Tecno Camon 50 Ultra 5G : నేటి నుంచే అమ్మకానికి టెక్నో కేమన్ 50 ఆల్ట్రా 5జీ.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే

టెక్నో కేమన్ 50 ఆల్ట్రా 5జీ స్మార్ట్‌ఫోన్ సింగిల్ వేరియంట్ అయిన 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్‌తో లభిస్తుంది.

Tecno Camon 50 Ultra 5G : నేటి నుంచే అమ్మకానికి టెక్నో కేమన్ 50 ఆల్ట్రా 5జీ.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే

Photo Credit: Tecno

Tecno Camon 50 Ultra 5G

ముఖ్యాంశాలు
  • ఫోన్ నీటిలో పడినా, కింద పడినా నో టెన్షన్
  • కెమెరా క్వాలిటీ చూస్తే సెలబ్రిటీలు కూడా ఫిదా అయిపోవాల్సిందే
  • టెక్నో సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ సేల్ షురూ
ప్రకటన

Tecno Camon 50 Ultra 5G : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ టెక్నో, మిడ్-రేంజ్ విభాగంలో సరికొత్త టెక్నో కేమన్ 50 ఆల్ట్రా 5జీ ఫోన్‌ను భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. నేటి నుంచే ఈ స్మార్ట్‌ఫోన్ అధికారికంగా విక్రయానికి వచ్చింది. పవర్ఫుల్ ప్రాసెసర్, సుదీర్ఘ సమయం పనిచేసే పవర్‌ఫుల్ బ్యాటరీ, అదిరిపోయే కెమెరా సెటప్‌తో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చారు.

ధర, ఆఫర్లు, లభ్యత
ఈ స్మార్ట్‌ఫోన్ సింగిల్ వేరియంట్ అయిన 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్‌తో లభిస్తుంది. దీని సాధారణ ధర రూ.39,999గా నిర్ణయించారు. అయితే లాంచ్ ఆఫర్‌లో భాగంగా కంపెనీ రూ.3,000 ప్రత్యేక క్యూపన్ డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ.36,999 ఎఫెక్టివ్ ధరకే సొంతం చేసుకోవచ్చు. అదనంగా 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎమ్‌ఐ వెసులుబాటు కూడా ఉంది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ద్వారా సైప్రస్ గ్రీన్, మిస్టీ పర్పుల్, నేబులా టైటానియం రంగుల్లో ఇది కొనుగోలుకు అందుబాటులో ఉంది.

మిలిటరీ గ్రేడ్ దుమ్ము, వాటర్ రెసిస్టెన్స్
టెక్నో కేమన్ 50 ఆల్ట్రా 5జీ డిజైన్, మన్నిక విషయంలో చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇందులో 6.78-అంగుళాల 1.5K ProXDR కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 2,800Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో అత్యంత స్మూత్‌గా పనిచేస్తుంది. స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i వాడారు. దుమ్ము, నీటి నుంచి పూర్తి రక్షణ కోసం IP66, IP68, IP69, IP69K రేటింగ్‌లతో పాటు మిలిటరీ గ్రేడ్ మన్నిక సర్టిఫికేషన్‌ను కూడా పొందింది.

CP Plus CarKam 4G Dashcam : కార్ల భద్రత కోసం కొత్త డ్యాష్‌క్యామ్ సిరీస్.. సీపీ ప్లస్ నుంచి అద్భుతమైన గ్యాడ్జెట్

పవర్‌ఫుల్ ప్రాసెసర్, ఆపరేటింగ్ సిస్టమ్
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఆల్టిమేట్ ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది మల్టీటాస్కింగ్, హెవీ గేమింగ్‌ను చాలా సులభంగా హ్యాండిల్ చేస్తుంది. సెక్యూరిటీ కోసం ఇందులో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికొస్తే, ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16 తో రన్ అవుతుంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.4, USB టైప్-సి పోర్ట్‌లకు సపోర్ట్ చేస్తుంది.

అద్భుతమైన 50MP కెమెరాలు, జంబో బ్యాటరీ
ఫొటోగ్రఫీ ప్రేమికుల కోసం ఈ ఫోన్‌లో వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో f/1.8 అపెర్చర్‌తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేసే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 8 మెగాపిక్సెల్ ఆల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఆటోఫోకస్ సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. అంతేకాకుండా సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ కోసం 6,500mAh జంబో బ్యాటరీని ఇచ్చారు. ఇది 45W వేగవంతమైన వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Samsung Galaxy Card Launched : శామ్‌సంగ్ నుంచి తొలి క్రెడిట్ కార్డ్.. శామ్‌సంగ్ గెలాక్సీ కార్డ్ లాంచ్
  2. Samsung Back to School Offers : విద్యార్థులకు పండగే.. శామ్‌సంగ్ బ్యాక్ టూ స్కూల్ భారీ ఆఫర్లు ప్రారంభం
  3. Redmi Watch 6 Active : తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లు.. షావోమి నుంచి రెండు కొత్త స్మార్ట్‌వాచ్‌లు
  4. Tecno Camon 50 Ultra 5G : నేటి నుంచే అమ్మకానికి టెక్నో కేమన్ 50 ఆల్ట్రా 5జీ.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే
  5. Google Fitbit Air in India: భారత్‌లోకి గూగుల్ కొత్త ఫిట్‌బిట్ ఎయిర్.. అమెజాన్‌లో ప్రత్యక్షమైన డివైజ్
  6. Oppo Find X10 Series Features Leaked: స్మార్ట్‌ఫోన్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం.. మూడు 200MP కెమెరాలతో ఒప్పో సంచలన ఎంట్రీ!
  7. Redmi Note 17 Launch Date : స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. ఆగస్టు 6న మార్కెట్‌లో రెడ్‌మి సునామీ
  8. CP Plus CarKam 4G Dashcam: కార్ల భద్రత కోసం కొత్త డ్యాష్‌క్యామ్ సిరీస్.. సీపీ ప్లస్ నుంచి అద్భుతమైన గ్యాడ్జెట్!
  9. Tips to Boost Wi-Fi Speed: వైఫై రౌటర్‌కి అల్యూమినియం ఫోయిల్ చుడితే స్పీడ్ పెరుగుతుందా? నిజానిజాలు ఇవే!
  10. Redmi Note 17 Pro Max Features leaked: రెడ్‌మి నుంచి మైండ్ బ్లోయింగ్ ఫోన్.. నోట్ 17 ప్రొ మాక్స్ ఫీచర్లు లీక్!
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »