బివైడి కంపెనీకి చెందిన పాపులర్ మోడల్స్ అయిన అటో 3, లగ్జరీ సెడాన్ సీల్, ఇటీవల వచ్చిన సీలయన్ 7 కార్ల ఎంపిక చేసిన వేరియంట్లపై ధరలను పెంచారు.
BYD
BYD : ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీకి గట్టి పోటీ ఇస్తున్న ఏకైక బ్రాండ్ బివైడి. భారత్‌లో కూడా ఈ చైనీస్ కంపెనీ కార్లకు కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అయితే, ప్రస్తుతం మార్కెట్లో తయారీ ఖర్చులు పెరగడం, ద్రవ్యోల్బణం ప్రభావం చూపడం వల్లే ధరలను పెంచక తప్పలేదని కంపెనీ ప్రకటించింది. దీనితో పాటు భారతదేశంలో తమ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి, సరికొత్త టెక్నాలజీని తీసుకురావడానికి చేస్తున్న పెట్టుబడుల వల్ల కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది.
ఏయే కార్ల ధరలు ఎంత పెరిగాయంటే?
మీడియా రిపోర్టుల ప్రకారం.. బివైడి కంపెనీకి చెందిన పాపులర్ మోడల్స్ అయిన అటో 3, లగ్జరీ సెడాన్ సీల్, ఇటీవల వచ్చిన సీలయన్ 7 కార్ల ఎంపిక చేసిన వేరియంట్లపై ధరలను పెంచారు. ఈ కార్ల రేట్లను వేరియంట్‌ను బట్టి రూ.50,000 నుంచి రూ.1,00,000 వరకు పెంచుతూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి రానున్నాయి.
మార్కెట్లోకి ఇమార్క్స్ 7 కొత్త వేరియంట్
ధరల పెంపుతో పాటు సరికొత్త గుడ్‌న్యూస్‌ను కూడా బివైడి అందించింది. ఫ్యామిలీ కస్టమర్లను ఆకట్టుకునేందుకు తన మల్టీ పర్పస్ వెహికల్ (MPV) అయిన eMAX 7లో ఒక కొత్త వేరియంట్‌ను పరిచయం చేసింది. దీనికి కంఫర్ట్ అని పేరు పెట్టారు. ఇందులో పవర్‌ఫుల్ 71.8 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి, పెద్ద కుటుంబాలకు ఈ మోడల్ చాలా బాగా సెట్ అవుతుందని కంపెనీ భావిస్తోంది.
సీలయన్ 7 యానివర్సరీ ఎడిషన్
భారత మార్కెట్లో అడుగుపెట్టి విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సీలయన్ 7 ఎలక్ట్రిక్ SUV కి చెందిన ప్రత్యేక యానివర్సరీ ఎడిషన్‌ను కూడా కంపెనీ లాంచ్ చేసింది. ఇందులో ఒక పెద్ద సాంకేతిక మార్పు చేశారు. ఈ కారులోని లో-వోల్టేజ్ బ్యాటరీ కోసం అడ్వాన్స్‌డ్ ఎల్‌ఎఫ్‌పి (LFP) టెక్నాలజీని ఉపయోగించారు. అంతేకాకుండా, ఈ యానివర్సరీ ఎడిషన్ బ్యాటరీపై కంపెనీ ఏకంగా 8 సంవత్సరాలు లేదా 1,50,000 కిలోమీటర్ల వరకు ఎక్స్‌టెండెడ్ వారంటీని ఆఫర్ చేస్తోంది.
Donald Trump : క్రిప్టో బిజినెస్‌తో డొనాల్డ్ ట్రంప్‌కు కాసుల వర్షం.. గతేడాది ఏకంగా $1.4 బిలియన్ల సంపాదన
ఫీచర్లు, పవర్ పరంగా అదరహో
ఈ కొత్త యానివర్సరీ ఎడిషన్ లోపల సరికొత్త తాహితీ బ్లూ కలర్ థీమ్‌ను ఉపయోగించారు, ఇది కారుకు మరింత లగ్జరీ లుక్‌ను ఇస్తుంది. మిగతా ఫీచర్లు ఎప్పటిలాగే పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఇందులో 15.6 ఇంచుల రొటేటబుల్ ఇన్‌ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 10.25 ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, క్రిస్టల్ గేర్ సెలెక్టర్, డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ ఉన్నాయి.
ఈ కారులో 82.56 kWh బ్యాటరీ ఉంటుంది. దీని ఆల్-వీల్ డ్రైవ్ (AWD) వేరియంట్ 523 hp పవర్, 690 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. అలాగే రేర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ సింగిల్ మోటార్‌తో 308 hp పవర్, 380 Nm టార్క్‌ను అందిస్తుంది.
కస్టమర్ల నమ్మకమే మా బలం: రాజీవ్ చౌహాన్
భారతదేశంలో బివైడి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ హెడ్ రాజీవ్ చౌహాన్ మాట్లాడుతూ.. "భారతీయ కస్టమర్ల నుంచి మా ఈవీ పోర్ట్‌ఫోలియోకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇది మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. కస్టమర్లకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి, సరికొత్త టెక్నాలజీని అందించడానికి మరియు షోరూమ్‌ల నెట్‌వర్క్‌ను పెంచడానికి దేశంలో మా పెట్టుబడులను నిరంతరం కొనసాగిస్తూనే ఉంటాం" అని స్పష్టం చేశారు.
ప్రకటన
ప్రకటన