Realme Narzo 100X 5G: 144Hz రిఫ్రెష్ రేట్, 50 మెగాపిక్సెల్ కెమెరా..భారత్‌లో రియల్‌మి కొత్త 5జీ ఫోన్ లాంచ్!

Realme Narzo 100X 5G Launching with 8,000mAh Battery: రియల్‌మి నార్జో 100ఎక్స్ 5జీ ఫోన్ మొత్తం మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది

Realme Narzo 100X 5G: 144Hz రిఫ్రెష్ రేట్, 50 మెగాపిక్సెల్ కెమెరా..భారత్‌లో రియల్‌మి కొత్త 5జీ ఫోన్ లాంచ్!

Photo Credit: Realme

Realme Narzo 100x 5G

ముఖ్యాంశాలు
  • భారత్‌లో రియల్‌మి కొత్త 5జీ ఫోన్ లాంచ్
  • 144Hz రిఫ్రెష్ రేట్, 50 మెగాపిక్సెల్ కెమెరా
  • రూ. 2,500 భారీ డిస్కౌంట్‌తో సొంతం చేసుకునే చాన్స్
ప్రకటన

Realme Narzo 100X 5G launching with 8,000mAh Battery: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి భారతీయ మొబైల్ ప్రియుల కోసం మరో పవర్‌ఫుల్ 5జీ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. తన పాపులర్ నార్జో సిరీస్‌లో భాగంగా రియల్‌మి నార్జో 100ఎక్స్ 5జీ మోడల్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ అత్యంత ప్రధానమైన హైలైట్ ఏంటంటే.. ఇందులో ఏకంగా 8,000mAh బ్యాటరీని అమర్చారు. సాధారణంగా మార్కెట్లో 5,000 లేదా 6,000mAh బ్యాటరీ ఉన్న ఫోన్లు చూస్తుంటాం, కానీ ఇందులో ఏకంగా 8,000mAh మెగా బ్యాటరీ ఇవ్వడం విశేషం. దీనికి తోడు 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఒకసారి చార్జ్ చేస్తే రెండు మూడు రోజుల పాటు నిరంతరాయంగా వాడుకోవచ్చు. ఫోన్ చార్జింగ్ త్వరగా అయిపోతుందనే టెన్షన్ పడేవారికి, ముఖ్యంగా గేమర్లకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్‌గా నిలవనుంది.

ఈ సరికొత్త రియల్‌మి నార్జో 100ఎక్స్ 5జీ ఫోన్ మొత్తం మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. వీటి ధరల విషయానికి వస్తే.. 4GB రామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999గా ఉంది. అలాగే 6GB రామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999, టాప్ ఎండ్ మోడల్ అయిన 6GB రామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ సేల్స్ జూలై 22 నుంచి రియల్‌మి అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్లో ప్రారంభం కానున్నాయి. ఇది ఫ్లాష్ ఆరెంజ్, మిడ్‌నైట్ బ్లాక్ అనే రెండు క్లాసీ కలర్లలో లభిస్తుంది. లాంచ్ ఆఫర్ కింద కస్టమర్లకు రూ.2,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్, అలాగే మరో రూ.500 అదనపు కూపన్ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే మొత్తంగా రూ.2,500 వరకు తగ్గింపు ధరతో ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.

ఫీచర్ల విషయానికి వస్తే.. రియల్‌మి నార్జో 100ఎక్స్ 5జీ ఫోన్ లో 6.6 ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 1570×720 పిక్సెల్స్ రెజల్యూషన్‌తో వస్తుంది. ఫోన్ స్క్రీన్ చాలా స్మూత్‌గా పనిచేయడానికి వీలుగా ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్, ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మి యూఐ 7.0 సాఫ్ట్‌వేర్‌పై రన్ అవుతుంది. పర్ఫార్మెన్స్ కోసం ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5జీ పవర్‌ఫుల్ ప్రాసెసర్‌ను అమర్చారు. దీనివల్ల మల్టీటాస్కింగ్, గేమింగ్ చాలా స్మూత్‌గా సాగుతాయి.

Budget 5G Smartphones : రూ.30 వేల బడ్జెట్లో బెస్ట్ ఫోన్ ఏది? నథింగ్, టెక్నో, రియల్‌మి మొబైల్స్ మధ్య బిగ్ ఫైట్

కెమెరా విభాగంలో కూడా రియల్‌మి నార్జో 100ఎక్స్ 5జీ ఫోన్ లో ఆకట్టుకుంటుంది. ఫోన్ వెనుక భాగంలో f/1.8 అపెర్చర్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అమర్చారు. దీనివల్ల తక్కువ వెలుతురులోనూ మంచి క్వాలిటీ ఫోటోలు, వీడియోలు తీసుకోవచ్చు. ఇక సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో f/2.0 అపెర్చర్‌తో కూడిన 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. భద్రత కోసం ఫోన్ స్క్రీన్ లోపలే ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లను జత చేశారు. దుమ్ము, ధూళి, నీటి చినుకుల నుండి ఫోన్‌కు రక్షణ కల్పించేందుకు ఈ మొబైల్‌కు IP65 రేటింగ్ ఇచ్చారు. ఈ ఫోన్ బరువు 224 గ్రాములు ఉంటుంది. కనెక్టివిటీ పరంగా ఇందులో డ్యూయల్ సిమ్, 5జీ నెట్‌వర్క్, బ్లూటూత్ 5.3, వై-ఫై 5, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, ఇయర్‌ఫోన్ ప్రియుల కోసం 3.5mm ఆడియో జాక్ వంటి అన్ని రకాల లేటెస్ట్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »