ఐఫోన్ 16 ప్రో మాక్స్ కంపెనీ ప్రస్తుత ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్
Apple ఫోన్ అభిమానులకు ఇది అదిరిపోయే వార్త అనే చెప్పాలి. త్వరలోనే మొబైల్ మార్కెట్‌లోకి Apple నుంచి iPhone 17 సిరీస్ అందుబాటులోకి రానుంది. ఈ సిరీస్‌లో భాగంగా iPhone 17 Pro Max ను పరిచయం చేయనున్నట్లు ఓ టిప్‌స్టర్ ద్వారా లీక్ అయ్యింది. ఈ మోడల్ గతంలో వచ్చిన 16 Pro Max కంటే మంచి బ్యాటరీ అప్‌గ్రేడ్‌తో రానుంది. దీనికి 5,000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని అందించే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అంటే, ఈ సామర్థ్యంతో వస్తోన్న మొదటి మోడల్‌గా 17 Pro Max నిలుస్తుంది. ఈ మొబైల్‌కు సంబంధించిన కీలక విషయాలను తెలుసుకుందాం.రీ డిజైన్ బాడీతోపాటు,తాజాగా లీక్ అయిన సమాచారాన్న బట్టీ, iPhone 17 Pro Max సరికొత్త డిజైన్, అప్‌గ్రేడ్‌లతో అందుబాటులోకి రానుంది. మరీ ముఖ్యంగా 5,000mAh బ్యాటరీతో ఈ లైనప్‌లో వస్తోన్న మొదటి ఫోన్‌గా ఇది గుర్తింపు పొందనుంది. అంతే కాదు, గతంలో వచ్చిన 16 Pro Max కు అందించిన 4,676mAh బ్యాటరీతో పోల్చినప్పుడు ఇది మరింత శక్తివంతంగా మారనుంది. దీనిని ఆల్ట్రా గారీబ్రాండ్‌గా రూపొందించే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే, దీనికి రీ డిజైన్ బాడీతోపాటు వినియోగదారులను ఆకట్టుకునే కెమెరా ఫీచర్స్‌ను జోడించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నాయి.
కొత్త iPhone 17 Pro Max ను సెప్టెంబర్ నెలలో మార్కెట్‌కు పరిచయం చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. అయితే, ఇప్పటి వరకూ Apple లాంఛ్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక తేదీని ప్రకటించలేదు. అలాగే, iPhone 17 Pro Max తోపాటు మరో మూడు మోడల్స్ కూడా ఇదే సమయంలో విడుదల అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా, ఈ హ్యాండ్‌సెట్‌కు కూలింగ్ కోసం స్టీమ్ కూలింగ్ ఛాంబర్‌ను అందించనున్నట్లు సమాచారం.
రాబోయే ఈ iPhone 17 Pro Max ఫోన్ 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ కలిగి, 6.9 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను కలిగి ఉండొచ్చు. అలాగే, ఇది అండర్ ది హుడ్ Apple A19 Pro చిప్‌తో రూపొందించబడుతోంది. అంతే కాదు, 12GB RAM తో iPhone iOS19తో మార్కెట్‌లోకి రానున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. డిజైన్‌లో భాగంగా Apple టైటానియం ఫ్రేం కు బదులు అల్యూమినియంను అందించవచ్చని అంచనా వేస్తున్నాయి.
వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా యూనిట్‌లో iPhone 17 Pro Max రానున్నట్లు తెలుస్తోంది. అలాగే, దీనికి వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 24 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. ఈ మోడల్‌కు అందించే కెమెరా యూనిట్ యూజర్స్‌ను మరింత ఆకర్షించే అవకాశాలు ఉన్నట్లు కంపెనీ భావిస్తోంది. దీనికి LiDAR సెన్సార్‌తోపాటు మైక్రోఫోన్, ష్లాష్ రైట్ సైడ్‌ను కూడా అందించవచ్చని అంచనా.
ప్రకటన
ప్రకటన