Get iPhone 15 @Rs. 53,105: ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 పై భారీ ఆఫర్.. ఏకంగా రూ.26,000 పైగా డిస్కౌంట్

Buy iPhone 15 @Rs. 53,105 in Flipkart: ఈ సేల్‌లో ఐఫోన్ 15 (128GB వేరియంట్) నేరుగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ.58,900 కి అందుబాటులో ఉంది

Get iPhone 15 @Rs. 53,105: ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 పై భారీ ఆఫర్.. ఏకంగా రూ.26,000 పైగా డిస్కౌంట్

Photo Credit: Apple

iPhone 15

ముఖ్యాంశాలు
  • కొత్త ఐఫోన్ కొనేందుకు ఇదే మంచి సమయం
  • ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 53,105 కే ఐఫోన్ 15
  • క్రెడిట్ కార్డ్ ఉంటే చాలు, ఐఫోన్ 15 మీ పాకెట్‌లోకి
ప్రకటన

Get iPhone 15 @Rs. 53,105 in Flipkart: ఐఫోన్ లవర్స్‎కు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్  అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. మీరు కొత్త ఐఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే ఐఫోన్ 15 మీకు అత్యుత్తమ ప్రత్యామ్నాయంగా నిలవనుంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌పై భారీ ధరకు కోత విధించడంతో పాటు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను అందిస్తున్నారు. సెప్టెంబర్ 2023లో రూ.79,900 ప్రారంభ ధరతో లాంచ్ అయిన ఈ ప్రీమియం హ్యాండ్‌సెట్‌ను ఇప్పుడు చాలా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.  

ఆఫర్లు, ధర వివరాలు..

ఈ సేల్‌లో ఐఫోన్ 15 (128GB వేరియంట్) నేరుగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ.58,900 కి అందుబాటులో ఉంది. దీనికి తోడు బ్యాంక్ ఆఫర్ల ద్వారా మరింత పొదుపు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో కొనుగోలు చేస్తే రూ. 5,795 వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ వర్తించిన తర్వాత ఐఫోన్ 15 ఎఫెక్టివ్ ధర కేవలం రూ.53,105 అవుతుంది. అంటే లాంచ్ ధరతో పోలిస్తే కస్టమర్లకు దాదాపు రూ.26,795 వరకు తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ.46,150 వరకు అధనపు ఆదా పొందే అవకాశం ఉంది.  

డిస్ప్లే, ప్రాసెసర్ పవర్..

ఐఫోన్ 15 లో 6.1 ఇంచుల సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే ఇవ్వబడింది. ఇది 1179x2556 పిక్సెల్స్ రెసొల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ వరకు అవుట్‌డోర్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఫోన్ అత్యంత వేగవంతమైన Apple A16 Bionic ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు గట్టి పోటీనిస్తూ మల్టీటాస్కింగ్, గేమింగ్ అనుభవాన్ని సులువు చేస్తుంది. ఈ ఫోన్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. నీరు, ధూళి నుంచి రక్షణ కోసం IP68 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది. ఫోన్ బరువు 171 గ్రాములు కాగా చాలా తేలికగా, చేతిలో పట్టుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది.  

Smartphone Comparison : మార్కెట్లోకి రియల్‌మీ C100x లాంచ్.. రెడ్‌మీ, శామ్‌సంగ్ బడ్జెట్ ఫోన్లకు గట్టి పోటీ

కెమెరా, కనెక్టివిటీ ఫీచర్లు..

ఐఫోన్ 15 ఫోటోగ్రఫీ విషయానికి వస్తే ఐఫోన్ 15లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలదు. ఇందులో f/1.6 అపర్చర్‌తో కూడిన 48 మెగాపిక్సెల్ ప్రైమరీ వైడ్ యాంగిల్ కెమెరా, మరియు f/1.6 అపర్చర్‌తో కూడిన 12 మెగాపిక్సెల్ ఆల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. 48MP కెమెరా ద్వారా కస్టమర్లు అత్యంత స్పష్టమైన, డిఎస్ఎల్ఆర్ స్థాయి ఫోటోలను తీయవచ్చు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12 మెగాపిక్సెల్ ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరాను అందించారు. కనెక్టివిటీ పరంగా 5G, GPS, NFC, బ్లూటూత్, వై-ఫై, టైప్-సి కనెక్టివిటీ పోర్ట్ వసతులు ఉన్నాయి.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »