మీ కారులో ఆండ్రాయిడ్ ఆటో సెటప్ చేయడానికి ముందు కొన్ని ముఖ్యమైన అవసరాలు పూర్తి కావాల్సి ఉంటుంది.
Photo Credit: Google
Smart Driving
Smart Driving : కారు నడిపేటప్పుడు స్మార్ట్‌ఫోన్ ఉపయోగించడం అత్యంత ప్రమాదకరం. కానీ ప్రయాణంలో గూగుల్ మ్యాప్స్ చూసుకోవడానికో, లేదా ముఖ్యమైన కాల్స్ మాట్లాడటానికో ఫోన్ వాడటం చాలా మందికి తప్పనిసరి అవుతోంది. ఈ సమస్యకు చక్కటి పరిష్కారమే ఆండ్రాయిడ్ ఆటో. మీ కారు గనుక ఈ ఫీచర్‌ను సపోర్ట్ చేస్తే.. మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను కారు ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ చేతిలోకి తీసుకోవాల్సిన అవసరం లేకుండానే, అవసరమైన అన్ని ముఖ్యమైన ఫీచర్లను కారు స్క్రీన్ పైనే ఆపరేట్ చేయవచ్చు. ఒకవేళ మీరు ఇప్పటివరకు మీ కారులో ఆండ్రాయిడ్ ఆటోను సెటప్ చేసుకోకపోతే, దాన్ని ఎలా చేయాలో ఇప్పుడు సులభంగా తెలుసుకుందాం.
ఆండ్రాయిడ్ ఆటో వాడటానికి కావాల్సిన అర్హతలు
మీ కారులో ఆండ్రాయిడ్ ఆటో సెటప్ చేయడానికి ముందు కొన్ని ముఖ్యమైన అవసరాలు పూర్తి కావాల్సి ఉంటుంది. మొదటిగా మీ దగ్గర ఆండ్రాయిడ్ 10 లేదా అంతకంటే లేటెస్ట్ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్ ఉండాలి. రెండోది, మీ కారు లేదా కారులోని మ్యూజిక్ సిస్టమ్ కచ్చితంగా ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్‌ను సపోర్ట్ చేసేది అయి ఉండాలి. వీటితో పాటు మీ ఫోన్‌లో యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. చివరగా, ఫోన్‌ను కారుకు కనెక్ట్ చేయడానికి ఒక మంచి యూఎస్‌బీ కేబుల్ లేదా మీ కారు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటోను సపోర్ట్ చేస్తుంటే బ్లూటూత్, వైఫై సదుపాయం ఉండాలి.
Xiaomi Mi 10T 5G : ఫ్లిప్‌కార్ట్‌లో షియోమి Mi 10T 5G పై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.11,300 డిస్కౌంట్
కారులో ఆండ్రాయిడ్ ఆటోను సెటప్ చేసే సులువైన విధానం
సెటప్ ప్రాసెస్ ప్రారంభించే ముందు మీ ఫోన్‌లో ఆండ్రాయిడ్ ఆటో యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోండి. కొత్తగా వచ్చే చాలా ఫోన్లలో ఈ ఫీచర్ ఇన్‌బిల్ట్‌గా వస్తుంది. మొదటగా మీ కారును స్టార్ట్ చేసి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఆన్ చేయండి. ఆ తర్వాత మీ స్మార్ట్‌ఫోన్‌లో బ్లూటూత్, వైఫై ఆప్షన్లను ఆన్ చేయండి. ఇప్పుడు ఒక మంచి యూఎస్‌బీ కేబుల్ ద్వారా మీ ఫోన్‌ను కారుకు కనెక్ట్ చేయండి. ఒకవేళ మీ కారు వైర్‌లెస్ కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంటే.. కేబుల్ లేకుండానే బ్లూటూత్ ద్వారా కారు సిస్టమ్‌తో ఫోన్‌ను పెయిరింగ్ చేయండి. కనెక్షన్ అయిన వెంటనే మీ ఫోన్ స్క్రీన్ పై కొన్ని పర్మిషన్లు అడుగుతుంది, వాటిని Allow చేయండి. ఆ తర్వాత గూగుల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంగీకరిస్తే.. కొద్ది సెకన్లలోనే ఆండ్రాయిడ్ ఆటో మీ కారు స్క్రీన్ పై ప్రత్యక్షమవుతుంది.
కారు స్క్రీన్ పై ఏమేం ఫీచర్లు వాడుకోవచ్చు?
ఒక్కసారి ఆండ్రాయిడ్ ఆటో సక్సెస్‌ఫుల్‌గా కనెక్ట్ అయిన తర్వాత మీరు ఎన్నో రకాల ఫీచర్లను ఎంజాయ్ చేయవచ్చు. హైవేలపై లేదా కొత్త ప్రాంతాలకు వెళ్లేటప్పుడు దారి వెతుక్కోవడానికి గూగుల్ మ్యాప్స్, నావిగేషన్ ఫీచర్‌ను పెద్ద స్క్రీన్ పై స్పష్టంగా చూడవచ్చు. ప్రయాణంలో వినోదం కోసం స్పాటిఫై, యూట్యూబ్ మ్యూజిక్ వంటి యాప్స్ ద్వారా మీకు నచ్చిన పాటలు వినవచ్చు. వీటితో పాటు డ్రైవింగ్ చేస్తూనే చేతులు వాడకుండా మాట్లాడే హ్యాండ్స్-ఫ్రీ కాలింగ్ సదుపాయం ఉంటుంది. మీ ఫోన్‌కు వచ్చే వాట్సాప్, నార్మల్ ఎస్ఎమ్‌ఎస్ నోటిఫికేషన్లను కారు స్క్రీన్ పైనే చూసుకోవచ్చు. వీటన్నింటినీ కేవలం మీ నోటి మాటతో ఆపరేట్ చేయడానికి గూగుల్ అసిస్టెంట్ వాయిస్ కమాండ్స్ ఫీచర్ కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది.
ఆండ్రాయిడ్ ఆటో కనెక్ట్ కాకపోతే ఏం చేయాలి?
కొన్నిసార్లు సాంకేతిక కారణాల వల్ల ఆండ్రాయిడ్ ఆటో కారు స్క్రీన్‌కు కనెక్ట్ కాకపోవచ్చు. అలాంటప్పుడు కంగారు పడకుండా కొన్ని సాధారణ చిట్కాలతో ఈ సమస్యను పరిష్కరించవచ్చు. మొదటగా మీ ఫోన్‌ను, కారు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఒకసారి రీస్టార్ట్ చేసి మళ్లీ ప్రయత్నించండి. మీ ఫోన్‌లోని ఆండ్రాయిడ్ ఆటో యాప్ అప్‌డేట్ అయిందో లేదో ప్లేస్టోర్‌లో చెక్ చేయండి. కేబుల్ ద్వారా కనెక్ట్ చేస్తున్నట్లయితే.. వాడుతున్న యూఎస్‌బీ కేబుల్ మార్చి ఒరిజినల్ కేబుల్ ఉపయోగించండి. బ్లూటూత్, వైఫై కనెక్షన్లను డిస్‌కనెక్ట్ చేసి మళ్లీ రీ-కనెక్ట్ చేయండి. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆండ్రాయిడ్ ఆటో యాప్ Cache ఫైల్స్ క్లియర్ చేయండి. అన్నింటికంటే ముఖ్యంగా మీ కారు మోడల్ అసలు ఆండ్రాయిడ్ ఆటోను సపోర్ట్ చేస్తుందో లేదో కంపెనీ బుక్‌లెట్‌లో ఒకసారి సరిచూసుకోండి.
ప్రకటన
ప్రకటన
Samsung's TM Roh Reportedly Plans to Visit BOE in June Amid Galaxy S27 OLED Supply Talks