Redmi Note 17 Pro Max features leaked: రెడ్‌మి నోట్ 17 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7500 ప్రాసెసర్‌తో పనిచేసే అవకాశం ఉంది
Redmi Note 17
Redmi Note 17 Pro Max Features Leaked: గ్లోబల్ మార్కెట్‌లోకి రెడ్‌మి నోట్ 17 ప్రో మ్యాక్స్ ఎంట్రీ ప్రసిద్ధ చైనీస్ హ్యాండ్‌సెట్ తయారీ సంస్థ షావోమికి చెందిన సబ్-బ్రాండ్ రెడ్‌మి ఇటీవలే తన నోట్ 17 సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో స్టాండర్డ్ మోడల్‌తో పాటు రెడ్‌మి నోట్ 17 ప్రో అందుబాటులో ఉన్నాయి. కాగా, త్వరలోనే ఈ లైనప్‌లోకి అత్యంత శక్తివంతమైన రెడ్‌మి నోట్ 17 ప్రో మ్యాక్స్ మోడల్‌ను చేర్చేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. అయితే దీనిపై షావోమి యాజమాన్యం ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, అంతర్జాతీయ వేదికలపై ఈ ఫోన్ మెరిసింది.
NBTC సర్టిఫికేషన్ సైట్‌లో లీక్..
థాయిలాండ్‌కు చెందిన నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ కమీషన్ (NBTC) లిస్టింగ్ సైట్‌లో రెడ్‌మి నోట్ 17 (మోడల్ సంఖ్య: 26081RA18G), రెడ్‌మి నోట్ 17 ప్రో మ్యాక్స్ (మోడల్ సంఖ్య: 2609FRA74G) ఇంటర్నేషనల్ వేరియంట్లు ప్రత్యక్షమయ్యాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లను చైనాలోనే తయారు చేసినట్లు సమాచారం లభించింది. ఈ లీక్స్ ఆధారంగా త్వరలోనే ఈ మోడల్ గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ కావడం ఖాయమని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
అద్భుతమైన కెమెరా, పవర్‌ఫుల్ ప్రాసెసర్..
లీక్ అయిన సమాచారం ప్రకారం.. రెడ్‌మి నోట్ 17 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7500 ప్రాసెసర్‌తో పనిచేసే అవకాశం ఉంది. ఫోటోగ్రఫీ ప్రేమికుల కోసం ఇందులో సామ్‌సంగ్ సెన్సార్‌తో కూడిన 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించబోతున్నారు. దీనితో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉంటుంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ మాట్లాడే వారి కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
భారీ బ్యాటరీ.. 10,000 mAh కెపాసిటీ..
రెడ్‌మి నోట్ 17 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన అతిపెద్ద హైలైట్ దీని బ్యాటరీనే అని చెప్పవచ్చు. సాధారణంగా స్మార్ట్‌ఫోన్లలో 5,000 లేదా 6,000 mAh బ్యాటరీలను చూస్తుంటాం, కానీ రెడ్‌మి నోట్ 17 ప్రో మ్యాక్స్‌లో ఏకంగా 10,000 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందించనున్నట్లు తెలుస్తోంది. ఇది గేమర్లకు, రోజంతా ఫోన్ వాడే ప్రయాణికులకు ఛార్జింగ్ టెన్షన్ లేకుండా అద్భుతమైన బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది.
Maruti Suzuki : మారుతి కారు కొనేవారికి అలర్ట్.. ఆగస్టు నుంచి పెరగనున్న ధరలు
స్టాండర్డ్ రెడ్‌మి నోట్ 17 ఫీచర్లు ఇవే..
గతంలో చైనాలో పరిచయం చేసిన స్టాండర్డ్ రెడ్‌మి నోట్ 17 స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే.. ఇది 7-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ (1,080 x 2,396 పిక్సెల్స్) OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 4 చిప్‌సెట్‌పై పనిచేస్తూ, ఆండ్రాయిడ్ 16 ఆధారిత షావోమి హైపర్ ఓఎస్ 3 సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉంటుంది. దీని వెనుక భాగంలో f/1.8 అపర్చర్‌తో 50MP సింగిల్ కెమెరా, ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇందులో 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 8,000 mAh బ్యాటరీని అందించారు. ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ కలిగిన ఈ ఫోన్ పర్పుల్, గ్రీన్, బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
IFA 2026: Lenovo Unveiled New IdeaPad, Yoga and ThinkBook Laptops
IFA 2026: Nvidia RTX Spark PCs, Local AI Tools Announced With October Launch Planned
Luna Band Now Available Globally: Check Price in India, Specifications and Features