Realme : భారత్‌లోకి రియల్‌మీ సరికొత్త స్మార్ట్‌వాచ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 20 రోజుల బ్యాటరీ లైఫ్

ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 1500 నిట్స్ బ్రైట్‌నెస్, స్మూత్ పర్ఫార్మెన్స్ కోసం 60హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే సపోర్ట్‌ను ఇందులో చేర్చారు.

Realme : భారత్‌లోకి రియల్‌మీ సరికొత్త స్మార్ట్‌వాచ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 20 రోజుల బ్యాటరీ లైఫ్

Photo Credit: Realme

Realme Watch S5 has 5ATM water resistance

ముఖ్యాంశాలు
  • రియల్‌మీ వాచ్ ఎస్5‎ను కూడా అధికారికంగా లాంచ్ చేసింది.
  • ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 1500 నిట్స్ బ్రైట్‌నెస్
  • స్మూత్ పర్ఫార్మెన్స్ కోసం 60హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే
ప్రకటన

Realme : ప్రముఖ టెక్ బ్రాండ్ రియల్‌మీ భారత మార్కెట్లోకి సరికొత్త గ్యాడ్జెట్స్‌తో దూసుకొచ్చింది. శుక్రవారం జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్‌లో రియల్‌మీ 16టీ   స్మార్ట్‌ఫోన్‌తో పాటు, సరికొత్త స్మార్ట్‌వాచ్ రియల్‌మీ వాచ్ ఎస్5‎ను కూడా అధికారికంగా లాంచ్ చేసింది. అదిరిపోయే లుక్, అదిక ఫీచర్లు, అద్భుతమైన బ్యాటరీ లైఫ్‌తో వచ్చిన ఈ స్మార్ట్‌వాచ్‌పై టెక్ ప్రియుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్ గుండ్రటి డిజైన్‌తో చాలా క్లాసిక్ లుక్‌లో కనిపిస్తుంది. ఇందులో 1.97-ఇంచుల భారీ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 1500 నిట్స్ బ్రైట్‌నెస్, స్మూత్ పర్ఫార్మెన్స్ కోసం 60హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే సపోర్ట్‌ను ఇందులో చేర్చారు. అంతేకాదు, రాత్రి వేళల్లో స్క్రీన్ కంటికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు 'స్మార్ట్ నైట్ విజన్' ఫీచర్ కూడా ఉంది.

చేతి నుంచే ఫోన్ మాట్లాడేయొచ్చు 
ఈ రోజుల్లో స్మార్ట్‌వాచ్‌లలో బ్లూటూత్ కాలింగ్ అనేది చాలా కామన్‌గా మారింది. రియల్‌మీ వాచ్ ఎస్5 లో కూడా ఈ ఫీచర్‌ను అద్భుతంగా డిజైన్ చేశారు. మీ స్మార్ట్‌ఫోన్‌ను బ్లూటూత్ ద్వారా ఈ వాచ్‌కి కనెక్ట్ చేసుకుంటే.. ఫోన్ చేతిలోకి తీసుకోకుండానే నేరుగా మీ మణికట్టు నుంచే కాల్స్ మాట్లాడవచ్చు, అలాగే కాల్స్ రిసీవ్ కూడా చేసుకోవచ్చు.

ఆరోగ్యంపై 24 గంటల నిఘా 
హెల్త్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో చాలా రకాల ట్రాకర్లను చేర్చారు. రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని కొలిచే SpO2 మానిటర్, గుండె వేగాన్ని కనిపెట్టే హార్ట్ రేట్ మానిటరింగ్ సిస్టమ్ ఇందులో ఉన్నాయి. వీటితో పాటు యూజర్ల నిద్ర నాణ్యత, పరిసరాల్లోని శబ్దాల తీవ్రత, మానసిక ఒత్తిడి స్థాయిలను కూడా ఇది అంచనా వేస్తుంది. మహిళల నెలసరి చక్రానికి సంబంధించిన ట్రాకింగ్ సమాచారాన్ని కూడా ఈ వాచ్ అందిస్తుంది.

ఫిట్‌నెస్ ఫ్రీక్స్ కోసం 110 కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ 
ఆరోగ్యం, శారీరక శ్రమపై శ్రద్ధ పెట్టే వారి కోసం ఇందులో ఏకంగా 110 కి పైగా స్పోర్ట్స్ మోడ్స్‌ను అందించారు. రన్నింగ్, సైక్లింగ్, యోగా, బ్యాడ్మింటన్ వంటి ఎన్నో రకాల వ్యాయామాలను దీని ద్వారా ట్రాక్ చేయవచ్చు. ముఖ్యంగా రన్నింగ్ చేసే వారి కోసం పేసింగ్ మెట్రోనమ్ అనే ప్రత్యేక ఫీచర్ ఉంది. ఇది రన్నర్ల ఏరోబిక్ సామర్థ్యాన్ని, ట్రైనింగ్ కోర్సుల మెట్రిక్స్‌ను వివరంగా చూపిస్తుంది.

నీటిలో పడినా నో ప్రాబ్లం 
రహదారుల నావిగేషన్ కోసం ఇందులో 5-సిస్టమ్ జీఎన్ఎస్ఎస్ (GNSS) పొజిషనింగ్ కలిగిన జీపీఎస్‎ను అమర్చారు. దీనివల్ల రూట్ ట్రాకింగ్ చాలా ఖచ్చితత్వంతో జరుగుతుంది. అలాగే ఈ వాచ్‌కు 5ATM వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉంది. అంటే నీటిలో తడిసినా లేదా స్విమ్మింగ్ చేసినా ఈ వాచ్ పాడవదు. ఇంకో మంచి విషయమేంటంటే.. చేతులు తడిగా ఉన్నా సరే ఈ వాచ్ డిస్‌ప్లే టచ్ ఇన్పుట్లను చక్కగా తీసుకుంటుందని రియల్‌మీ స్పష్టం చేసింది.

Realme : మార్కెట్లోకి వచ్చేసిన రియల్‌మి 16T.. ఏకంగా 8000mAh భారీ బ్యాటరీతో సరికొత్త రికార్డు!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 
స్మార్ట్‌వాచ్‌లు వాడేవారికి ప్రతిరోజూ ఛార్జింగ్ పెట్టడం పెద్ద తలనొప్పిగా మారుతుంది. కానీ రియల్‌మీ వాచ్ ఎస్5 లో ఆ సమస్య లేదు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 20 రోజుల పాటు బ్యాటరీ లైఫ్ వస్తుందని కంపెనీ చెబుతోంది. ఇంత భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ, ఈ వాచ్ కేవలం 11.8mm మందం,  32 గ్రాముల బరువుతో చాలా తేలికగా ఉంటుంది.

ధర ఎంత? ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది?
భారత మార్కెట్లో రియల్‌మీ వాచ్ ఎస్5 ధరను రూ. 7,999 గా నిర్ణయించారు. ఇది రాక్ గ్రే, సాండ్ వైట్ అనే రెండు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది. జూన్ 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి దేశవ్యాప్తంగా దీని విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

సంబంధిత వార్తలు

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. EV Sales : మార్కెట్‌లో ఈవీ సునామీ.. రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ టూవీలర్లు, కార్ల అమ్మకాలు
  2. Redmi Note 17 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సునామీ.. 8,000mAh బ్యాటరీతో వస్తున్న రెడ్‌మీ నోట్ 17
  3. Oppo A7 Pro Max : పవర్ బ్యాంక్‌లకు శాశ్వతంగా గుడ్ బై.. ఒప్పో కొత్త ఫోన్ చూస్తే షాక్ అవ్వడం ఖాయం
  4. Digital India : దేశమంతటా డిజిటల్ జోరు.. 99.9 శాతం జిల్లాల్లో అందుబాటులోకి 5G సేవలు
  5. Vivo T5e vs Realme C100x vs Samsung Galaxy F70e 5G: రూ.15 వేల లోపు బెస్ట్ ఫోన్ ఏది?
  6. Samsung Galaxy S25 Ultra 5G : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాపై భారీ ఆఫర్.. ఏకంగా రూ.47,000 తగ్గింది
  7. Voter List : ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా.. ఈసీఐ డ్రాఫ్ట్ లిస్ట్ విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే ?
  8. Google Pixel 11 Series Price Hike : గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ లవర్లకు షాక్.. భారీగా పెరగనున్న ధరలు
  9. Amazon Great Freedom Sale vs Flipkart Freedom Sale : ఆఫర్లే ఆఫర్లు.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల ఫ్రీడమ్ సేల్స్‌ వచ్చేస్తున్నాయ్
  10. Smartphone Price Hike : భారీగా పెరిగిన షియోమి, రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »