iQOO 16 : 9000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ లేటెస్ట్ ప్రొసెసర్‌.. ఐకూ 16 లీకైన ఫీచర్లు అదరహో

హై-పెర్ఫార్మెన్స్ స్మార్ట్‌ఫోన్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఐకూ కంపెనీ.. తన తదుపరి తరం ఫ్లాగ్‌షిప్ మొబైల్ ఐకూ 16ను మార్కెట్లోకి దించడానికి చకచకా ఏర్పాట్లు చేస్తోంది.

iQOO 16 : 9000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ లేటెస్ట్ ప్రొసెసర్‌.. ఐకూ 16 లీకైన ఫీచర్లు అదరహో

iQOO 16 is expected to launch with several upgrades over the iQOO 15 (pictured)

ముఖ్యాంశాలు
  • ఐకూ 16ను మార్కెట్లోకి దించడానికి చకచకా ఏర్పాట్లు చేస్తోంది
  • ఐఎంఈఐ లిస్టింగ్ ప్రకారం ఈ ఫోన్ మోడల్ నెంబర్ I2601 గా ఉంది.
  • ఏకంగా 9000mAh బ్యాటరీతో ప్రపంచాన్ని శాసించబోతున్న ఐకూ 16
ప్రకటన

iQOO 16 : మొబైల్ ప్రియులకు, ముఖ్యంగా రాత్రింబవళ్లు గేమింగ్ ఆడేవారికి ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. హై-పెర్ఫార్మెన్స్ స్మార్ట్‌ఫోన్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఐకూ కంపెనీ.. తన తదుపరి తరం ఫ్లాగ్‌షిప్ మొబైల్ ఐకూ 16ను మార్కెట్లోకి దించడానికి చకచకా ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా ఈ ఫోన్ అంతర్జాతీయ ఐఎంఈఐ డేటాబేస్‌లో కనిపించడంతో టెక్ ప్రపంచంలో అప్పుడే ప్రకంపనలు మొదలయ్యాయి. ఐకూ 15 విజయవంతం కావడంతో, దానికి సీక్వెల్‌గా రాబోతున్న ఈ సరికొత్త మోడల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇండియా లాంచ్ ఎప్పుడు ఉండొచ్చు?
ఐఎంఈఐ లిస్టింగ్ ప్రకారం ఈ ఫోన్ మోడల్ నెంబర్ I2601 గా ఉంది. వివో కంపెనీకి చెందిన ఈ సబ్‌బ్రాండ్, ప్రస్తుతం ఐకూ 16 ఇండియన్, గ్లోబల్ వేరియంట్లకు సంబంధించిన ఇంటర్నల్ టెస్టింగ్స్ కూడా ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. పాత ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో చైనాలో విడుదలైన వెంటనే, నవంబర్ లేదా డిసెంబర్ నాటికి ఈ ఫోన్ భారత మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం బలంగా కనిపిస్తోంది.

9000mAh బ్యాటరీ.. ఇండస్ట్రీలోనే రికార్డ్ 
ఈ ఫోన్ గురించి లీకైన విశేషాల్లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం దీని బ్యాటరీ కెపాసిటీ. సాధారణంగా ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో 5000mAh లేదా 6000mAh బ్యాటరీలను చూస్తుంటాం. కానీ ఐకూ ఒక అడుగు ముందుకు వేసి ఈ కొత్త ఫోన్ లో ఏకంగా 9,000mAh భారీ బ్యాటరీని అమర్చబోతున్నట్లు లీకుల ద్వారా సమాచారం బయటకు వచ్చింది. ఈ లీక్ గనుక నిజమైతే.. స్మార్ట్‌ఫోన్ హిస్టరీలోనే ఇదొక పెను సంచలనం అవుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజులు గడిచినా ఛార్జింగ్ అయిపోదనే ధీమాతో యూజర్లు ఉండొచ్చు.
 

Realme : భారత్‌లోకి రియల్‌మీ సరికొత్త స్మార్ట్‌వాచ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 20 రోజుల బ్యాటరీ లైఫ్

రాకెట్ స్పీడ్ ఇచ్చే సరికొత్త ప్రొసెసర్ 
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఐకూ ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వదు. ఈ అప్‌కమింగ్ మొబైల్‌లో క్వాల్కమ్ కంపెనీకి చెందిన లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో+ చిప్‌సెట్‌ను వాడబోతున్నట్లు టెక్ వర్గాలు చెప్తున్నాయి. ఈ ప్రొసెసర్ కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనుల కోసమే కాకుండా.. హెవీ గ్రాఫిక్స్ గేమింగ్‌ను సైతం చాలా స్మూత్‌గా రన్ చేసేలా డిజైన్ చేశారు. దీనికి తోడు ఫోన్ అస్సలు వేడెక్కకుండా ఉండేందుకు అడ్వాన్స్‌డ్ ప్యాసివ్ కూలింగ్ సిస్టమ్, కంపెనీ సొంతంగా డెవలప్ చేసిన పర్ఫార్మెన్స్ చిప్‌ను కూడా ఇందులో జోడించనున్నారు.

కెమెరాలో కూడా భారీ అప్‌గ్రేడ్స్ 
ఫోటోగ్రఫీ పరంగా కూడా ఐకూ 16 అదరగొట్టేలా కనిపిస్తోంది. ఇందులో వెనుక వైపు మూడు కెమెరాల సెటప్ ఉండబోతోంది. సుదూర ప్రాంతాల్లో ఉన్న వస్తువులను, ప్రకృతి దృశ్యాలను చాలా స్పష్టంగా, బ్లర్ లేకుండా క్లోజప్‌గా క్యాప్చర్ చేయడం కోసం ఇందులో అప్‌గ్రేడెడ్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను ఇస్తున్నారు. పాత మోడల్ ఐకూ 15 లో 50MP కెమెరాలు ఉన్నప్పటికీ.. ఈ కొత్త వెర్షన్‌లో అంతకంటే బెటర్ జూమింగ్ సామర్థ్యం, మెరుగైన నైట్ ఫోటోగ్రఫీ ఫీచర్లను తీసుకొస్తున్నారు.

OTT Movies : ఈ వారం ఓటీటీలో పండగే.. ఏకంగా 11 కొత్త సినిమాలు, సిరీస్‌లు!

ధర ఎంత ఉండొచ్చు?
ఐకూ 16 ధర ఎంత ఉంటుంది అనే దానిపై కంపెనీ ఇంకా ఎలాంటి హింట్ ఇవ్వలేదు. అయితే ఇందులో వాడే అత్యాధునిక హార్డ్‌వేర్, నెరవేరని బ్యాటరీ లైఫ్, నెక్స్ట్ జనరేషన్ ప్రొసెసర్‌లను బట్టి చూస్తుంటే ఇది ఖచ్చితంగా ప్రీమియం ఫ్లాగ్‌షిప్ కేటగిరీలోనే (దాదాపు రూ.60,000 పైమాటే) ఉండే అవకాశం ఉంది. వన్‌ప్లస్, శామ్‌సంగ్ వంటి దిగ్గజ బ్రాండ్ల టాప్-ఎండ్ ఫోన్లకు ఇది గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. EV Sales : మార్కెట్‌లో ఈవీ సునామీ.. రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ టూవీలర్లు, కార్ల అమ్మకాలు
  2. Redmi Note 17 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సునామీ.. 8,000mAh బ్యాటరీతో వస్తున్న రెడ్‌మీ నోట్ 17
  3. Oppo A7 Pro Max : పవర్ బ్యాంక్‌లకు శాశ్వతంగా గుడ్ బై.. ఒప్పో కొత్త ఫోన్ చూస్తే షాక్ అవ్వడం ఖాయం
  4. Digital India : దేశమంతటా డిజిటల్ జోరు.. 99.9 శాతం జిల్లాల్లో అందుబాటులోకి 5G సేవలు
  5. Vivo T5e vs Realme C100x vs Samsung Galaxy F70e 5G: రూ.15 వేల లోపు బెస్ట్ ఫోన్ ఏది?
  6. Samsung Galaxy S25 Ultra 5G : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాపై భారీ ఆఫర్.. ఏకంగా రూ.47,000 తగ్గింది
  7. Voter List : ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా.. ఈసీఐ డ్రాఫ్ట్ లిస్ట్ విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే ?
  8. Google Pixel 11 Series Price Hike : గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ లవర్లకు షాక్.. భారీగా పెరగనున్న ధరలు
  9. Amazon Great Freedom Sale vs Flipkart Freedom Sale : ఆఫర్లే ఆఫర్లు.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల ఫ్రీడమ్ సేల్స్‌ వచ్చేస్తున్నాయ్
  10. Smartphone Price Hike : భారీగా పెరిగిన షియోమి, రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »