Oppo Find X10 Pro Max Leaks: ఈ సరికొత్త సిరీస్ కింద బేస్ మోడల్‌తో పాటు Oppo Find X10 Pro, Oppo Find X10 Pro Max అనే మూడు ప్రీమియం మోడళ్లను కంపెనీ పరిచయం చేయనుంది.
Oppo Find X9 Ultra
Oppo Find X10 Pro Max Leaks: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో మొబైల్ రంగంలో సరికొత్త సంచలనానికి తెరలేపబోతోంది. తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫ్లాగ్‌షిప్ లైనప్‌లో ఒప్పో ఫైండ్ X10 సిరీస్‌ను రాబోయే కొన్ని నెలల్లో అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సరికొత్త సిరీస్ కింద బేస్ మోడల్‌తో పాటు Oppo Find X10 Pro, Oppo Find X10 Pro Max అనే మూడు ప్రీమియం మోడళ్లను కంపెనీ పరిచయం చేయనుంది. వీటిలో అన్నింటికంటే హై-ఎండ్ మోడల్ అయిన ఒప్పో ఫైండ్ X10 ప్రో మాక్స్ ఈ ఏడాదిలోనే కంపెనీ విడుదల చేయబోయే మోస్ట్ పవర్‌ఫుల్, అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌గా నిలవనుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఏకంగా 200ఎంపీతో మూడు వెనుక కెమెరాలు
ప్రముఖ చైనీస్ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ చైనీస్ మైక్రోబ్లాగింగ్ సైట్ వీబోలో పోస్ట్ చేసిన వివరాల ప్రకారం.. ఒప్పో ఫైండ్ X10 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్ కెమెరా విభాగంలో ఊహించని రీతిలో భారీ అప్‌గ్రేడ్స్ పొందబోతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ ఫోన్ ఇంజనీరింగ్ ప్రోటోటైప్‌ను ఏకంగా మూడు 200 మెగాపిక్సెల్ వెనుక కెమెరాలతో టెస్ట్ చేస్తున్నారు. అంటే దీని వెనుక భాగంలో 200ఎంపీ ప్రైమరీ కెమెరా, 200ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 200ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలను అమర్చబోతున్నారు. స్మార్ట్‌ఫోన్ హిస్టరీలోనే ఇలా మూడు కెమెరాలు కూడా 200 మెగాపిక్సెల్స్‌తో రావడం ఇదే మొదటిసారి కానుంది. ఇంకా కలర్ అక్యూరెసీని మెరుగుపరచడానికి 3ఎంపీ మల్టీస్పెక్ట్రల్ కెమెరాను, అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో 50ఎంపీ కెమెరాను ఇవ్వనున్నారు.
మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రో చిప్‌సెట్
పర్ఫార్మెన్స్, డిస్‌ప్లే విషయానికొస్తే ఒప్పో ఈ ఫోన్ లో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ఇందులో 144Hz హై-రిఫ్రెష్ రేట్ కలిగిన 6.89 ఇంచుల 2K LTPO ఫ్లాట్ డిస్‌ప్లేను అందించనున్నారు. ఈ స్క్రీన్ చుట్టూ ఉండే బెజెల్స్ చాలా సన్నగా ఉండి ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. ఈ స్మార్ట్‌ఫోన్ లో మీడియాటెక్ కంపెనీకి చెందిన సరికొత్త పవర్‌ఫుల్ MediaTek Dimensity 9600 Pro ప్రాసెసర్‌ను ఉపయోగించబోతున్నారు. సాఫ్ట్‌వేర్ పరంగా, ఈ మొబైల్ సరికొత్త ఆండ్రాయిడ్ 17 ఆధారిత కలర్ ఓఎస్ 17 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ కానుంది.
iQOO : స్టూడెంట్స్ కోసం ఐకూ సరికొత్త ప్లాన్.. జూలై 24న మార్కెట్లోకి iQOO Z11 Lite ఎంట్రీ
బ్యాటరీలోనూ సరికొత్త రికార్డు
కెమెరా, ప్రాసెసర్‌తో పాటు బ్యాటరీ కెపాసిటీని కూడా ఒప్పో నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తోంది. రాబోయే ఒప్పో ఫైండ్ X10 సిరీస్ స్మార్ట్‌ఫోన్లలో ఏకంగా 8,000mAh రేంజ్‌లో భారీ మెగా బ్యాటరీలను అమర్చబోతున్నట్లు లీక్స్ ద్వారా వెల్లడైంది. గత ఏడాది చైనా మార్కెట్లో విడుదలైన ఒప్పో ఫైండ్ X9 సిరీస్‌తో పోలిస్తే ఇది చాలా పెద్ద అప్‌గ్రేడ్ అని చెప్పాలి. ఈ భారీ బ్యాటరీ వల్ల చార్జింగ్ టెన్షన్ లేకుండా యూజర్లు రెండు నుంచి మూడు రోజుల పాటు నాన్-స్టాప్‌గా ఫోన్‌ను వాడుకోవచ్చు. అయితే దీని ఫాస్ట్ చార్జింగ్ వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
భారత్‌లో రీసెంట్‌గా విడుదలైన Oppo Find X9 Ultra ఫీచర్లు ఇవే..
ఇదిలా ఉంటే, ఒప్పో ఇటీవలే భారత మార్కెట్లో Oppo Find X9 Ultra, Oppo Find X9s ఫోన్లను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. వీటిలో టాప్ మోడల్ అయిన ఫైండ్ X9 అల్ట్రా ఫీచర్లను పరిశీలిస్తే.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగిన 6.82 ఇంచుల QHD+ ఫ్లెక్సిబుల్ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 16 బేస్డ్ కలర్ ఓఎస్ 16 పై నడిచే ఈ ఫోన్ లో పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌ను వాడారు. దీని వెనుక 200MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్, 200MP టెలిఫోటో, 50MP అల్ట్రా-టెలిఫోటోలతో కూడిన క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. అలాగే ఇందులో 100W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50W వైర్‌లెస్ చార్జింగ్‌ను సపోర్ట్ చేసే 7,050mAh బ్యాటరీని అందించారు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Google Play Store ‘Shop Devices’ Feature Goes Live in India With Pixel Phones and Accessories