BSNL Q1 Revenue Jumps 10% Growth: బీఎస్ఎన్ఎల్ దూకుడు.. తొలి త్రైమాసికంలో 10 శాతం పెరిగిన కంపెనీ ఆదాయం

BSNL Q1 Revenue Jumps 10% Growth: గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ ఆదాయం రూ.4,017 కోట్లుగా నమోదవ్వగా.. ఈసారి ఏకంగా రూ.400 కోట్లకు పైగా అదనపు రాబడిని సొంతం చేసుకుని మార్కెట్లో తన సత్తా చాటింది.

BSNL Q1 Revenue Jumps 10% Growth: బీఎస్ఎన్ఎల్ దూకుడు.. తొలి త్రైమాసికంలో 10 శాతం పెరిగిన కంపెనీ ఆదాయం

BSNL

ముఖ్యాంశాలు
  • తొలి త్రైమాసికంలో 10 శాతం పెరిగిన BSNL ఆదాయం!
  • ఆపరేషన్స్ ద్వారా రూ. 4,418 కోట్ల రెవెన్యూ
  • కస్టమర్ మొబిలిటీ, ఎంటర్‌ప్రైజ్ బిజినెస్‌తో లాభాల పంట
ప్రకటన

BSNL Growth Story Q1 Revenue Jumps 10%: ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తిరిగి పూర్వవైభవాన్ని సంతరించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రైవేట్ టెలికాం కంపెనీల పోటీని తట్టుకుంటూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అద్భుతమైన ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కంపెనీ ఆదాయం దాదాపు 10 శాతం పెరిగింది. ఈ త్రైమాసికంలో కేవలం ఆపరేషన్స్ ద్వారానే బీఎస్ఎన్‌ఎల్ ఏకంగా రూ.4,418 కోట్ల రెవెన్యూను రాబట్టింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ ఆదాయం రూ.4,017 కోట్లుగా నమోదవ్వగా.. ఈసారి ఏకంగా రూ.400 కోట్లకు పైగా అదనపు రాబడిని సొంతం చేసుకుని మార్కెట్లో తన సత్తా చాటింది.

ఈ అద్భుతమైన వృద్ధిపై కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రత్యేకంగా మాట్లాడారు. కస్టమర్ మొబిలిటీ, ఎంటర్‌ప్రైజ్ బిజినెస్  విభాగాల నుంచి బీఎస్ఎన్‌ఎల్‌కు బలమైన వృద్ధి లభించిందని ఆయన వెల్లడించారు. అయితే కస్టమర్ ఫిక్స్‌డ్-యాక్సెస్ (ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్) విభాగంలో మాత్రం ఆదాయంలో స్వల్ప మార్పులు మాత్రమే నమోదయ్యాయని పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా కంపెనీ సాధిస్తున్న ఆపరేటింగ్ ప్రాఫిట్ నిరంతరం మెరుగుపడుతుండటం శుభపరిణామమని మంత్రి ప్రశంసించారు.

ఆదాయంతో పాటు కంపెనీ సగటు వినియోగదారు రాబడి అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ARPU) కూడా ఈ త్రైమాసికంలో గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఒక యూజర్ నుంచి బీఎస్ఎన్‌ఎల్‌కు నెలకు సగటున రూ.102.7 ఆదాయం వస్తోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా డిజిటల్ కనెక్టివిటీని పెంచడానికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సేవల నాణ్యతను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఈ కంపెనీని ఆధునీకరించడం ద్వారా ప్రైవేట్ నెట్‌వర్క్‌లకు ధీటుగా తయారు చేయాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది.

ప్రస్తుతం దేశంలోని అనేక ప్రాంతాల్లో బీఎస్ఎన్‌ఎల్ తన 4G నెట్‌వర్క్ సేవలను విజయవంతంగా విస్తరిస్తోంది. అయితే ఈ 4G నెట్‌వర్క్ డిజైన్ పూర్తిగా  క్లౌడ్-బేస్డ్ టెక్నాలజీతో రూపొందించబడింది. దీనివల్ల ఎలాంటి అదనపు హార్డ్‌వేర్ మార్పులు లేకుండానే, చాలా సులభంగా దీనిని 5G నెట్‌వర్క్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే కంపెనీ తన 5G నెట్‌వర్క్ పరీక్షలను కూడా విజయవంతంగా పూర్తి చేసింది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. బీఎస్ఎన్‌ఎల్ అందించబోయే ఈ 5G సేవలకు క్యూ-5జీ అనే పేరు పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే మార్కెట్లో పాతుకుపోయిన జియో, ఎయిర్‌టెల్ వంటి ప్రైవేట్ దిగ్గజాలకు గట్టి పోటీ ఇచ్చేందుకు బీఎస్ఎన్‌ఎల్ సిద్ధమవుతోంది.

Samsung : శాంసంగ్ లవర్స్‌కు పండగే.. త్వరలోనే ఆండ్రాయిడ్ 17 బేస్డ్ One UI 9 సరికొత్త అప్‌డేట్

బీఎస్ఎన్‌ఎల్ ప్రైవేటీకరణ గురించి వస్తున్న ఊహాగానాలపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గట్టిగా స్పందించారు. బీఎస్ఎన్‌ఎల్‌ను ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. "బీఎస్ఎన్‌ఎల్ భారతదేశ ప్రజలతో విడదీయరాని బంధాన్ని కలిగి ఉంది.. ఇది ఎప్పటికీ దేశ ప్రజల కోసమే పనిచేస్తుంది" అని ఆయన పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ ప్రభుత్వ సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు, దేశీయంగా టెలికాం సామర్థ్యాలను పెంచడంపైనే ప్రభుత్వం పూర్తి దృష్టి సారించిందని మంత్రి వివరించారు.

నెట్‌వర్క్ విస్తరణ కోసం విదేశీ కంపెనీల నుంచి టెలికాం పరికరాలను కొనుగోలు చేయడం లేదా దేశీయంగా స్వదేశీ టెక్నాలజీని అభివృద్ధి చేయడం అనే రెండు మార్గాలు బీఎస్ఎన్‌ఎల్ ముందు ఉన్నాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం స్వదేశీ పరికరాల వాడకానికే ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా బీఎస్ఎన్‌ఎల్ ఏర్పాటు చేస్తున్న కొత్త టెలికాం టవర్లలో సోలార్ పవర్ ను ఉపయోగించడం విశేషం. చివరిగా కస్టమర్ల సంఖ్యను వేగంగా పెంచుకోవడంతో పాటు రాబోయే రోజుల్లో మొబైల్ సేవల ద్వారా వచ్చే ఆదాయాన్ని కనీసం 50 శాతం పెంచుకోవాలని కంపెనీ అధికారులకు కేంద్ర మంత్రి సింధియా దిశానిర్దేశం చేశారు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »