CP Plus CarKam 4G Dashcam Series launched in India for Car Saftey: కారు భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ డ్యాష్‌క్యామ్‌లలో అనేక స్మార్ట్ ఫీచర్లను జోడించారు
Photo Credit: CP PLUS
CP Plus CarKam 4G Dashcam
CP Plus CarKam 4G Dashcam: ప్రముఖ టెక్ బ్రాండ్ సీపీ ప్లస్ భారతీయ వినియోగదారుల కోసం సరికొత్త కార్‌కామ్ 4G డ్యాష్‌క్యామ్ సిరీస్‌ను అధికారికంగా విడుదల చేసింది. కార్ల భద్రతను మరింత పెంచేలా, ఎల్లప్పుడూ కారుపై నిఘా ఉంచేలా ఈ సిరీస్‌ను రూపొందించారు. దీని కింద కంపెనీ రెండు నూతన మోడళ్లను మార్కెట్లోకి తెచ్చింది. అవే CP-H27, CP-H27B. ప్రయాణ సమయంలో వీడియో రికార్డింగ్‌తో పాటు, కారుకు దూరంగా ఉన్నప్పటికీ రిమోట్ మానిటరింగ్, పటిష్టమైన సెక్యూరిటీ ఫీచర్లు కోరుకునే కార్ డ్రైవర్ల కోసం ఇవి అత్యంత ఉపయోగకరంగా ఉంటాయి.
అధునాతన 4G, జీపీఎస్ ఫీచర్లు..
ఈ కొత్త కార్‌కామ్ 4G సిరీస్‌లోని రెండు మోడళ్లు కూడా హై-ఎండ్ టెక్నాలజీతో వస్తున్నాయి. వీటిలో 4G/5G సిమ్ కార్డ్ సపోర్ట్ ఇవ్వడం విశేషం. దీని ద్వారా వినియోగదారులు తమ మొబైల్‌లోని ezyLiv+ యాప్ సహాయంతో కారు లైవ్ వ్యూను ఎక్కడి నుంచైనా వీక్షించవచ్చు. అంతేకాకుండా రిమోట్ యాక్సెస్ పొందడంతో పాటు కారు ప్రస్తుతం ఎక్కడ ఉందో రియల్ టైమ్ జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. దీనితో పాటు హెచ్‌డీఆర్ సపోర్ట్, హెచ్.265 వీడియో కంప్రెషన్, ఏకంగా 1TB వరకు మైక్రోఎస్డీ కార్డ్ స్టోరేజ్ సదుపాయం ఇందులో లభిస్తుంది.
సెక్యూరిటీకి పెద్ద పీట – అత్యాధునిక సెన్సార్లు..
కారు భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ డ్యాష్‌క్యామ్‌లలో అనేక స్మార్ట్ ఫీచర్లను జోడించారు. ఇందులో బిల్ట్-ఇన్ జీపీఎస్, డ్రైవింగ్ సమయంలో ఇతరులతో మాట్లాడేందుకు టూ-వె టాక్, కదలికలను గుర్తించే మోషన్ డిటెక్షన్, ఏదైనా ప్రమాదం జరిగితే పసిగట్టే కోలిజన్ డిటెక్షన్, జీ-సెన్సార్, పార్కింగ్ సమయంలో రక్షణనిచ్చే పార్కింగ్ మానిటరింగ్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే టైప్-సి హార్డ్‌వేర్ కిట్‌ను ఉపయోగించి కనెక్ట్ చేస్తే, టైమ్-లాప్స్ రికార్డింగ్, పార్కింగ్ మోడ్ మరింత మెరుగ్గా పనిచేస్తాయి.
Wi-Fi Speed : వైఫై రౌటర్‌కి అల్యూమినియం ఫోయిల్ చుడితే స్పీడ్ పెరుగుతుందా? నిజానిజాలు ఇవే
CP-H27, CP-H27B మధ్య తేడాలు..
ఈ రెండు మోడళ్లలో ఫీచర్ల పరంగా చిన్నపాటి వ్యత్యాసం ఉంది. సింగిల్ కెమెరా కోరుకునే వారి కోసం CP-H27 మోడల్‌లో 2 మెగాపిక్సెల్ ఫుల్ హెచ్‌డీ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఇది 1080p రిజల్యూషన్‌తో పాటు F1.5 అపర్చర్ లెన్స్, 136 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్‌ను అందిస్తుంది. ఇక CP-H27B విషయానికి వస్తే, ఇది డ్యూయల్-చానల్ సెటప్‌తో వస్తుంది. ఇందులో 2MP ఫ్రంట్ కెమెరాతో పాటు మరో 2MP ఫుల్ హెచ్‌డీ రేర్ కెమెరాను కూడా అందిస్తారు. దీనివల్ల కారుకు ముందు భాగంతో పాటు వెనుక వైపు జరిగే విషయాలను కూడా ఒకేసారి రికార్డ్ చేసుకోవచ్చు.
ధర, ఎక్కడ లభిస్తాయి..?
ధరల విషయానికి వస్తే... సీపీ ప్లస్ కార్‌కామ్ 4G CP-H27 మోడల్ ధరను రూ.7,599గా నిర్ణయించారు. అలాగే డ్యూయల్ కెమెరాతో వచ్చే CP-H27B మోడల్ ధర రూ.11,699గా ఉంది. ఈ రెండు మోడళ్లు కూడా ప్రస్తుతం భారతదేశంలోని ప్రముఖ ఈ-కామర్స్ వేదిక అయిన అమెజాన్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
iPhone 18 Pro Series’ A20 Pro Chipset Appears on Multiple Benchmarking Platforms Showing Performance Gains