సెలబ్రేషన్ కాయిన్స్ అనే సంస్థ నుంచి ఆయనకు రాయల్టీ రూపంలోనే దాదాపు 63.5 కోట్ల డాలర్లు (635 మిలియన్ డాలర్లు) వచ్చాయి.
Photo Credit: Donald Trump
Donald Trump
Donald Trump : డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి క్రిప్టోకరెన్సీ మార్కెట్ ఒక్కసారిగా పుంజుకుంది. ఆయన క్రిప్టో రంగానికి పెద్దపీట వేస్తానని ప్రకటించడంతో ఇన్వెస్టర్లలో నమ్మకం పెరిగింది. అయితే, గత కొన్ని నెలలుగా ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్‌తో పాటు మిగతా కాయిన్ల విలువ కూడా భారీగా పడిపోయింది. ఈ మార్కెట్ ఒడిదుడుకులు ట్రంప్‌కు చెందిన క్రిప్టో వ్యాపారాలపై కూడా కొంత ప్రభావం చూపినప్పటికీ, ఆయన సంపాదన మాత్రం రికార్డు స్థాయిలో నమోదైంది.
ట్రంప్ స్వయంగా సమర్పించిన వార్షిక ఆర్థిక నివేదికల ప్రకారం.. సెలబ్రేషన్ కాయిన్స్ అనే సంస్థ నుంచి ఆయనకు రాయల్టీ రూపంలోనే దాదాపు 63.5 కోట్ల డాలర్లు (635 మిలియన్ డాలర్లు) వచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ముందే మార్కెట్లోకి $TRUMP అనే మీమ్ కాయిన్‌ను తీసుకువచ్చారు. ఈ మీమ్ కాయిన్ లావాదేవీలను సెలబ్రేషన్ కాయిన్స్ సంస్థే చూసుకుంటుంది. దీని ద్వారానే ట్రంప్‌కు ఈ భారీ రాయల్టీ లభించింది.
ఈ రాయల్టీతో పాటు ట్రంప్‌కు వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ అనే క్రిప్టోకరెన్సీ సంస్థ నుంచి మరో 50 కోట్ల డాలర్లకు పైగా ఆదాయం సమకూరింది. ప్రత్యేకత ఏంటంటే, ఈ క్రిప్టో కంపెనీని ట్రంప్ కుమారులు, ఆయన ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ పిల్లలు కలిసి ప్రారంభించారు. గత ఏడాది ట్రంప్ సంపాదించిన మొత్తం ఆదాయం దాదాపు 2.2 బిలియన్ డాలర్లు కాగా, అందులో సగానికి పైగా అంటే 1.4 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ కేవలం క్రిప్టో బిజినెస్ ద్వారానే రావడం గమనార్హం.
ట్రంప్ దేశాధ్యక్షుడు కావడం వల్లే ఆయన క్రిప్టో బిజినెస్‌కు లాభాలు వచ్చాయనే ఆరోపణలను దేశాధ్యక్షుడి కార్యాలయం (వైట్ హౌస్) తీవ్రంగా ఖండించింది. ట్రంప్ పదవిలో ఉన్నందుకు ఎలాంటి వ్యక్తిగత లాభాలు పొందలేదని స్పష్టం చేసింది. ట్రంప్ వ్యాపారాలన్నీ ప్రస్తుతం ఆయన కుమారుల ఆధ్వర్యంలోని ఒక స్వతంత్ర ట్రస్ట్ నియంత్రణలో ఉన్నాయని, దీనివల్ల ప్రభుత్వ నిర్ణయాలకు, ఆయన సొంత వ్యాపారాలకు ఎలాంటి సంబంధం లేదని వైట్ హౌస్ పునరుద్ఘాటించింది.
Apple : 2027లో ఆపిల్ బిగ్ ప్లాన్.. ఒకేసారి మార్కెట్లోకి మ్యాక్‌బుక్ ప్రో, ఐప్యాడ్ ప్రో, ఐఫోన్ ఎయిర్ 2
వైట్ హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ అన్నా కెల్లీ స్పందిస్తూ.. "అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల అమెరికా ఈరోజు ప్రపంచంలోనే క్రిప్టోకరెన్సీల రాజధానిగా మారింది. ప్రెసిడెంట్ కానీ, ఆయన కుటుంబం కానీ ఎలాంటి అక్రమాలకు లేదా ప్రయోజనాల ఘర్షణకు పాల్పడలేదు. ట్రంప్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం అమెరికా ప్రజల శ్రేయస్సు కోసమే ఉంటుంది" అని ఒక ప్రకటనలో తెలిపారు. మీడియాలోని ఒక వర్గం, డెమొక్రాటిక్ పార్టీ నాయకులు ట్రంప్‌పై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
మరోవైపు తన ఆర్థిక వ్యవహారాలపై డొనాల్డ్ ట్రంప్ కూడా గతంలోనే క్లారిటీ ఇచ్చారు. రోజువారీ వ్యాపారాలు లేదా ఫైనాన్షియల్ నిర్ణయాల్లో తాను నేరుగా పాలుపంచుకోనని ఆయన స్పష్టం చేశారు. తన సంపద మొత్తాన్ని ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్లు, ట్రస్టులు మాత్రమే చూసుకుంటాయని, దేశాధ్యక్షుడిగా తన పూర్తి సమయాన్ని అమెరికా అభివృద్ధి కోసమే కేటాయిస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు.
ప్రకటన
ప్రకటన
Tom Clancy's Ghost Recon: Future Soldier Is Free to Claim on Ubisoft Store for a Week
Amazon Great Freedom Sale 2026: Best Deals on Refrigerators from Haier, LG, Samsung and More Brands