రెడ్‌మి నోట్ 17 స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో ఆగస్టు 6న అధికారికంగా ఆవిష్కృతం కానుంది.
Photo Credit: Xiaomi
Redmi Note 17
Redmi Note 17 Launch Date : చైనాలో ఇటీవలే ఘనంగా లాంచ్ అయిన రెడ్‌మి నోట్ 17 సిరీస్ త్వరలోనే భారత మార్కెట్‌లో సందడి చేయనుంది. ఈ సిరీస్ ఇండియా ఎంట్రీ గురించి కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ప్రముఖ టెక్ టిప్‌స్టర్ అభినవ్ యాదవ్ ఎక్స్ వేదికగా దీని లాంచ్ టైమ్‌లైన్, కీలక స్పెసిఫికేషన్లను లీక్ చేశారు. భారతీయ యూజర్ల అవసరాలకు తగ్గట్లుగా అద్భుతమైన ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకువస్తున్నట్లు సమాచారం.
లాంచ్ డేట్, ఫస్ట్ సేల్ వివరాలు
లీకైన సమాచారం ప్రకారం.. రెడ్‌మి నోట్ 17 స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో ఆగస్టు 6న అధికారికంగా ఆవిష్కృతం కానుంది. అలాగే ఈ ఫోన్ మొదటి సేల్ ఆగస్టు 11 నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ సిరీస్ భారత్‌లో కూడా చైనా వేరియంట్‌లాగే పెద్ద ఎత్తున సంచలనం సృష్టిస్తుందని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు.
రాక్షస బ్యాటరీ, డిస్‌ప్లే విశేషాలు
ఇండియన్ వేరియంట్ రెడ్‌మి నోట్ 17 లో ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీనే. ఈ ఫోన్ ఏకంగా 8,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీతో రాబోతోంది. దీనివల్ల ప్రయాణాలు చేసేవారికి మరియు హెవీ యూజర్లకు ఛార్జింగ్ టెన్షన్ పూర్తిగా తప్పనుంది. దీనితో పాటు అత్యుత్తమ విజువల్ అనుభవాన్ని అందించేందుకు ఓలెడ్ డిస్‌ప్లేను అమర్చనున్నారు.
Wi-Fi Speed : వైఫై రౌటర్‌కి అల్యూమినియం ఫోయిల్ చుడితే స్పీడ్ పెరుగుతుందా? నిజానిజాలు ఇవే
అద్భుతమైన కెమెరా సెటప్
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఇండియన్ వర్షన్‌లో 50 మెగాపిక్సెల్ లైట్ ఫ్యూజన్ 400 ప్రైమరీ రియర్ కెమెరాను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ మాట్లాడే వారి కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చనున్నారు. ఇది స్పష్టమైన ఫోటోలను, హైక్వాలిటీ వీడియోలను అందించడంలో సహాయపడుతుంది.
చైనా వేరియంట్ ఫీచర్లు ఇవే
చైనాలో విడుదలైన మోడల్‌ను పరిశీలిస్తే.. అది 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో, 120Hz రిఫ్రెష్ రేట్, 3,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఆల్ట్రా చిప్‌సెట్, 16GB వరకు RAM, 512GB వరకు స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. వెనుక వైపు OIS సపోర్ట్‌తో 50MP సోనీ LYT-600 కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3పై పనిచేసే ఈ ఫోన్ 45W వేగవంతమైన ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
ప్రకటన
ప్రకటన
Vivo T5 Lite 5G Sale Begins in India: Check Price, Offers, and Specifications
Samsung Galaxy Z Flip 8 Launched With 4.1-Inch Cover Screen, 4,300mAh Battery: Price, Specifications