జెమినీ కెమెరా కోచ్, ఫేస్ అన్‌బ్లర్, మ్యాజిక్ ఈరేసర్ ఫీచర్లు ఫోటోలు అందంగా చేస్తాయి

అమెరికాలో పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ ధర 256GB వేరియంట్‌కి $1,799 ఉండగా ఇండియన్ రూపీ ప్రకారం రూ.1,56,600గా ప్రారంభమవుతుంది.

జెమినీ కెమెరా కోచ్, ఫేస్ అన్‌బ్లర్, మ్యాజిక్ ఈరేసర్ ఫీచర్లు ఫోటోలు అందంగా చేస్తాయి

Photo Credit: Google

గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ (చిత్రంలో) మునుపటి మోడల్ మాదిరిగానే డిజైన్‌ను కలిగి ఉంది

ముఖ్యాంశాలు
  • ఈ ఫోన్లో 5015 mAh బ్యాటరీ బ్యాకప్ ఇస్తున్నారు
  • 48 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా యూనిట్ ఉంది
  • IP64 డస్ట్ మరియు స్ప్లాష్ రెసిస్టెన్స్ రేటింగ్స్ ఉన్నాయి
ప్రకటన

‘మేడ్ బై గూగుల్' ఈవెంట్‌లో బుధవారం గూగుల్ తన కొత్త బుక్‌-స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ను ఆవిష్కరించింది. అమెరికాలో పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ ధర 256GB వేరియంట్‌కి $1,799 ఉండగా ఇండియన్ రూపీ ప్రకారం రూ.1,56,600గా ప్రారంభమవుతుంది. 512GB వేరియంట్ ధర $1,919., 1TB వేరియంట్ ధర $2,149 ఉంది. భారత మార్కెట్‌లో మాత్రం ఈ ఫోన్‌ను ఒకే ఒక్క 256GB వేరియంట్‌లోనే విడుదల చేశారు. దీని ధర రూ.1,72,999గా నిర్ణయించారు. మూన్‌స్టోన్ మరియు జేడ్ అనే రెండు రంగులలో ఈ ఫోన్ లభిస్తుంది.

డిస్‌ప్లే మరియు పనితీరు:

డ్యుయల్ సిమ్‌ (నానో సిమ్ + eSIM) సపోర్ట్‌తో వచ్చే ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 16 ముందుగానే ఇన్‌స్టాల్‌ అయి ఉంటుంది. 6.4 అంగుళాలు డిస్ప్లే120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 408ppi పిక్సెల్ డెన్సిటీ, గరిష్టంగా 3,000 నిట్స్ బ్రైట్‌నెస్, HDR సపోర్ట్ తో వస్తుంది.ఇక మెయిన్ డిస్‌ప్లే విషయానికి వస్తే...8.0 అంగుళాలు డిస్ప్లీకి, 120Hz రిఫ్రెష్ రేట్, 373ppi పిక్సెల్ డెన్సిటీ, 3,000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ అందిస్తున్నారు.

ఇక పెర్ఫార్మెన్స్ చూస్తే..టెన్సర్ G5 చిప్‌సెట్, టైటాన్ M2 సెక్యూరిటీ చిప్, 16GB LPDDR5X RAMతో ఈ ఫోన్ మరింత పవర్ ఫుల్గా పనిచేస్తుంది. 256GB, 512GB మరియు 1TB అనే మూడు స్టోరేజ్ ఎంపికల్లో ఇది లభిస్తుంది. గూగుల్ ఈ ఫోన్‌కు ఏడు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్లు అందిస్తుందని హామీ ఇస్తోంది.

AI ఆధారిత ఫీచర్లు:

ఈ ఫోన్‌లో జెమినీ లైవ్, సర్కిల్ టు సెర్చ్, కాల్ అసిస్ట్ వంటి అనేక AI ఫీచర్లు ఉన్నాయి. దీంతో ఏ విషయం అయిన వెంటనే సెర్చ్ చేయవచ్చు. కెమెరా సెటప్ చూస్తే...పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్‌లో మూడు వెనుక కెమెరాలు ఉన్నాయి. 48MP ప్రైమరీ కెమెరా (f/1.7), 10.5MP అల్ట్రావైడ్ లెన్స్ (127° FoV), 10.8MP టెలిఫోటో లెన్స్ (10x ఆప్టికల్ జూమ్). దీనికి అదనంగా జెమినీ పవర్‌డ్ కెమెరా కోచ్, ఆడ్ మీ, ఫేస్ అన్‌బ్లర్, బెస్ట్ టేక్, ఆటో ఫ్రేమ్, మ్యాజిక్ ఈరేసర్, రీఇమాజిన్, పోర్ట్రెయిట్ మోడ్ వంటి ప్రత్యేక ఫీచర్లను అందించారు. దీంతో ఫోటోలు మరింత అందగా దిగేందుకు వీలుంటుంది. కవర్ స్క్రీన్ మరియు మెయిన్ స్క్రీన్ రెండింటికీ 10MP సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది.

కనెక్టివిటీ మరియు బ్యాటరీ:

ఈ ఫోన్‌లో 5G, Wi-Fi 7, Bluetooth 6, NFC, GPS, USB Type-C వంటి అన్ని ఆధునిక కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఫోన్ ఫోల్డ్ చేసినప్పుడు 155.2 × 76.3 × 10.8 mm పరిమాణం ఉంటుంది. తెరిచినప్పుడు 155.2 × 150.4 × 5.2 mm పరిమాణం ఉంటుంది. ఇక బరువు 258 గ్రాముల బరువుతో ఈ ఫోన్ వస్తుంది.

ఈ ఫోన్ కి IP68 రేటింగ్ ఉన్నందున ఈ ఫోన్‌కి నీరు, ధూళి నుండి రక్షణ లభిస్తుంది. ఇక బ్యాటరీ బ్యాకప్ విషయంలో 5,015mAh బ్యాటరీతో పాటు 30W వైర్డ్ ఛార్జింగ్ మరియు 15W Qi2 వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు.

ఈ విధంగా గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ అత్యాధునిక డిజైన్‌, శక్తివంతమైన పనితీరు, అద్భుతమైన కెమెరా ఫీచర్లు, మరియు దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌తో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఎక్కువ కాంపిటీషన్ ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Comments
Facebookలో షేర్‌ Gadgets360 Twitter Shareట్వీట్ షేర్ Snapchat రెడ్డిట్ వ్యాఖ్యానించండి

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. దయచేసి మీ ఫోన్లను రీస్టార్ట్‌ చేయండి అని ఎయిర్‌టెల్ వినియోగదారులకు సూచించింది
  2. లీకైన ఒప్పో ఎఫ్ 31 సిరీస్.. అదిరే లుక్స్‌తో రానున్న న్యూ మోడల్స్
  3. హానర్ మ్యాజిక్ వి ఫ్లిప్ 2 న్యూ మోడల్.. సేల్ ఎప్పటి నుంచంటే
  4. ఇప్పుడు బెంగళూరులోని హెబ్బాళ్ స్టోర్ ఈ అనుభవాన్ని మరింత విస్తృతం చేయనుంది
  5. రత మార్కెట్‌లోకి గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లు, అద్బుతమైన ఫీచర్లు, ఎక్కడ కొనుగోలు చేయవచ్చంటే?
  6. జెమినీ కెమెరా కోచ్, ఫేస్ అన్‌బ్లర్, మ్యాజిక్ ఈరేసర్ ఫీచర్లు ఫోటోలు అందంగా చేస్తాయి
  7. రూ. 249 ప్లాన్‌ను నిలిపి వేసిన ఎయిర్ టెల్
  8. ఇక కెమెరా విషయానికి వస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను సెట్ చేశారు
  9. అదిరే ఫీచర్స్, ధరతో హానర్ X7c 5G కొత్త మోడల్
  10. Apple IDని లింక్ చేయడం ద్వారా ఆపిల్ మ్యూజిక్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »