Realme C100X set to launch in India: ఈ వారమే లాంచ్ కానున్న రియల్‌మి కొత్త ఫోన్.. లాండింగ్ పేజీతో డేట్ కన్ఫర్మ్ చేసిన ఫ్లిప్‌కార్ట్

Realme C100X Set to Launch in India: ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ కోసం ఒక ప్రత్యేకమైన ల్యాండింగ్ పేజీని లైవ్ చేసింది.

Realme C100X set to launch in India: ఈ వారమే లాంచ్ కానున్న రియల్‌మి కొత్త ఫోన్.. లాండింగ్ పేజీతో డేట్ కన్ఫర్మ్ చేసిన ఫ్లిప్‌కార్ట్

Photo Credit: Realme

Realme C100x

ముఖ్యాంశాలు
  • భారత మార్కెట్లోకి రియల్‌మి సరికొత్త సంచలనం
  • ఈ వారమే లాంచ్ కానున్న రియల్‌మి కొత్త ఫోన్
  • సింగిల్ ఛార్జ్‌తో 17 గంటల నావిగేషన్
ప్రకటన

Realme C100X set to Launch in India: ప్రముఖ చైనా మొబైల్ బ్రాండ్ రియల్‌మి భారతీయ కస్టమర్ల కోసం మరో పవర్‌ఫుల్ బడ్జెట్ అండ్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. ఈ వారం భారత్‌లో లాంచ్ కాబోతున్న Realme C100x మోడల్ మొబైల్ ప్రియులలో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఈ ఫోన్ ప్రధానంగా లాంగ్ బ్యాటరీ లైఫ్ కోరుకునే వారిని టార్గెట్ చేస్తూ వస్తోంది. ఇందులో కంపెనీ ఏకంగా 8,000 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చడం విశేషం. ఈ భారీ బ్యాటరీకి తోడుగా 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటంతో, ఫోన్ చాలా వేగంగా ఛార్జ్ అవుతుందని కంపెనీ స్పష్టం చేస్తోంది.

ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్  ఇప్పటికే ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ కోసం ఒక ప్రత్యేకమైన ల్యాండింగ్ పేజీని  లైవ్ చేసింది. దీని ప్రకారం ఈ ఫోన్ జూలై 16న అధికారికంగా భారత మార్కెట్లో విడుదల కానుంది. లుక్ పరంగా ఈ ఫోన్ చాలా స్టైలిష్‌గా ఉండబోతోంది. కస్టమర్ల కోసం ఇది గోల్డెన్ కోస్ట్, డీప్‌బ్లూ టైడ్స్ వంటి రెండు అద్భుతమైన కలర్ ఆప్షన్లలో లభించనుంది. ఈ ఫోన్ డిస్‌ప్లే సైజ్ 6.8 ఇంచులుగా ఉండనుండగా, స్మూత్ బ్రౌజింగ్, గేమింగ్ అనుభూతి కోసం ఇందులో 120 Hz రిఫ్రెష్ రేట్‌ను కూడా అందించారు.

ధర విషయానికి వస్తే.. ప్రముఖ టెక్ టిప్‌స్టర్ ఎక్స్‌పర్ట్‌పిక్ ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన రిటైల్ బాక్స్ ఇమేజ్‌ను ఆన్‌లైన్ లో లీక్ చేసింది. ఆ లీకైన సమాచారం ప్రకారం భారత్‌లో ఈ ఫోన్ గరిష్ట రిటైల్ ధర రూ.29,999గా ఉండవచ్చని తెలుస్తోంది. అయితే సాధారణంగా కంపెనీలు బాక్స్ పై ఉన్న ఎంఆర్‌పీ కంటే తక్కువ ధరకే ఫోన్లను లాంచ్ చేస్తుంటాయి. కాబట్టి అసలు ధరలో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఇప్పటికే ఇండోనేషియా మార్కెట్లో విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకుంది. అక్కడ అందించిన స్పెసిఫికేషన్ల ప్రకారం.. ఇందులో Unisoc T7250 ప్రాసెసర్‌తో పాటు గ్రాఫిక్స్ కోసం Arm Mali-G57 GPUని జత చేశారు.

BSNL : బీఎస్ఎన్ఎల్ దూకుడు.. తొలి త్రైమాసికంలో 10 శాతం పెరిగిన కంపెనీ ఆదాయం

ట్రావెలింగ్ ఎక్కువగా చేసేవారికి ఈ ఫోన్ ఒక వరం లాంటిదని చెప్పవచ్చు. ఎందుకంటే దీనిలోని 8,000 mAh బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఏకంగా 17 గంటలకు పైగా నిరంతరాయంగా నావిగేషన్ వాడుకోవచ్చని కంపెనీ గట్టిగా క్లెయిమ్ చేస్తోంది. కెమెరా విభాగం చూస్తే.. దీని వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను ఇచ్చారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికి ముందు వైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. సేఫ్టీ కోసం ఫోన్ పక్కభాగంలో ఫాస్ట్ రెస్పాన్స్ ఇచ్చే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కూడా అందించారు.

రియల్‌మి కంపెనీ ఇటీవల కాలంలోనే భారత మార్కెట్లో తన పవర్‌ఫుల్ మోడల్ Realme 16T 5G ని కూడా లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ లో 6.8 ఇంచుల ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇచ్చారు, ఇది ఏకంగా 144 Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో వస్తుంది. పర్ఫార్మెన్స్ కోసం ఇందులో MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌ను వాడారు. విశేషమేమిటంటే, ఈ ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆధారిత Realme UI 7 సాఫ్ట్‌వేర్ పై రన్ అవుతుంది. దీని వెనుక వైపు 50 MP ప్రైమరీ కెమెరాతో పాటు 2 MP మోనోక్రోమ్ కెమెరా ఉంది. సెల్ఫీల కోసం 16 MP ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఇందులో కూడా 8,000 mAh భారీ బ్యాటరీతో పాటు 45W సూపర్‌వూక్  ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ఉండటం విశేషం.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »