కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ప్రముఖ అంతర్జాతీయ మెసేజింగ్ యాప్‌లైన టెలిగ్రామ్, సిగ్నల్ సంస్థలకు తాజాగా కీలక నోటీసులు జారీ చేసింది.
Photo Credit: telegram
Username
Username : భారతదేశంలో మొబైల్ నంబర్ వెల్లడించకుండా కేవలం యూజర్‌నేమ్ ఆధారంగా కమ్యూనికేట్ చేసేందుకు వీలు కల్పిస్తున్న సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ప్రముఖ అంతర్జాతీయ మెసేజింగ్ యాప్‌లైన టెలిగ్రామ్, సిగ్నల్ సంస్థలకు తాజాగా కీలక నోటీసులు జారీ చేసింది. ఈ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్న యూజర్‌నేమ్ ఫీచర్‌కు సంబంధించి ప్రభుత్వం పలు ప్రశ్నలను లేవనెత్తింది. తమ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా జరుగుతున్న ఆన్‌లైన్ మోసాలు, నకిలీ గుర్తింపులతో సాగుతున్న నేరాలను అరికట్టేందుకు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారో స్పష్టం చేయాలని కేంద్రం ఈ నోటీసుల్లో డిమాండ్ చేసింది.
ఈ నోటీసులలో ప్రభుత్వం టెలిగ్రామ్ సంస్థను ప్రత్యేకంగా నిలదీసింది. అసలు మీ యాప్‌లో ఈ యూజర్‌నేమ్ ఫీచర్‌ను ఎందుకు కొనసాగించాలో, దానికి గల బలమైన కారణాలను వివరించాలని ఆదేశించింది. గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్షా ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో టెలిగ్రామ్ వేదికగా మారినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నీట్ రీ-ఎగ్జామ్‌కు ముందు ప్రశ్నపత్రాలు మళ్లీ లీక్ కాకుండా అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్‌పై తాత్కాలికంగా నిషేధం కూడా విధించింది. కస్టమర్ల వివరాలు బయటకు తెలియకుండా అజ్ఞాతంగా ఉండే సదుపాయం క్రిమినల్స్‌కు వరంగా మారుతోందని ప్రభుత్వం భావిస్తోంది.
Oppo Enco Air 5 : భారత్‌లో ఒప్పో కొత్త ఇయర్‌బడ్స్ లాంచ్.. బడ్జెట్ ధరలో అద్భుతమైన సౌండ్ క్వాలిటీ
కేవలం టెలిగ్రామ్, సిగ్నల్ మాత్రమే కాకుండా, ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్‌కు సైతం ఇదే తరహా హెచ్చరికలు ఎదురయ్యాయి. ఈ వారం ప్రారంభంలో వాట్సాప్ మాతృసంస్థ అయిన మెటాకు కూడా కేంద్రం ఒక నోటీసు పంపింది. వాట్సాప్‌లో ప్రవేశపెట్టాలనుకుంటున్న కొత్త యూజర్‌నేమ్ ఫీచర్ ప్రతిపాదనపై ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఫీచర్ గనుక అందుబాటులోకి వస్తే దేశంలో ఆన్‌లైన్ మోసాలు, నకిలీ ఐడీలతో బెదిరింపులకు పాల్పడటం మరియు ప్రస్తుతం కలకలం రేపుతున్న డిజిటల్ అరెస్ట్ లాంటి సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై పూర్తిస్థాయిలో చర్చలు జరిగే వరకు ఈ ఫీచర్‌ను వినియోగదారులకు రోల్ అవుట్ చేయవద్దని వాట్సాప్‌ను కేంద్రం గట్టిగా ఆదేశించింది.
మొబైల్ నంబర్లకు బదులుగా యూజర్‌నేమ్ వాడటం వల్ల సైబర్ నేరగాళ్లకు పెద్ద వెసులుబాటు దొరుకుతుందని ఐటీ మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల మోసగాళ్లు తమ అసలు ఫోన్ నంబర్‌ను దాచిపెట్టి, నకిలీ పేర్లతో సాధారణ ప్రజలను సులభంగా సంప్రదించే అవకాశం ఉంటుంది. ఇది కాస్తా సైబర్ నేరాల దర్యాప్తుకు పెద్ద ప్రతిబంధకంగా మారుతుంది, ఎందుకంటే పోలీసులకు లేదా దర్యాప్తు సంస్థలకు నిందితుల ఐడెంటిటీని గుర్తించడం చాలా కష్టమవుతుంది. ప్రస్తుతం భారతదేశంలో వాట్సాప్‌కు 50 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు. వాట్సాప్ తన డిఫెన్స్‌లో స్పందిస్తూ.. తాము స్కామ్‌లు, నకిలీ ప్రొఫైల్‌లను గుర్తించడానికి, వాటిని అడ్డుకోవడానికి తగిన రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు వివరణ ఇచ్చింది. అయినప్పటికీ, యూజర్ల భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఇలాంటి యాప్‌లన్నింటినీ కఠినంగా స్క్రూటినీ చేస్తోంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999