Redmi Note 17 Launching on August 6th: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రెడ్‌మి సరికొత్త సంచలనం.. భారత్‌లో ఆగస్టు 6న రెడ్‌మి నోట్ 17 లాంచ్!

Redmi Note 17 launching in India on August 6th: భారతదేశంలో లాంచ్ కాబోయే రెడ్‌మి నోట్ 17 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు చైనీస్ వేరియంట్‌తో పోలిస్తే కొద్దిగా భిన్నంగా ఉండే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Redmi Note 17 Launching on August 6th: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రెడ్‌మి సరికొత్త సంచలనం.. భారత్‌లో ఆగస్టు 6న రెడ్‌మి నోట్ 17 లాంచ్!

Photo Credit: Redmi

Redmi Note 17

ముఖ్యాంశాలు
  • స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రెడ్‌మి సరికొత్త సంచలనం
  • పోకో బ్రాండింగ్‌తో భారత మార్కెట్లోకి ఎంట్రీ
  • 8000mAh పవర్‌ఫుల్ బ్యాటరీతో సరికొత్త రికార్డు
ప్రకటన

Redmi Note 17 launching in India on August 6th: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షావోమి సబ్ బ్రాండ్ అయిన రెడ్‌మి మార్కెట్లోకి సరికొత్త ఫ్లాగ్‌షిప్ సిరీస్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇటీవల చైనాలో ఘనంగా విడుదలైన రెడ్‌మి నోట్ 17 సిరీస్‌లోని బేస్ మోడల్ అతి త్వరలోనే భారత మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'X' వేదికగా ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చే నెల ఆగస్టు 6వ తేదీన భారతదేశంలో అధికారికంగా లాంచ్ కానుంది. అయితే దీనితో పాటు చైనాలో విడుదలైన ప్రీమియం మోడల్ రెడ్‌మి నోట్ 17 ప్రో భారత లాంచ్‌పై కంపెనీ ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

లీకైన లాంచ్ డేట్ వివరాలు..

భారతదేశంలో లాంచ్ కాబోయే రెడ్‌మి నోట్ 17 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు చైనీస్ వేరియంట్‌తో పోలిస్తే కొద్దిగా భిన్నంగా ఉండే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరికొన్ని ఆటోమొబైల్, టెక్ నివేదికల ప్రకారం.. చైనాలో విడుదలైన రెడ్‌మి నోట్ 17 మోడల్‌ను భారతదేశంలో పోకో ఎమ్ 8 పవర్ అనే సరికొత్త పేరుతో రీబ్రాండ్ చేసి లాంచ్ చేసే అవకాశం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ లాంచ్ అప్‌డేట్స్, రీబ్రాండింగ్‌కు సంబంధించి షావోమి ఇండియా టీమ్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 చిప్‌సెట్, హైపర్ ఓఎస్ 3తో అదిరిపోయే పర్ఫార్మెన్స్..

ఇటీవల చైనాలో విడుదలైన బేస్ మోడల్ రెడ్‌మి నోట్ 17 ఫీచర్లను పరిశీలిస్తే ఇందులో 7 ఇంచుల భారీ ఫుల్ HD+ (1080 x 2396 పిక్సెల్స్) OLED డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రీఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1800 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్ చేసే ఈ మొబైల్‌లో క్వాల్‌కామ్ సంస్థకు చెందిన సరికొత్త ఆక్టా-కోర్  స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 చిప్‌సెట్‌తో పాటు అడ్రినో జీపీయూ గ్రాఫిక్స్ కార్డ్‌ను అమర్చారు. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత షావోమి హైపర్ ఓఎస్ 3 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్ రన్ అవుతుంది.

8000mAh పవర్‌ఫుల్ బ్యాటరీతో సరికొత్త రికార్డు..

రెడ్‌మి నోట్ 17 స్మార్ట్‌ఫోన్ లోని కెమెరా విభాగం విషయానికొస్తే.. వెనుక భాగంలో స్క్వేర్ షేప్ కెమెరా మాడ్యూల్‌లో f/1.8 ఎపర్చరు కలిగిన 50 మెగాపిక్సెల్ సింగిల్ ప్రైమరీ కెమెరాతో పాటు ఎల్‌ఈడీ ఫ్లాష్‌ను అమర్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ ఫోన్ ద్వారా 1080p క్వాలిటీతో సెకనుకు 30 ఫ్రేమ్స్ వేగంతో వీడియో రికార్డింగ్ చేయవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా ఇందులో ఏకంగా 8000mAh సామర్థ్యం గల రాక్షస బ్యాటరీని అందించారు. ఇది 45W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌తో పాటు 22.5W రివర్స్ వైర్డ్ చార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. సేఫ్టీ కోసం ఇందులో ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కూడా ఇచ్చారు.

Social Media : టీనేజర్ల రక్షణ కోసం బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సోషల్ మీడియాపై రాత్రి వేళల్లో కర్ఫ్యూ

ప్రో లవర్స్ కోసం 3200 నిట్స్ బ్రైట్‌నెస్ స్క్రీన్..

మరోవైపు చైనా మార్కెట్లో విడుదలైన ప్రీమియం మోడల్ రెడ్‌మి నోట్ 17 ప్రో ఫీచర్లు మరింత విలాసవంతంగా ఉన్నాయి. ఇందులో 6.83 ఇంచుల 1.5K AMOLED డిస్‌ప్లేను అమర్చారు. ఇది కూడా 120Hz రీఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను సపోర్ట్ చేయడమే కాకుండా, అవుట్‌డోర్ ఎండలో కూడా స్క్రీన్ అద్భుతంగా కనిపించేలా ఏకంగా 3200 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ లెవెల్‌ను కలిగి ఉంది. పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోసం క్వాల్‌కామ్ సంస్థకు చెందిన అధునాతన స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4  ప్రాసెసర్‌ను ఇందులో ఉపయోగించారు. భారత మార్కెట్లో ఈ సిరీస్ ఫోన్లు బడ్జెట్ ధరలో విడుదలైతే విక్రయాల్లో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »