Samsung : శామ్‌సంగ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. మార్కెట్లో పెరగనున్న రెండు బడ్జెట్ 5G ఫోన్ల ధరలు

శామ్‌సంగ్ గెలాక్సీ F17 5G మోడల్ అన్ని వేరియంట్ల ధరలపై దాదాపు రూ.1,000 వరకు పెంచినట్లు తెలుస్తోంది

Samsung : శామ్‌సంగ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. మార్కెట్లో పెరగనున్న రెండు బడ్జెట్ 5G ఫోన్ల ధరలు

Photo Credit: Samsung

Samsung

ముఖ్యాంశాలు
  • గెలాక్సీ F17 5G, గెలాక్సీ A17 5G లపై రూ. 1,000 వరకు అదనపు భారం
  • జూన్ 12 నుంచే కొత్త ధరలు అమల్లోకి వచ్చినట్లు సమాచారం!
  • సోషల్ మీడియాలో లీకైన డాక్యుమెంట్
ప్రకటన

Samsung : ప్రముఖ గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శామ్‌సంగ్ తన కస్టమర్లకు ఒక చిన్నపాటి షాక్ ఇచ్చింది. కంపెనీ ఇటీవలే తన పాపులర్ బడ్జెట్ సిరీస్ లైన M, F సిరీస్‌లకు చెందిన కొన్ని ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్ మోడళ్ల ధరలను పెంచిన సంగతి తెలిసిందే. అయితే, తాజా లీక్‌ల ప్రకారం ఈ ధరల పెంపు లిస్ట్‌లోకి మరికొన్ని సరికొత్త మోడళ్లు కూడా వచ్చి చేరినట్లు తెలుస్తోంది. ఈ సరికొత్త మార్పులు శామ్‌సంగ్ మార్కెట్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న గెలాక్సీ F17 5G, గెలాక్సీ A17 5G మోడళ్లకు వర్తిస్తాయని సమాచారం.

సోషల్ మీడియాలో లీకైన రీటైల్ నోటీస్
ఈ ధరల మార్పులకు సంబంధించి శామ్‌సంగ్ కంపెనీ తరపున ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, ఎక్స్ వేదికగా ప్రముఖ టిప్‌స్టర్ అహ్సాన్ (@AhsanKharbai) ఒక లీకైన శామ్‌సంగ్ రీటైల్ నోటీస్‌ను నెటిజన్లతో పంచుకున్నారు. ఈ లీకైన స్క్రీన్‌షాట్‌లో Samsung Smart Partner పోర్టల్ అని రాసి ఉండటాన్ని బట్టి చూస్తే, ఇది కేవలం రీటైల్ ఛానల్స్, దుకాణదారుల అంతర్గత కమ్యూనికేషన్ కోసం పంపిన అధికారిక పత్రంగా అనిపిస్తోంది. అందులోని వివరాల ప్రకారం.. ఈ కొత్త ధరల సవరణ జూన్ 12, 2026 నుంచే అధికారికంగా అమలులోకి వచ్చినట్లు స్పష్టమవుతోంది.

శామ్‌సంగ్ గెలాక్సీ F17 5G కొత్త ధరల వివరాలు
లీకైన ఆ పత్రం ప్రకారం.. శామ్‌సంగ్ గెలాక్సీ F17 5G మోడల్  అన్ని వేరియంట్ల ధరలపై దాదాపు రూ.1,000 వరకు పెంచినట్లు తెలుస్తోంది. ఇందులో బేస్ వేరియంట్ అయిన 4GB+128GB కొత్త ధర రూ.18,999కి చేరింది. అలాగే దీని సెకండ్ వేరియంట్ 6GB+128GB మోడల్ కొత్త ధర రూ.20,999గా, టాప్ ఎండ్ వేరియంట్ అయిన 8GB+128GB మోడల్ ధర పెరిగిన తర్వాత మార్కెట్లో రూ.22,999 వద్ద రీటైల్ మార్కెట్లలో లభించనుంది.

Xiaomi Mi 10T 5G : ఫ్లిప్‌కార్ట్‌లో షియోమి Mi 10T 5G పై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.11,300 డిస్కౌంట్

శామ్‌సంగ్ గెలాక్సీ A17 5G రేట్ల పెంపు
మరోవైపు, మిడ్-రేంజ్ విభాగంలో మంచి సేల్స్ సాధిస్తున్న శామ్‌సంగ్ గెలాక్సీ A17 5G సిరీస్ ధరలు కూడా పెరిగాయి. దీని 6GB+128GB వేరియంట్ మునుపటి ధర రూ. 21,499 నుంచి రూ.1,000 పెరిగి ఇప్పుడు రూ. 22,499 కి చేరుకుంది. అదేవిధంగా దీని 8GB+128GB వేరియంట్ ధర రూ.23,499 నుంచి రూ.24,499కి పెరగ్గా.. హై-ఎండ్ స్టోరేజ్ వేరియంట్ అయిన 8GB+256GB మోడల్ ధర పాత రేటు రూ.27,999 నుంచి ఏకంగా రూ.28,999కి పెరిగినట్లు సదరు లీకైన స్క్రీన్‌షాట్ ద్వారా బహిర్గతమైంది.

వెబ్‌సైట్లలో లైవ్ స్టేటస్ ఎలా ఉందంటే?
ఈ ధరల పెంపు విషయం ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారడంతో ప్రముఖ టెక్ మీడియా హౌస్ గ్యాడ్జెట్స్ 360 ప్రతినిధులు వివిధ ఆన్‌లైన్ పోర్టల్స్‌లో దీనిపై ఒక చిన్న పరిశోధన చేశారు. శామ్‌సంగ్ అధికారిక ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో చెక్ చేయగా గెలాక్సీ F17 5G మోడల్ పాత ధరతోనే చూపిస్తూ అవుట్ ఆఫ్ స్టాక్ గా ఉంది. అలాగే గెలాక్సీ A17 5G మోడల్ మాత్రం ఇంకా పాత ధరలకే సేల్ అవుతోంది. వీటితో పాటు ప్రముఖ ఈ-కామర్స్ సైట్లు అయిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్  లలో ఈ రెండు ఫోన్లు వాటి అసలు ధరల కంటే కాస్త తక్కువకే, మంచి డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తుండటం గమనార్హం.

#తాజా కథనాలు
  1. iPhone 17 Pro : యాపిల్ లవర్స్‌కు పండగే.. ఐఫోన్ 17 ప్రో పై ఏకంగా రూ.22,000 డిస్కౌంట్
  2. Samsung : శామ్‌సంగ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. మార్కెట్లో పెరగనున్న రెండు బడ్జెట్ 5G ఫోన్ల ధరలు
  3. Smart Driving : స్మార్ట్‌ఫోన్‌ను కారు స్క్రీన్‌కు కనెక్ట్ చేయడం ఎలా? ఆండ్రాయిడ్ ఆటో ఈజీ సెటప్ ప్రాసెస్
  4. IRCTC Website : రైల్వే ప్రయాణికులకు సూపర్ గుడ్ న్యూస్.. జులై 15న సరికొత్త IRCTC వెబ్‌సైట్ లాంచ్
  5. Flipkart June Epic Sale : ఫ్లిప్‌కార్ట్ జూన్ ఎపిక్ సేల్ లైవ్.. సగం ధరకే శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్!
  6. Oppo : ఒప్పో లగ్జరీ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా పై క్రేజీ ఆఫర్స్
  7. Samsung : శాంసంగ్ మాస్టర్ ప్లాన్.. ఫోన్ స్క్రీన్‌పైనే ఇంటర్నెట్ స్పీడ్ చూసుకునే సరికొత్త ఫీచర్!
  8. Motorola : మోటోరోలా నుంచి సరికొత్త బడ్జెట్ 5జీ ఫోన్లు..మార్కెట్లోకి మోటో జీ37, జీ37 పవర్ ఎంట్రీ
  9. Xiaomi Mi 10T 5G : ఫ్లిప్‌కార్ట్‌లో షియోమి Mi 10T 5G పై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.11,300 డిస్కౌంట్
  10. OTT Movie : ఓటీటీ ప్రియులకు పండగే.. అమెజాన్ ప్రైమ్ లోకి వస్తోన్న పవర్‌ఫుల్ క్రైమ్ థ్రిల్లర్ ఇసకపట్నం
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »