Motorola Edge 70 Max Launch: మోటరోలా ఎడ్జ్ 70 మాక్స్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8GB రామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.54,999 కాగా, 12GB రామ్ + 256GB స్టోరేజ్ టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.59,999గా నిర్ణయించారు
Photo Credit: Motorola
Motorola Edge 70 Max
Motorola Edge 70 Max launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటరోలా భారతీయ వినియోగదారుల కోసం సరికొత్త ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. మోస్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్లు, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో మోటరోలా ఎడ్జ్ 70 మాక్స్ మోడల్‌ను అఫీషియల్‌గా లాంచ్ చేసింది. ఈ ఫోన్ అత్యంత ప్రధానమైన హైలైట్ ఏంటంటే.. ఇందులో ఏకంగా 7,100mAh బ్యాటరీని అమర్చారు. ఇంత భారీ కెపాసిటీ ఉన్నప్పటికీ, ఫోన్ వేగంగా చార్జ్ అవ్వడానికి 90W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. దీనితో పాటు సరికొత్త 25W Qi2 మాగ్నెటిక్ వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. ఒకసారి చార్జ్ చేస్తే హెవీగా వాడినా రెండు రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది.
ధరల విషయానికి వస్తే.. మోటరోలా ఎడ్జ్ 70 మాక్స్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8GB రామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.54,999 కాగా, 12GB రామ్ + 256GB స్టోరేజ్ టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.59,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ సేల్స్ జూలై 20 నుంచి మోటరోలా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, ప్రముఖ రిటెయిల్ స్టోర్లలో ప్రారంభం కానున్నాయి. లాంచ్ ఆఫర్ కింద కస్టమర్లకు రూ.5,000 బ్యాంక్ డిస్కౌంట్ లేదా రూ.5,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. దీనితో పాటు 18 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఆఫర్ల తర్వాత ఈ ఫోన్లను వరుసగా రూ.49,999, రూ.54,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ పాంటోన్ ఆక్వా గ్రే, పాంటోన్ డార్క్ షాడో, పాంటోన్ ఐస్ మెల్ట్ అనే మూడు అదిరిపోయే కలర్లలో లభిస్తుంది.
ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనేవారి కోసం రిలయన్స్ జియో ఒక అదిరిపోయే ఎక్స్‌క్లూజివ్ ఆఫర్‌ను అనౌన్స్ చేసింది. ఎవరైతే జియో సిమ్ వాడుతూ, రూ.349 లేదా అంతకంటే ఎక్కువ విలువైన 5జీ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటారో.. వారికి ఏకంగా 18 నెలల పాటు గూగుల్ జెమిని ప్రో అడ్వాన్స్డ్ AI, 5000GB జియో AI క్లౌడ్ స్టోరేజ్ పూర్తిగా ఉచితంగా లభిస్తాయి. దీనితో పాటు కేవలం నెలకి రూ.200 చెల్లిస్తే చాలు.. మొబైల్ లోనే 15కి పైగా ప్రీమియం ఓటీటీ యాప్స్, 1000కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లను చూసేందుకు వీలుగా Jio OTT Pass కూడా లభిస్తుంది.
డిస్‌ప్లే మరియు పర్ఫార్మెన్స్ పరంగా ఈ ఫోన్ ఇండస్ట్రీలోనే సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేయనుంది. ఇందులో 6.8 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ+ 2K ఎక్స్‌ట్రీమ్ అమోలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, స్మార్ట్‌ఫోన్ల చరిత్రలోనే అత్యధికంగా 7000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. అందువల్ల ఎండలో కూడా స్క్రీన్ విపరీతమైన క్లారిటీతో కనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ కోసం క్వాల్‌కామ్ సంస్థకు చెందిన అత్యంత లేటెస్ట్, పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌ను వాడారు. సాఫ్ట్‌వేర్ పరంగా ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో యూఎక్స్ పై రన్ అవుతుంది.
Xiaomi : స్మార్ట్‌ఫోన్ యూజర్లకు షియోమీ బంపర్ ఆఫర్.. తక్కువ ధరలోనే 20000mAh మెగా పవర్‌బ్యాంక్ లాంచ్
మోటరోలా ఎడ్జ్ 70 మాక్స్ స్మార్ట్‌ఫోన్ లో మోటరోలా తన సరికొత్త క్రాస్-డివైస్ AI టెక్నాలజీ మోటరోలా ఖిరాని పరిచయం చేసింది. దీని సహాయంతో మోటరోలా స్మార్ట్‌ఫోన్, లెనోవో పీసీ, టాబ్లెట్లను చాలా సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక డివైస్ లో చేసిన పనిని లేదా కాంటెక్స్ట్‌ను గుర్తుంచుకుని, మరో డివైస్ లో ఆ పనిని కంటిన్యూ చేసేలా స్మార్ట్ సపోర్ట్ ఇస్తుంది. ఇందులో ఉండే చాట్ మోడ్, నెక్స్ట్ మూవ్, క్రియేటర్ జోన్, పే అటెన్షన్, క్యాచ్ మీ అప్ వంటి ఫీచర్లు మీ ఆఫీస్ మీటింగ్స్ సమ్మరీ తయారు చేయడానికి, కంటెంట్ క్రియేట్ చేయడానికి ఎంతో ఉపయోగపడతాయి.
కెమెరా విభాగం విషయానికి వస్తే.. ఫోన్ వెనుక వైపు OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను, అలాగే 8 మెగాపిక్సెల్ ఆల్ట్రా వైడ్ కమ్ మ్యాక్రో కెమెరాను అమర్చారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ పవర్‌ఫుల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఫోటోలలో రియల్ కలర్స్, స్కిన్ టోన్స్ వచ్చేలా దీనికి పాంటోన్ వ్యాలిడేషన్ సర్టిఫికేషన్ ఇచ్చారు. దీనితో పాటు ఫ్రేమ్ మ్యాచ్, హోరైజన్ లాక్ వంటి AI కెమెరా ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ఎంత రఫ్ గా వాడినా పాడవకుండా ఉండేందుకు MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఇచ్చారు. అంతేకాదు నీటిలో పడినా పాడవకుండా ఉండేలా IP69, IP68, IP66 లాంటి ట్రిపుల్ ప్రొటెక్షన్ రేటింగ్‌ను దీనికి అందించారు. వై-ఫై 7, బ్లూటూత్ 6.0, ఎన్‌ఎఫ్‌సీ, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి అన్ని ప్రీమియం కనెక్టివిటీ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
iPhone 18 Pro Series’ A20 Pro Chipset Appears on Multiple Benchmarking Platforms Showing Performance Gains