Mega Premium Flagship Fight: మొబైల్ మార్కెట్లో అసలైన యుద్ధం.. మోటోరోలా ఎడ్జ్ 70 మాక్స్ Vs శాంసంగ్ గెలాక్సీ A57 వర్సెస్ వన్‌ప్లస్ 15R

Motorola Edge 70 Max Vs Samsung Galaxy A57 Vs OnePlus 15R: సరికొత్త మోటోరోలా ఎడ్జ్ 70 మాక్స్ 8GB+256GB బేస్ వేరియంట్ ధర రూ.54,999గా ఉండగా, హై-ఎండ్ 12GB+256GB వేరియంట్ ధర రూ.59,999గా నిర్ణయించబడింది

Mega Premium Flagship Fight: మొబైల్ మార్కెట్లో అసలైన యుద్ధం.. మోటోరోలా ఎడ్జ్ 70 మాక్స్ Vs శాంసంగ్ గెలాక్సీ A57 వర్సెస్ వన్‌ప్లస్ 15R

Photo Credit: Motorola/Samsung/OnePlus

Motorola Edge 70 Max vs Samsung Galaxy A57 5G vs OnePlus 15R

ముఖ్యాంశాలు
  • మొబైల్ మార్కెట్లో అసలైన యుద్ధం
  • 7000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో మోటోరోలా సరికొత్త రికార్డు
  • సరికొత్త సాఫ్ట్‌వేర్ ఫీచర్లతో యూజర్ ఇంటర్‌ఫేస్ మ్యాజిక్
ప్రకటన

Motorola Edge 70 Max Vs Samsung Galaxy A57 Vs OnePlus 15R: భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రీమియం సెగ్మెంట్‌లో పోటీ మరింత వేడెక్కింది. ప్రముఖ మొబైల్ బ్రాండ్ మోటోరోలా తన సరికొత్త పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్  మోటోరోలా ఎడ్జ్ 70 మాక్స్‎ను లాంచ్ చేసింది. మార్కెట్లో ఈ ఫోన్.. ఇప్పటికే మార్కెట్లో భారీ అంచనాలు ఉన్న శాంసంగ్ గెలాక్సీ A57 5G, వన్‌ప్లస్ 15R మొబైళ్లకు నేరుగా సవాలు విసురుతోంది. ప్రీమియం ఫీచర్లను ఇష్టపడే యూజర్లు ఈ మూడింటిలో ఏ ఫోన్ కొనుగోలు చేయాలో తెలియక గందరగోళంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ మూడు ఫోన్ల ధరలు, ఫీచర్లు, స్పెసిఫికేషన్ల పూర్తి పోలికలను తెలుసుకుందాం..

ఏ ఫోన్ ధర ఎంత..?

ముందుగా ధరల విషయానికి వస్తే.. సరికొత్త మోటోరోలా ఎడ్జ్ 70 మాక్స్ 8GB+256GB బేస్ వేరియంట్ ధర రూ.54,999గా ఉండగా, హై-ఎండ్ 12GB+256GB వేరియంట్ ధర రూ.59,999గా నిర్ణయించబడింది. దీనికి పోటీగా ఉన్న శాంసంగ్ గెలాక్సీ A57 5G మోడల్ 8GB+256GB వేరియంట్ రూ.53,999, 12GB+256GB వేరియంట్ రూ.57,999 ధరకు లభిస్తోంది. ఇక మూడవ ఫోన్ వన్‌ప్లస్ 15R విషయానికి వస్తే.. ఇందులో కేవలం ఒకే ఒక ప్రీమియం వేరియంట్ 12GB+256GB మాత్రమే అందుబాటులో ఉంది, దీని ధర రూ.59,999 గా ఉంది. బడ్జెట్ పరంగా చూస్తే శాంసంగ్ కొద్దిగా తక్కువ ధరకే లభిస్తుండగా, మోటో, వన్‌ప్లస్ ఒకే ప్రైస్ రేంజ్‌లో పోటీ పడుతున్నాయి.

డిస్‌ప్లేల మధ్య అసలైన పోటీ..

డిస్‌ప్లే విభాగంలో మోటోరోలా ఎడ్జ్ 70 మాక్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇందులో 6.8 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ+ 2K ఎక్స్‌ట్రీమ్ అమోలెడ్ స్క్రీన్ ఇచ్చారు, ఇది 144Hz రిఫ్రెష్ రేట్, ఏకంగా 7000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఎండలో కూడా ఈ స్క్రీన్ అద్భుతంగా కనిపిస్తుంది. మరోవైపు శాంసంగ్ గెలాక్సీ A57 5G లో 6.7 ఇంచుల FHD+ సూపర్ అమోలెడ్+ స్క్రీన్ (120Hz రిఫ్రెష్ రేట్) ఉంది. ఇక వన్‌ప్లస్ 15R మొబైల్ 6.83 ఇంచుల 1.5K అమోలెడ్ స్క్రీన్‌తో వస్తుంది, ఇది 165Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. స్మూత్‌నెస్ పరంగా వన్‌ప్లస్ బాగున్నా, క్లారిటీ, బ్రైట్‌నెస్ పరంగా మోటోరోలా చాలా ముందుంది.

మోటో, వన్‌ప్లస్‌లలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 హల్‌చల్..

గేమింగ్, మల్టీటాస్కింగ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మోటోరోలా ఎడ్జ్ 70 మాక్స్, వన్‌ప్లస్ 15R స్మార్ట్‌ఫోన్లు రెండూ కూడా సరికొత్త, అత్యంత వేగవంతమైన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. దీనివల్ల హెవీ గ్రాఫిక్స్ గేమ్‌లు ఆడినా ఫోన్ అస్సలు లాగ్ అవ్వదు. కానీ, శాంసంగ్ గెలాక్సీ A57 5G లో మాత్రం కంపెనీ తన సొంత ఆక్టా-కోర్ ఎక్సినోస్ 1680 ప్రాసెసర్‌ను ఉపయోగించింది. పర్ఫార్మెన్స్ స్పీడ్ పరంగా శాంసంగ్ కంటే మోటో, వన్‌ప్లస్ ఫోన్లు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయని చెప్పొచ్చు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్..

సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే ఈ మూడు స్మార్ట్‌ఫోన్లు లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌ ఆధారంగానే పనిచేస్తాయి. అయితే వాటి బ్రాండ్స్ కి తగినట్లుగా కస్టమ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌లు వేర్వేరుగా ఉన్నాయి. మోటోరోలా ఫోన్ సరికొత్త హెల్లో యూఎక్స్‎తో వస్తుండగా, శాంసంగ్ మొబైల్ తన పాపులర్ వన్ యూఐ 8.5 పై రన్ అవుతుంది. ఇక వన్‌ప్లస్ 15R క్లీన్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే ఆక్సిజన్ ఓఎస్ 16తో పనిచేస్తుంది. మూడు ఫోన్లలోనూ లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ ఫీచర్లు, సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయి.

మారథాన్ బ్యాటరీ లైఫ్..

బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఈసారి కంపెనీలు ఊహించని రేంజ్‌లో బ్యాటరీ సైజులను పెంచేశాయి. వన్‌ప్లస్ 15R ఏకంగా 7400mAh భారీ మారథాన్ బ్యాటరీతో వస్తుంది, ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనికి గట్టి పోటీ ఇస్తూ మోటోరోలా ఎడ్జ్ 70 మాక్స్ లో 7100mAh బ్యాటరీని ఇచ్చారు, ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు అదనంగా 25W Qi2 మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో రావడం విశేషం. ఈ రెండింటితో పోలిస్తే శాంసంగ్ గెలాక్సీ A57 5G కేవలం 5000mAh బ్యాటరీతో చాలా వెనుకబడి పోయింది.

Nvidia GeForce : గేమర్లకు బంపర్ ఆఫర్.. ఎన్విడియా నుంచి మోస్ట్ అవేటెడ్ జీఫోర్స్ నౌ క్లౌడ్ గేమింగ్ లాంచ్

ఫోటోగ్రఫీ ప్రియుల కోసం బెస్ట్ కెమెరా సెటప్..

కెమెరాల విషయానికి వస్తే.. మోటోరోలా ఎడ్జ్ 70 మాక్స్ వెనుక వైపు f/1.8 అపెర్చర్, OIS సపోర్టుతో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ ప్లస్ మ్యాక్రో కెమెరాను కలిగి ఉంది. వన్‌ప్లస్ 15R లో కూడా OIS సపోర్టుతో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. కానీ శాంసంగ్ గెలాక్సీ A57 5G లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో 50MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్, 5MP మ్యాక్రో కెమెరాలు ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం మోటో, వన్‌ప్లస్‌లలో 32 మెగాపిక్సెల్ కెమెరాలు ఉండగా, శాంసంగ్‌లో కేవలం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా మాత్రమే ఉంది.

నెక్స్ట్ లెవెల్ కనెక్టివిటీ ఆప్షన్లు..

కనెక్టివిటీ ఆప్షన్ల పరంగా చూస్తే మూడు ఫోన్లు కూడా చాలా మోడరన్‌గా ఉన్నాయి. మోటోరోలా ఎడ్జ్ 70 మాక్స్ లో డ్యూయల్ సిమ్ 5G, వై-ఫై 7, బ్లూటూత్ 6.0, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్,  యూఎస్‌బీ టైప్-సి 2.0 పోర్ట్ ఉన్నాయి. వన్‌ప్లస్ 15R లో కూడా వై-ఫై 7, బ్లూటూత్ 6.0, ఎన్‌ఎఫ్‌సీ, 5G  డ్యూయల్ 4G VoLTE సపోర్ట్ ఇచ్చారు. శాంసంగ్ గెలాక్సీ A57 5G లో 5G, సాధారణ వై-ఫై, బ్లూటూత్ 6.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌లు ఉన్నాయి. ఓవరాల్‌గా చూస్తే భారీ బ్యాటరీ, వైర్‌లెస్ ఛార్జింగ్, అల్ట్రా బ్రైట్ డిస్‌ప్లే కావాలనుకునే వారికి మోటోరోలా బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »