ఈ ఫోన్‌లో ప్రత్యేకించి ప్రో విజువల్ ఇంజిన్ ఉంటుంది, దీని ద్వారా పలు ఏఐ ఆధారిత ఎడిటింగ్ టూల్స్ అందుబాటులో ఉంటాయి

ప్రస్తుతం ఈ ఫోన్ శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంది. జూలై 12లోపు ప్రీ-ఆర్డర్ చేసుకున్న వారికి, 512GB వేరియంట్‌ను 256GB ధరకే పొందే ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది. జూలై 25 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి.

ఈ ఫోన్‌లో ప్రత్యేకించి ప్రో విజువల్ ఇంజిన్ ఉంటుంది, దీని ద్వారా పలు ఏఐ ఆధారిత ఎడిటింగ్ టూల్స్ అందుబాటులో ఉంటాయి

Photo Credit: Samsung

Samsung Galaxy Z Flip 7 4.1-అంగుళాల ఎడ్జ్-టు-ఎడ్జ్ కవర్ డిస్ప్లేతో వస్తుంది

ముఖ్యాంశాలు
  • 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్‌ కెమెరా సెటప్
  • ఈ ఫోన్‌లో 4,300mAh బ్యాటరీ బ్యాక్అప్ ఉంది
  • నౌ బార్ & నౌ బ్రీఫ్ వంటి ప్రొడక్టివి ఫీచర్స్ అవైలబుల్
ప్రకటన

శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7ను ఇటీవల గ్లోబల్ లాంచ్ చేశారు. గెలాక్సీ Z ఫోల్డ్ 7 మరియు గెలాక్సీ Z ఫ్లిప్ 7 FE మోడళ్లతో పాటు ఇది విడుదలైంది. గెలాక్సీ Z ఫ్లిప్ 6తో పోలిస్తే, ఈ కొత్త మోడల్‌లో కవర్ స్క్రీన్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఇది 4.1 అంగుళాల ఎడ్జ్-టు-ఎడ్జ్ డిస్ప్లేతో వస్తోంది.భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 12GB RAM + 256GB వేరియంట్ ప్రారంభ ధర రూ. 1,09,999గా ఉంది. 12GB + 512GB వేరియంట్ ధర రూ. 1,21,999గా ఉంది. ఈ ఫోన్ బ్లూ షాడో, కోరల్ రెడ్, జెట్ బ్లాక్ మరియు మింట్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది. మింట్ కలర్ మాత్రం ప్రత్యేకంగా శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుంది.ప్రస్తుతం ఈ ఫోన్ శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంది. జూలై 12లోపు ప్రీ-ఆర్డర్ చేసుకున్న వారికి, 512GB వేరియంట్‌ను 256GB ధరకే పొందే ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది. జూలై 25 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి.

గెలాక్సీ Z ఫ్లిప్ 7 స్పెసిఫికేషన్లు:

ఈ ఫోన్‌లో 6.9 అంగుళాల ఫుల్ HD+ డైనమిక్ AMOLED 2X మెయిన్ ఫోల్డబుల్ డిస్ప్లేతో పాటు, 4.1 అంగుళాల సూపర్ AMOLED కవర్ డిస్ప్లే ఉంటుంది. రెండు డిస్ప్లేలు 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తాయి. ఔటర్ డిస్ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ కూడా ఉంది. ఈ ఫోన్‌ను శాంసంగ్ ఓన్ గా డెవలప్ చేసిన 3nm Exynos 2500 ప్రాసెసర్ తో రూపొందించారు. ఇది 12GB RAM, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను సపోర్ట్ చేస్తుంది. బాక్స్ నుంచే ఆండ్రాయిడ్ 16 బేస్డ్ One UI 8 తో వస్తుంది.

కెమెరా సెటప్ & AI ఫీచర్లు

ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ మెయిన్ సెన్సార్‌తో పాటు, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. మెయిన్ డిస్ప్లే పైభాగంలో 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది.

ఈ ఫోన్‌లో ప్రత్యేకించి ప్రో విజువల్ ఇంజిన్ ఉంటుంది, దీని ద్వారా పలు ఏఐ ఆధారిత ఎడిటింగ్ టూల్స్ అందుబాటులో ఉంటాయి. అలాగే ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్, నోట్ అసిస్ట్, కాల్ అసిస్ట్, లైవ్ ట్రాన్స్లేషన్ వంటి అధునాతన AI ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. గూగుల్ జెమినీ ఫీచర్లు కూడా సపోర్ట్ చేస్తుంది. సర్కిల్ టు సర్చ్ వంటి స్మార్ట్ సెర్చ్ టూల్స్, నౌ బార్ & నౌ బ్రీఫ్ వంటి ప్రొడక్టివి ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి . నౌ బార్ ఫీచర్ తో యూజర్లు మ్యూజిక్ ప్లేబ్యాక్, లైవ్ నోటిఫికేషన్స్‌ను కంట్రోల్ చేయవచ్చు. ఇక నౌ బ్రీఫ్ ఫీచర్ తో డే ప్లానింగ్‌ను కవర్ స్క్రీన్ నుంచే పర్సనలైజ్‌డ్‌గా చూసుకోవచ్చు.

డిజైన్, బ్యాటరీ, & ఇతర ఫీచర్లు:

ఈ ఫోన్‌లో 4,300mAh బ్యాటరీ ఉంటుంది. ఫోల్డబుల్ డిజైన్‌ను ఈజీగా హ్యాండిల్ చేసేందుకు ఆర్మర్ అల్యూమినియం మిడిల్ ఫ్రేమ్ మరియు ఆర్మర్ ఫ్లెక్స్ హింజ్ వాడారు. ఈ గెలాక్సీ Z ఫ్లిప్ 7 IP48 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుంది. ఫోన్ తెరిచినప్పుడు 6.5mm థిక్నెస్ తో ఉంటుంది. ఫోల్డ్ చేసినప్పుడు 13.7mm థిక్నెస్ కి మారుతుంది. కేవలం 188 గ్రాములు బరువు మాత్రమే ఉంటుంది. ఇది మల్టీటాస్కింగ్, స్టైలిష్ లుక్ కోరుకునే కస్టమర్స్ కోసం ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

Comments
Facebookలో షేర్‌ Gadgets360 Twitter Shareట్వీట్ షేర్ Snapchat రెడ్డిట్ వ్యాఖ్యానించండి

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. ఈ ఫోన్‌లో ప్రత్యేకించి ప్రో విజువల్ ఇంజిన్ ఉంటుంది, దీని ద్వారా పలు ఏఐ ఆధారిత ఎడిటింగ్ టూల్స్ అందుబాటులో ఉంటాయి
  2. ఈ ఫోన్‌ 4400mAh బ్యాటరీతో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 30 నిమిషాల్లో 50% ఛార్జ్
  3. ChatGPT said: ఆఫర్లు బ్యాంక్, కూపన్ డిస్కౌంట్లు, నో కాస్ట్ EMIతో ఎఫెక్టివ్ ధరలకు అందుబాటులో ఉన్నాయి
  4. ఈ ఆఫర్లు బ్యాంక్ ఆఫర్లు, కూపన్‌లతో లభ్యమవుతూ నో కాస్ట్ EMI ఫైనాన్స్ ఎంపికలు అందుబాటులో
  5. జూలై 14న ఇండియ‌న్ మార్కెట్‌లోకి Vivo X Fold 5, Vivo X200 FE
  6. స‌రికొత్త బ్యాట‌రీ అప్‌గ్రేడ్‌తో మార్కెట్‌లోకి iPhone 17 Pro Max
  7. ఇది మిడ్ రేంజ్‌ సెగ్మెంట్లో గట్టి పోటీగా జూలై 12 నుంచి అమెజాన్‌లో లభ్యం
  8. ప్రైమ్ డే 2025: ఎకో, ఫైర్ టీవీ, కిండిల్‌లపై గరిష్ఠంగా 50% డిస్కౌంట్
  9. నథింగ్ హెడ్‌ఫోన్ 1లో 1040mAh బ్యాటరీ ఉంది, 120 నిమిషాల్లో Type-C ద్వారా ఛార్జ్ అవుతుంది
  10. నథింగ్ ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్ Android 15 ఆధారంగా రూపొందించిన నథింగ్ OS 3.5 పై రన్ అవుతుంది
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »