, బ్లూటూత్ 5.3, GPS, NFC, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. హ్యాండ్‌సెట్ సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో అమర్చబడి ఉంది. IP58, IP59 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌లను తీరుస్తుందని పేర్కొన్నారు. ఫోన్ తెరిచినప్పుడు 167.1×86.5×6.9mm కొలతతో ఉంటుంది. ఇక ఈ మోడల్ ఫోన్ 193 గ్రాముల బరువు ఉంటుంది.
ప్రకటన
ప్రకటన