iQOO 16 Leakes: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఐకూ కొత్త సంచలనం.. iQOO 16లో ఏకంగా 8500 mAh బ్యాటరీ

iQOO 16 Leakes: గత ఏడాది నవంబర్‌లో భారత మార్కెట్లోకి వచ్చిన పాపులర్ ఫోన్ iQOO 15కి సక్సెసర్‌గా ఈ సరికొత్త మొబైల్ రానుంది.

iQOO 16 Leakes: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఐకూ కొత్త సంచలనం.. iQOO 16లో ఏకంగా 8500 mAh బ్యాటరీ

Photo Credit: iQOO

iQOO 15

ముఖ్యాంశాలు
  • స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఐకూ కొత్త సంచలనం
  • స్నాప్‌డ్రాగన్ లేటెస్ట్ ప్రాసెసర్‌తో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్
  • iQOO 16 లో ఏకంగా 8500 mAh బ్యాటరీ
ప్రకటన

iQOO 16 Leakes: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ ఐకూ మొబైల్ లవర్స్ కోసం ఒక సరికొత్త పవర్‌ఫుల్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. తన ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో భాగంగా  iQOO 16 మోడల్‌ను త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు లీకుల ద్వారా తెలుస్తోంది. గత ఏడాది నవంబర్‌లో భారత మార్కెట్లోకి వచ్చిన పాపులర్ ఫోన్ iQOO 15కి సక్సెసర్‌గా ఈ సరికొత్త మొబైల్ రానుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో ఎవరూ ఊహించని విధంగా ఏకంగా 8,500 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే స్మార్ట్‌ఫోన్ హిస్టరీలోనే ఇదొక బిగ్గెస్ట్ బ్యాటరీ ఫోన్‌గా రికార్డు సృష్టించనుంది.

లీకైన ఐకూ 16 అదిరిపోయే ఫీచర్లు..

ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ వైబోలో ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ షేర్ చేసిన పోస్ట్ ప్రకారం.. ప్రస్తుతం iQOO 16 ఇంజనీరింగ్ ప్రొటోటైప్ ను కంపెనీ ల్యాబ్‌లో టెస్ట్ చేస్తోంది. ఈ ఫోన్‌లో క్వాల్కమ్ సంస్థకు చెందిన అప్ కమింగ్ అత్యంత శక్తివంతమైన  స్నాప్‌డ్రాగన్ 8 ఎలిట్ జెన్ 6 ప్రో చిప్‌సెట్‌ను వాడుతున్నట్లు సమాచారం. అలాగే అదిరిపోయే గ్రాఫిక్స్ కోసం ఇందులో అడ్రినో 850 జీపీయూని జత చేశారు. ప్రొటోటైప్ మోడల్ వివరాల ప్రకారం.. ఇందులో రెండు వైపులా సమానంగా సౌండ్ వచ్చే సిమెట్రికల్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లను, గేమింగ్ ఆడేటప్పుడు సూపర్ హ్యాప్టిక్ ఫీడ్‌బ్యాక్ కోసం ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటార్‌ను అమర్చారు.

మొబైల్ గేమర్లకు పండగే..

ఈ సరికొత్త ఐకూ 16 స్మార్ట్‌ఫోన్ కేవలం బ్యాటరీ, ప్రాసెసర్ పరంగానే కాకుండా సెక్యూరిటీ, కెమెరా విభాగంలోనూ దుమ్మురేపనుంది. వేగంగా ఫోన్ అన్‌లాక్ అవ్వడానికి ఇందులో అత్యాధునిక  3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‎ను ఇస్తున్నారు. అలాగే ఫోటోగ్రఫీని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు బ్యాక్ సైడ్ పవర్‌ఫుల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కూడా జోడించబోతున్నారు. ఇటీవల ఈ ఫోన్ ఐఎంఈఐ డేటాబేస్‌లో మోడల్ నెంబర్ I2601 తో కనిపించింది. హెవీ గేమింగ్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ఇందులో సరికొత్త డిజైన్‌తో కూడిన అడ్వాన్స్‌డ్ థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను కూడా ఐకూ వాడుతోంది.

భారత్‌కు ఈ పవర్‌ఫుల్ ఫోన్ రావడం కష్టమేనా..?

ఫీచర్లు అద్భుతంగా ఉన్నప్పటికీ, భారతీయ ఐకూ అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ వినబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ మెమరీ చిప్‌ల ధరలు విపరీతంగా పెరిగిపోతుండటం వల్ల, ఈ iQOO 16 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఒకవేళ లాంచ్ చేసినా ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండకపోవచ్చని అంచనా. అయితే ఈ లాంచ్, ధరల వ్యవహారంపై ఐకూ ఇండియా కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదా స్పష్టత ఇవ్వలేదు.

Redmi : ఛార్జింగ్ టెన్షన్‌కు ఎండ్ కార్డ్.. ఏకంగా 10,000mAh మెగా బ్యాటరీతో వస్తున్న రెడ్‌మి టర్బో 6

ఐకూ 15తో పోలిస్తే కొత్త ఫోన్ లో మారబోతున్న ఫీచర్లు ఇవే..

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న iQOO 15 ఫీచర్లను ఒకసారి పరిశీలిస్తే.. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6 పై రన్ అవుతుంది. ఇందులో 6.85 ఇంచుల శామ్‌సంగ్ M14 8T LTPO అమోలెడ్ డిస్‌ప్లే ఉంది, ఇది 2K రెజల్యూషన్, 144 Hz రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే ఓఐఎస్ సపోర్ట్‌తో 50 MP ప్రైమరీ కెమెరా, 50 MP టెలిఫోటో పెరిస్కోప్ కెమెరా, 50 MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 32 MP ఫ్రంట్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 8 ఎలిట్ జెన్ 5 చిప్‌సెట్,  కొన్ని స్మార్ట్ ఏఐ  ఫీచర్లు ఉన్నాయి. దీనిలోని 7,000 mAh బ్యాటరీ 100W వైర్డ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనితో పోలిస్తే రాబోయే iQOO 16 లో బ్యాటరీ ఏకంగా 8500 mAh కి పెరగడమే కాకుండా, ప్రాసెసర్ కూడా నెక్స్ట్ జనరేషన్‌కు అప్‌గ్రేడ్ కానుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »