Redmi Turbo 6 Series with 10,000mAh Battery: ఛార్జింగ్ టెన్షన్‌కు ఎండ్ కార్డ్.. ఏకంగా 10,000mAh మెగా బ్యాటరీతో వస్తున్న రెడ్‌మి టర్బో 6

Redmi Turbo 6 Series with 10,000mAh Battery: రాబోయే రెడ్‌మి టర్బో 6 సిరీస్‌లో ఏకంగా 10,000mAh సామర్థ్యం కలిగిన అత్యంత శక్తివంతమైన మెగా బ్యాటరీని అమర్చనున్నారు.

Redmi Turbo 6 Series with 10,000mAh Battery: ఛార్జింగ్ టెన్షన్‌కు ఎండ్ కార్డ్.. ఏకంగా 10,000mAh మెగా బ్యాటరీతో వస్తున్న రెడ్‌మి టర్బో 6

Redmi Turbo 5

ముఖ్యాంశాలు
  • స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రెడ్‌మి సంచలనం
  • త్వరలోనే ‘Redmi Turbo 6’ సిరీస్ లాంచ్
  • ఏకంగా 10,000mAh మెగా బ్యాటరీతో వస్తున్న రెడ్‌మి టర్బో 6
ప్రకటన

Redmi Turbo 6 Series with 10,000mAh battery: ప్రముఖ చైనీస్ టెక్ దిగ్గజం షావోమి సబ్‌బ్రాండ్ అయిన రెడ్‌మి, మార్కెట్లో తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను లాంచ్ చేయడానికి వేగంగా అడుగులు వేస్తోంది. టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెడ్‌మి టర్బో 6 సిరీస్ త్వరలోనే అధికారికంగా విడుదల కానుంది. ఈ సిరీస్ కింద కంపెనీ రెండు పవర్‌ఫుల్ మోడళ్లను తీసుకురాబోతోంది. వాటిలో స్టాండర్డ్ మోడల్ రెడ్‌మి టర్బో 6 తో పాటు, మరింత ప్రీమియం ఫీచర్లతో కూడిన Redmi Turbo 6 Max మోడల్ కూడా ఉండనుంది. చైనీస్ మైక్రోబ్లాగింగ్ సైట్ వీబోలో లీకైన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ల డిజైన్, బ్యాటరీ సామర్థ్యం మునుపెన్నడూ లేని విధంగా ఉండబోతున్నాయి.

ఛార్జింగ్ టెన్షన్‌కు ఎండ్ కార్డ్..

ప్రముఖ చైనీస్ టిప్‌స్టర్ స్మార్ట్ పికాచు లీక్ చేసిన సమాచారం ప్రకారం.. రాబోయే రెడ్‌మి టర్బో 6 సిరీస్‌లో ఏకంగా 10,000mAh సామర్థ్యం కలిగిన అత్యంత శక్తివంతమైన మెగా బ్యాటరీని అమర్చనున్నారు. ఒక నార్మల్ స్మార్ట్‌ఫోన్‌లో ఈ స్థాయిలో భారీ బ్యాటరీని అందించడం నిజంగా విశేషం. దీనివల్ల యూజర్లు ఒక్కసారి ఛార్జ్ చేస్తే సులభంగా మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఎలాంటి టెన్షన్ లేకుండా ఫోన్ వాడుకోవచ్చు. ఈ సిరీస్‌లో రెండు ఫోన్లు కూడా భారీ 7 ఇంచుల డిస్‌ప్లేతో రాబోతున్నట్లు సమాచారం. ఇంత పెద్ద స్క్రీన్, మెగా బ్యాటరీ ఉండటంతో గేమింగ్, మల్టీమీడియా లవర్స్‌కు ఈ ఫోన్లు బెస్ట్ ఛాయిస్‌గా మారనున్నాయి.

మీడియాటెక్ డైమెన్సిటీ పవర్‌ఫుల్ చిప్‌సెట్లు..

ఈ సిరీస్ లోని రెండు మోడళ్లలో విభిన్న ప్రాసెసర్లను ఉపయోగించబోతున్నట్లు లీక్స్ ద్వారా వెల్లడైంది. బేస్ మోడల్ అయిన రెడ్‌మి టర్బో 6 లో రాబోయే సరికొత్త  MediaTek Dimensity 8600 చిప్‌సెట్‌ను వాడనున్నారు. ఇదే ప్రాసెసర్‌ను హానర్ బ్రాండ్ కింద రాబోయే 12,000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌లో కూడా వాడబోతున్నట్లు సమాచారం. ఇక హై-ఎండ్ మోడల్ అయిన రెడ్‌మి టర్బో 6 మాక్స్ లో మరింత శక్తివంతమైన MediaTek Dimensity 9600s ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌ను చేర్చనున్నారు. దీనివల్ల ఫోన్ పర్ఫార్మెన్స్ చాలా వేగంగా ఉండటంతో పాటు హెవీ గ్రాఫిక్స్ గేమింగ్ చాలా స్మూత్‌గా సాగుతుంది.

Oppo Find X10 : ఏకంగా 200ఎంపీతో మూడు వెనుక కెమెరాలు.. ఒప్పో ఫైండ్ X10 ప్రో మాక్స్ లీకైన క్రేజీ ఫీచర్లు

మెటల్ ఫ్రేమ్, 2K హై-క్వాలిటీ డిస్‌ప్లే..

టాప్ వేరియంట్ అయిన రెడ్‌మి టర్బో 6 మాక్స్ స్పెసిఫికేషన్లు యూజర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇందులో అద్భుతమైన విజువల్స్ అందించే 2K హై-రిజల్యూషన్ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. ఫోన్ బిల్డ్ క్వాలిటీ మరింత స్ట్రాంగ్‌గా ఉండేందుకు చుట్టూ మెటల్ ఫ్రేమ్‌ను అమర్చారు. సేఫ్టీ విషయానికి వస్తే ఇందులో స్క్రీన్ లోపలే అమర్చే సరికొత్త ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించనున్నారు. ఈ ఫీచర్లన్నీ చూస్తుంటే రెడ్‌మి ఈసారి ప్రీమియం రేంజ్ ఫోన్లకు గట్టి పోటీ ఇచ్చేందుకే ఈ మాక్స్ మోడల్‌ను సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే రెడ్‌మి సరిగ్గా గత నెలలోనే భారత మార్కెట్లో  Redmi Turbo 5 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగిన 6.59 ఇంచుల 1.5K ఫ్లూయిడ్ డిస్‌ప్లేతో వచ్చింది. గొరిల్లా గ్లాస్ 7i రక్షణ కలిగిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ ఓఎస్ 3 పై రన్ అవుతుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్, 3D ఐస్-లూప్ కూలింగ్ సిస్టమ్ ఉన్నాయి. కెమెరాల పరంగా వెనుక 50MP (OIS) ప్రధాన కెమెరా + 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉండగా, ముందు 20MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇందులో 100W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 7,540mAh బ్యాటరీని అందించారు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »