Flipkart Goat Sale : ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ ధమాకా.. కేవలం రూ.12 వేల బడ్జెట్లోనే శామ్‌సంగ్ 5G స్మార్ట్‌ఫోన్

శామ్‌సంగ్ గెలాక్సీ F70e 5G 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్ లో రూ. 12,999లతో లిస్ట్ చేయబడింది.

Flipkart Goat Sale : ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ ధమాకా.. కేవలం రూ.12 వేల బడ్జెట్లోనే శామ్‌సంగ్ 5G స్మార్ట్‌ఫోన్

Photo Credit: Samsung

Samsung Galaxy F70e 5G

ముఖ్యాంశాలు
  • కేవలం రూ. 12 వేల బడ్జెట్లోనే శామ్‌సంగ్ 5G స్మార్ట్‌ఫోన్
  • శామ్‌సంగ్ గెలాక్సీ F70e 5G పై ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్
  • 6000mAh మెగా బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్
ప్రకటన

Flipkart Goat Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే మిడ్-బడ్జెట్ కస్టమర్ల కోసం ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ మోసుకొచ్చింది. ప్రస్తుతం లైవ్ లో ఉన్న ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్‎లో బ్రాండెడ్ మొబైళ్లపై కళ్లు చెదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మీరు గనుక రూ.12,000ల లోపు తక్కువ బడ్జెట్‌లో ఒక నమ్మకమైన బ్రాండ్ నుండి బెస్ట్ 5G ఫోన్ కోసం చూస్తుంటే.. శామ్‌సంగ్ కంపెనీకి చెందిన శామ్‌సంగ్ గెలాక్సీ F70e 5G మీకు చాలా పర్ఫెక్ట్ ఆప్షన్ కాగలదు. ఈ సేల్‌లో ఈ ఫోన్‌ను అత్యంత చౌక ధరకే సొంతం చేసుకునే అవకాశాన్ని ఫ్లిప్‌కార్ట్ కల్పిస్తోంది.

శామ్‌సంగ్ గెలాక్సీ F70e 5G పై ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్ 
ధర, ఆఫర్ల వివరాల్లోకి వెళితే, శామ్‌సంగ్ గెలాక్సీ F70e 5G 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్ లో రూ. 12,999లతో లిస్ట్ చేయబడింది. అయితే, బ్యాంక్ ఆఫర్ల కింద కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే వారికి ఫ్లాట్ రూ.1,125 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ బ్యాంక్ తగ్గింపు తర్వాత ఈ ఫోన్ ఎఫెక్టివ్ ధర కేవలం రూ.11,874కే దిగివస్తుంది. దీనితో పాటు పాత ఫోన్ మార్చుకోవాలనుకునే వారి కోసం ఏకంగా రూ.11,300 వరకు భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తున్నారు. అయితే ఈ ఎక్స్ఛేంజ్ వాల్యూ అనేది మీరు ఇచ్చే పాత మొబైల్ కండిషన్, మోడల్ ఆధారంగా డిసైడ్ అవుతుంది.

6000mAh మెగా బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ 
ఈ సరికొత్త శామ్‌సంగ్ గెలాక్సీ F70e 5G ఫోన్ లోని అతిపెద్ద హైలైట్ దీని బ్యాటరీ కెపాసిటీ. ఇందులో ఏకంగా 6000mAh సామర్థ్యం గల మెగా బ్యాటరీని అమర్చారు. దీనివల్ల ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా వాడుకోవచ్చు. హెవీ యూజర్లకు, ట్రావెలింగ్ ఎక్కువగా చేసేవారికి ఈ బ్యాటరీ బాగా ఉపయోగపడుతుంది. ఈ పెద్ద బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడం కోసం 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కంపెనీ అందించింది. దీనితో పాటు సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవ్వడం విశేషం.

Amazon : అమెజాన్ ప్రైమ్ డే సేల్ చివరి రోజు.. ‘వన్ ప్లస్ ప్యాడ్ 2' టాబ్లెట్‌పై ఊహించని భారీ డిస్కౌంట్

మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ 
ఈ మొబైల్ స్పెసిఫికేషన్లు బడ్జెట్ ధరకు తగ్గట్టుగా చాలా బలంగా ఉన్నాయి. ఇందులో 120Hz హై రిఫ్రెష్ రేట్ సపోర్ట్ గల 6.7 ఇంచుల HD+ LCD డిస్‌ప్లేను అందించారు. ఇది 720x1600 పిక్సెల్స్ రెజల్యూషన్, 260 ppi పిక్సెల్ డెన్సిటీ, 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఫోన్ స్మూత్‌గా పనిచేయడానికి, మల్టీటాస్కింగ్ కోసం ఇందులో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G ప్రాసెసర్‌ను అమర్చారు. దుమ్ము, నీటి చుక్కల నుంచి మొబైల్‌కు రక్షణ కల్పించేందుకు ఈ ఫోన్‌కు IP54 రేటింగ్ ఇచ్చారు. సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఫీచర్ కూడా ఉంది.

50 మెగాపిక్సెల్ క్వాలిటీ కెమెరా 
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. శామ్‌సంగ్ గెలాక్సీ F70e 5G వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో f/1.8 అపెర్చర్ కలిగిన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు, f/2.4 అపెర్చర్ కలిగిన 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాను అందించారు. దీని ద్వారా తక్కువ కాంతిలో కూడా స్పష్టమైన ఫోటోలను క్లిక్ చేయవచ్చు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ మాట్లాడుకోవడం కోసం ముందు భాగంలో f/2.0 అపెర్చర్ ఉన్న 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. కనెక్టివిటీ పరంగా ఇందులో డ్యూయల్ సిమ్, 3.5mm ఆడియో జాక్, వేగవంతమైన 5G నెట్‌వర్క్, వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ వంటి అన్ని రకాల అవసరమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ ధరలో ఇన్ని ఫీచర్లు ఉన్న ఫోన్ దొరకడం నిజంగా బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Whatsapp : వాట్సాప్‌లో ప్రైవసీ విప్లవం.. మొబైల్ నంబర్ అవసరం లేకుండానే చాటింగ్ చేసేలా సరికొత్త ఫీచర్
  2. Flipkart Goat Sale : ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ ధమాకా.. కేవలం రూ.12 వేల బడ్జెట్లోనే శామ్‌సంగ్ 5G స్మార్ట్‌ఫోన్
  3. Amazon : అమెజాన్ ప్రైమ్ డే సేల్ చివరి రోజు.. ‘వన్ ప్లస్ ప్యాడ్ 2’ టాబ్లెట్‌పై ఊహించని భారీ డిస్కౌంట్
  4. Amazon : అమెజాన్ ప్రైమ్ డే సేల్ చివరి రోజు హంగామా.. రూ.40 వేల బడ్జెట్‌లో టాప్ స్మార్ట్‌ఫోన్లపై క్రేజీ డీల్స్
  5. Moto G77 Power : మోటోరోలా నుంచి మైండ్ బ్లోయింగ్ ఫోన్.. 7,000 mAh భారీ బ్యాటరీతో వస్తున్న Moto G77 Power
  6. Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్ హంగామా.. ఎకో స్పీకర్లు, ఫైర్ టీవీ స్టిక్స్‌పై భారీ డిస్కౌంట్లు
  7. BYD : ఈవీ ప్రియులకు షాక్.. భారత్‌లో కార్ల ధరలను భారీగా పెంచేసిన బివైడి
  8. Donald Trump : క్రిప్టో బిజినెస్‌తో డొనాల్డ్ ట్రంప్‌కు కాసుల వర్షం.. గతేడాది ఏకంగా $1.4 బిలియన్ల సంపాదన
  9. Apple : 2027లో ఆపిల్ బిగ్ ప్లాన్.. ఒకేసారి మార్కెట్లోకి మ్యాక్‌బుక్ ప్రో, ఐప్యాడ్ ప్రో, ఐఫోన్ ఎయిర్ 2
  10. Username : టెలిగ్రామ్, సిగ్నల్ యాప్‌లకు కేంద్రం షాక్.. యూజర్‌నేమ్ ఫీచర్‌పై నిలదీసిన ఐటీ మంత్రిత్వ శాఖ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »