ISRO Scientist Mass Resignations: ఇస్రోలోని వివిధ కీలక కేంద్రాల నుంచి శాస్త్రవేత్తలు పెద్ద ఎత్తున తప్పుకుంటున్నట్లు నివేదికలు వచ్చాయి
Photo Credit: Wikimedia common
ISRO
ISRO Scientist mass resignations: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే భవిష్యత్ మెగా మిషన్లలో పనిచేస్తున్న కీలక శాస్త్రవేత్తలు వరుసగా రాజీనామాలు చేస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే అంతరిక్ష శాఖ ఒక కీలకమైన అంతర్గత ఉత్తర్వులను జారీ చేసింది. గగన్‌యాన్ వంటి జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులు అర్ధాంతరంగా ఆగిపోకుండా ఉండేందుకు, శాస్త్రవేత్తల రాజీనామాలు లేదా స్వచ్ఛంద పదవీ విరమణ ప్రక్రియలపై కేంద్రం కఠిన నిబంధనలను తీసుకొచ్చింది.
గగన్‌యాన్ మెగా ప్రాజెక్ట్‌కు ముప్పు రాకుండా బ్రేక్..
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. ఇస్రోలోని వివిధ కీలక కేంద్రాల నుంచి శాస్త్రవేత్తలు పెద్ద ఎత్తున తప్పుకుంటున్నట్లు నివేదికలు వచ్చాయి. దీనివల్ల దేశ ప్రతిష్టను పెంచే వ్యోమగాముల అంతరిక్ష మిషన్ గగన్‌యాన్‌తో పాటు ఇతర కీలక ప్రాజెక్టుల పురోగతిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. అందుకే జూలై 14న జారీ చేసిన కొత్త మెమోరాండం ప్రకారం.. గగన్‌యాన్ మరియు ఇతర ముఖ్యమైన జాతీయ ప్రాజెక్టులతో అనుసంధానమైన గ్రూప్ A సైంటిస్టులు, టెక్నికల్ స్టాఫ్ ఇచ్చే రాజీనామా లేఖలను ఇకపై మునుపటిలా సాధారణ పద్ధతిలో నేరుగా ఆమోదించకూడదని స్పష్టం చేసింది.
కొద్ది నెలల్లోనే వందకు పైగా శాస్త్రవేత్తలు అవుట్..
ఇస్రో నుండి ఎంతమంది ఉద్యోగులు తప్పుకున్నారనే దానిపై అంతరిక్ష శాఖ అధికారికంగా ఎలాంటి సంఖ్యను వెల్లడించనప్పటికీ, లోపలి వర్గాల సమాచారం ప్రకారం ఈ సంఖ్య షాకింగ్ కలిగిస్తోంది. గత కొన్ని నెలల్లోనే దాదాపు 100 నుంచి 120 మంది శాస్త్రవేత్తలు సంస్థను వీడినట్లు సమాచారం. వీరిలో అత్యధికంగా బెంగళూరులోని యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ నుంచి సుమారు 80 మంది శాస్త్రవేత్తలు, తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం నుంచి దాదాపు 20 మంది సైంటిస్టులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో నిపుణులు ఒకేసారి తప్పుకోవడం ఇస్రోకు పెద్ద దెబ్బగానే భావించవచ్చు.
ముఖ్యమైన మిషన్ల డైరెక్టర్లు కూడా గుడ్‌బై..
ఇస్రోను వీడుతున్న వారిలో కేవలం కింది స్థాయి ఉద్యోగులు మాత్రమే కాదు, కీలక మిషన్లను ముందుండి నడిపించిన సీనియర్ ప్రాజెక్ట్ డైరెక్టర్లు కూడా ఉండటం గమనార్హం. ఇస్రో ప్రయోగించిన అత్యంత బరువైన రాకెట్ LVM-3 ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన విక్టర్ జోసెఫ్ కూడా తన పదవికి రాజీనామా చేసినట్లు ఇస్రో వర్గాలు చెబుతున్నాయి. వీరితో పాటు ఇస్రో ప్రతిష్టాత్మక స్పేస్ డాకింగ్ ప్రయోగం SpaDeX మిషన్‌కు సంబంధించిన ప్రాజెక్ట్ డైరెక్టర్, అలాగే ప్రపంచం మెచ్చిన చంద్రయాన్-3 మిషన్‌లో కీలక పాత్ర పోషించిన పలువురు ప్రతిభావంతులైన యువ శాస్త్రవేత్తలు కూడా సంస్థను వీడినట్లు తెలుస్తోంది.
Motorola : ఫ్లిప్‌కార్ట్‌లో మోటరోలా ఎడ్జ్ 70పై భారీ ఆఫర్.. లాంచ్ ధర కంటే చాలా తక్కువకే సొంతం చేసుకోండి
సెంటర్ డైరెక్టర్ల పవర్స్ కట్..
ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రం సరికొత్త అడ్మినిస్ట్రేటివ్ మార్పులను తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఇస్రో పరిధిలోని వివిధ పరిశోధనా కేంద్రాల డైరెక్టర్లకే గ్రూప్ 'A' శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల రాజీనామాలను లేదా వీఆర్‌ఎస్ విజ్ఞప్తులను ఆమోదించే పూర్తి అధికారాలు ఉండేవి. కానీ తాజా రూల్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆ అధికారాలను వెనక్కి తీసుకుంది. ఇకపై ఎలాంటి రాజీనామాలు వచ్చినా సెంటర్ డైరెక్టర్లు నేరుగా నిర్ణయం తీసుకోకూడదు. వాటిని తమ సిఫార్సులతో కూడిన ఫైలు రూపంలో నేరుగా అంతరిక్ష శాఖ కేంద్ర కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. ఢిల్లీలోని ఉన్నతాధికారుల తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే సదరు ఉద్యోగిని రిలీవ్ చేస్తారు.
ఉద్యోగుల వలసలు ఇస్రోకు కొత్తేమీ కాదు..
ఈ వ్యవహారంపై ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ స్పందిస్తూ.. ఏ పెద్ద సంస్థలోనైనా ఉద్యోగులు రావడం, పోవడం చాలా సహజమైన విషయమేనని పేర్కొన్నారు. అయితే, కొత్త నిబంధనల ముఖ్య ఉద్దేశ్యం ఉద్యోగులను బలవంతంగా ఆపడం కాదని, దేశ ప్రతిష్టతో ముడిపడి ఉన్న జాతీయ ప్రాజెక్టుల పనులు అకస్మాత్తుగా ఆగిపోకుండా చూసుకోవడమేనని ఆయన స్పష్టం చేశారు. అధికారిక గణాంకాల ప్రకారం ఇస్రోలో శాస్త్రవేత్తల వలసలు కొత్తేమీ కాదు, 2012 నుండి 2024 మధ్య దాదాపు 700 మంది ఉద్యోగులు సంస్థను వీడారు. కాగా నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఇస్రో 2025-26 వార్షిక నివేదిక ప్రకారం సుమారు 1,050 సైంటిఫిక్, టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల భర్తీ ప్రక్రియను చివరి దశకు చేర్చింది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
IFA 2026: Lenovo Unveiled New IdeaPad, Yoga and ThinkBook Laptops
IFA 2026: Nvidia RTX Spark PCs, Local AI Tools Announced With October Launch Planned
Luna Band Now Available Globally: Check Price in India, Specifications and Features