Maruti Suzuki announced that across All cars and Models Price will be hike from August 2026: మారుతి సుజుకి ఇండియా తమ వేరియంట్, మోడల్‌ను బట్టి కార్ల ధరలపై గరిష్టంగా రూ.30,000 వరకు పెంపు ఉండనుందని స్పష్టం చేసింది
Photo Credit: Reuters
Maruti Suzuki
Maruti Suzuki announced that Across All Cars and Models price will be hike from August 2026: మీరు కొత్తగా మారుతి సుజుకి కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, ఆలస్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేయడం మీకు ఎంతో ఆర్థిక ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి ఇండియా తమ కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. రాబోయే ఆగస్టు 2026 నుంచి తమ వాహనాల ధరలను పెంచనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. వేరియంట్, మోడల్‌ను బట్టి కార్ల ధరలపై గరిష్టంగా రూ.30,000 వరకు పెంపు ఉండనుందని స్పష్టం చేసింది.
ఖర్చులు పెరగడమే ప్రధాన కారణం..
గత కొన్ని నెలలుగా పెరుగుతున్న ఆపరేటింగ్ ఖర్చులు, తయారీ వ్యయాన్ని తగ్గించుకోవడానికి కంపెనీ అంతర్గతంగా అనేక రకాల కాస్ట్-కటింగ్ చర్యలను చేపట్టిందని మారుతి సుజుకి ఇండియా వెల్లడించింది. అయితే, కారు తయారీకి అవసరమైన ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరగడం వల్ల ఆ భారాన్ని ఇకపై పూర్తిగా తామే భరించడం సాధ్యం కావడం లేదని తెలిపింది. అందుకే పెరిగిన ఉత్పత్తి వ్యయంలో కొంత భాగాన్ని వినియోగదారులపై మోపక తప్పడం లేదని, అయితే ఈ భారం కస్టమర్లపై సాధ్యమైనంత తక్కువగా ఉండేలా చూసుకున్నామని కంపెనీ పేర్కొంది.
ఏ మోడల్‌పై ఎంత పెంపు అనేది త్వరలోనే వెల్లడి..
ప్రస్తుతానికి ఏ పర్టికులర్ మోడల్‌పై ఎంత మోతాదులో ధర పెరుగుతుందనే ఖచ్చితమైన వివరాలను కంపెనీ ఇంకా బయటపెట్టలేదు. మీరు ఎంచుకునే కారు మోడల్, దాని ఇంజిన్ వేరియంట్, ఫీచర్లను బట్టి ఈ ధరల మార్పు వేర్వేరుగా ఉంటుందని మారుతి సుజుకి తెలిపింది. కొత్త ధరలన్నీ ఆగస్టు 2026 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. కాబట్టి ఆగస్టు కంటే ముందే కారు బుక్ చేసుకుని డెలివరీ పొందితే వేల రూపాయల అదనపు భారం నుంచి తప్పించుకోవచ్చు.
Samsung Galaxy S25 : శామ్‌సంగ్ గెలాక్సీ S25 5G పై భారీ ఆఫర్లు.. అమెజాన్‌లో ఏకంగా రూ.17,000 పైగా తగ్గింపు
ఈ ఏడాదో ఇది మొదటిసారి కాదు..
ఈ ఏడాది మారుతి సుజుకి కార్ల ధరలను పెంచడం ఇదే మొదటిసారి కాదు. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయం, గ్లోబల్ సప్లై చైన్ సమస్యల గురించి కంపెనీ గతంలోనే పలుమార్లు సూచనలు చేసింది. మే 2026లో కూడా తయారీ వ్యయాన్ని తగ్గించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నామని కంపెనీ తెలిపింది. అలాగే ఫిబ్రవరి 2026లో బంగారం, వెండి వంటి విలువైన లోహాలు, ఇతర నిత్యావసర రసాయనాల ధరలు పెరగడం వల్ల మరోసారి ధరల పెంపును పరిశీలిస్తున్నట్లు మారుతి ప్రకటించింది.
మొత్తం ఆటో పరిశ్రమపై పడుతున్న భారం..
ప్రస్తుతం భారతదేశంలోని ఆటోమొబైల్ పరిశ్రమ మొత్తం ముడిసరుకులు, లాజిస్టిక్స్, ఆపరేషనల్ ఖర్చులు పెరగడం వల్ల తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ఉత్పత్తి వ్యయాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మారుతి సుజుకి తీసుకున్న ఈ ధరల పెంపు నిర్ణయం, ఈ విభాగంలో పెరుగుతున్న ఖర్చుల తీవ్రతను స్పష్టంగా తెలియజేస్తోంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
IFA 2026: Lenovo Unveiled New IdeaPad, Yoga and ThinkBook Laptops
IFA 2026: Nvidia RTX Spark PCs, Local AI Tools Announced With October Launch Planned
Luna Band Now Available Globally: Check Price in India, Specifications and Features