Moto Pad 70 Groove set to Launch: జూలై 31న భారత్‌లోకి మోటో ప్యాడ్ 70 గ్రూవ్ ఎంట్రీ.. ఫీచర్లు మామూలుగా లేవుగా..!

Moto Pad 70 Groove set to Launch on July 31 in India: మోటో ప్యాడ్ 70 గ్రూవ్ టాబ్లెట్ 12.1 ఇంచుల 2.5K డిస్ప్లేతో వస్తోంది. మోటో ప్యాడ్ 70 గ్రూవ్ పేరుతో రూపుదిద్దుకున్న ఈ టాబ్లెట్ జూలై 31న దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదల కానుంది

Moto Pad 70 Groove set to Launch: జూలై 31న భారత్‌లోకి మోటో ప్యాడ్ 70 గ్రూవ్ ఎంట్రీ.. ఫీచర్లు మామూలుగా లేవుగా..!

Motorola

ముఖ్యాంశాలు
  • జూలై 31న భారత్‌లోకి మోటో ప్యాడ్ 70 గ్రూవ్ ఎంట్రీ
  • 9 JBL స్పీకర్లు, 10200mAh బ్యాటరీతో మోటో కొత్త టాబ్లెట్
  • మోటోరోలా నుంచి మైండ్ బ్లోయింగ్ టాబ్లెట్
ప్రకటన

Moto Pad 70 Groove Set to Launch on July 31 in India: ప్రసిద్ధ స్మార్ట్‌ఫోన్, గాడ్జెట్స్ తయారీ సంస్థ మోటోరోలా భారతీయ మార్కెట్లోకి ఒక సరికొత్త టాబ్లెట్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. మోటో ప్యాడ్ 70 గ్రూవ్ పేరుతో రూపుదిద్దుకున్న ఈ టాబ్లెట్ జూలై 31న దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదల కానుంది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో దీని కోసం ప్రత్యేక మైక్రోసైట్ కూడా అందుబాటులోకి వచ్చింది. గత నెలలోనే లాంచ్ అయిన మోటో ప్యాడ్ 70 సిరీస్ విజయం తర్వాత, ఇప్పుడు మెరుగైన ఆడియో, డిస్ప్లే ఫీచర్లతో ఈ కొత్త మోడల్‌ను పరిచయం చేస్తున్నారు.

అద్భుతమైన డిస్ప్లే, డిజైన్..

మోటో ప్యాడ్ 70 గ్రూవ్ టాబ్లెట్ 12.1 ఇంచుల 2.5K డిస్ప్లేతో వస్తోంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ సపోర్ట్, 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. దీనివల్ల ప్రకాశవంతమైన వెలుతురులోనూ కంటెంట్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక డిజైన్ విషయానికి వస్తే.. టాబ్లెట్ వెనుక వైపు మధ్యలో JBL బ్రాండింగ్‌తో కూడిన వృత్తాకార మెష్ గ్రిల్ ఉంది. అంతేకాకుండా, ఇందులో ఇన్-బిల్ట్ ఫోల్డ్-అవుట్ స్టాండ్ ఉంది. దీని సహాయంతో పోర్ట్రెయిట్, ల్యాండ్‌స్కేప్, స్టాండ్, హ్యాంగింగ్, థియేటర్ మోడ్‌లలో టాబ్లెట్‌ను చాలా సులువుగా అమర్చుకోవచ్చు. బ్యాక్ ప్యానెల్‌పైనే వాల్యూమ్ బటన్‌లను అందించడం ఈ టాబ్లెట్ ప్రత్యేకత.

9 స్పీకర్లతో ధియేటర్ లాంటి సౌండ్..

మోటో ప్యాడ్ 70 గ్రూవ్ టాబ్లెట్ ప్రధాన ఆకర్షణ దీని ఆడియో సిస్టమ్. ఇందులో ఏకంగా తొమ్మిది స్పీకర్లు ఉన్న JBL ఆడియో సిస్టమ్‌ను మోటోరోలా అమర్చింది. వీటిలో నాలుగు ట్వీటర్లు, మూడు వూఫర్లు, రెండు ప్యాసివ్ రేడియేటర్లు ఉన్నాయి. 43 cc అకౌస్టిక్ ఛాంబర్, డాల్బీ అట్మోస్ ట్యూనింగ్, హై-రెస్ ఆడియో వైర్‌లెస్ సర్టిఫికేషన్‌తో వచ్చే ఈ ఆడియో సెటప్ గరిష్టంగా 48 W అవుట్‌పుట్‌ను ఇస్తుంది. అంటే సినిమా లేదా పాటలు వినేటప్పుడు హాలులోనే థియేటర్ అనుభూతి లభిస్తుంది.

iPhone 15 : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 పై భారీ ఆఫర్.. ఏకంగా రూ.26,000 పైగా డిస్కౌంట్

భారీ బ్యాటరీ, ప్రో మోడల్ ఫీచర్లు..

పవర్ బ్యాకప్ కోసం ఇందులో 10,200 mAh భారీ బ్యాటరీని అందించారు. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే వరుసగా 15 గంటల పాటు వీడియోలు ప్లే చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. ఇకపోతే, గత నెలలో విడుదలైన 'మోటో ప్యాడ్ 70 ప్రో' మోడల్ చూస్తే.. అందులో 13 ఇంచుల 3.5K LCD స్క్రీన్ (144Hz రిఫ్రెష్ రేట్), ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో UI వంటి అగ్రశ్రేణి ఫీచర్లు ఉన్నాయి. ప్రో మోడల్‌లో 13MP రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాతో పాటు మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2 TB వరకు పెంచుకునే సదుపాయం ఉంది. కొత్త మోటో ప్యాడ్ 70 గ్రూవ్  కెమెరా, ప్రాసెసర్ వివరాలు లాంచ్‌కు ముందే వెల్లడయ్యే అవకాశముంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »