Oppo Find X10 Series Fatures Leaked: స్మార్ట్‌ఫోన్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం.. మూడు 200MP కెమెరాలతో ఒప్పో సంచలన ఎంట్రీ!

Oppo Find X10 Series Features leaked: ఇందులో 6.89 అంగుళాల 2K LTPO ఫ్లాట్ డిస్‌ప్లేను అందించనున్నారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు, అతిపలుచటి బెజెల్స్ కోసం అత్యాధునిక LIPO టెక్నాలజీని కలిగి ఉంటుంది

Oppo Find X10 Series Fatures Leaked: స్మార్ట్‌ఫోన్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం.. మూడు 200MP కెమెరాలతో ఒప్పో సంచలన ఎంట్రీ!

Oppo Find X10 Series

ముఖ్యాంశాలు
  • 8,000 mAh బ్యాటరీ ఉంటే ఇక చార్జర్ వెతుక్కునే పని ఉండదేమో
  • స్మార్ట్‌ఫోన్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం
  • రికార్డులన్నీ బద్దలు కొట్టడానికి వస్తున్న ఒప్పో ఫ్లాగ్‌షిప్ సిరీస్
ప్రకటన

Oppo Find X10 Series Features Leaked: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో తమ అత్యంత ప్రతిష్టాత్మక ఫ్లాగ్‌షిప్ లైనప్‌లో భాగంగా ఒప్పో ఫైండ్ X10 సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. గత ఏడాది అక్టోబర్‌లో ఒప్పో ఫైండ్ X9 సిరీస్ మార్కెట్లోకి వచ్చి మంచి ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు రాబోతున్న నూతన సిరీస్‌లో 6.32 అంగుళాల నుంచి 6.9 అంగుళాల వరకు వివిధ డిస్‌ప్లే పరిమాణాలతో పలు మోడళ్లను పరిచయం చేయనున్నట్లు లీక్స్ ద్వారా సమాచారం వెలువడింది.

ఒప్పో ఫైండ్ X10 ప్రో మ్యాక్స్..

చైనా మైక్రోబ్లాగింగ్ వేదిక  వైబోలో ప్రముఖ టిప్‌స్టర్  డిజిటల్ చాట్ స్టేషన్ అందించిన వివరాల ప్రకారం.. ఈ సిరీస్‌లోనే అత్యంత ఖరీదైన, టాప్-ఎండ్ మోడల్‌గా ఒప్పో ఫైండ్ X10 ప్రో మ్యాక్స్ రానుంది. ఈ ఫోన్ ఇంజనీరింగ్ ప్రొటోటైప్‌ను పవర్‌ఫుల్ కెమెరా సెటప్‌తో టెస్టింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో 6.89 అంగుళాల 2K LTPO ఫ్లాట్ డిస్‌ప్లేను అందించనున్నారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు, అతిపలుచటి బెజెల్స్ కోసం అత్యాధునిక LIPO టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 17 ఆధారిత కలర్ ఓఎస్ 17తో పనిచేసే ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రో చిప్‌సెట్‌ను వాడనున్నట్లు తెలుస్తోంది.

మూడు 200 మెగాపిక్సెల్ కెమెరాలతో రికార్డు సెటప్..

ఫోటోగ్రఫీ ప్రేమికులను ఆశ్చర్యపరిచే విధంగా ఈ ప్రో మ్యాక్స్ మోడల్ కెమెరా విభాగంలో భారీ అప్‌గ్రేడ్ సాధించబోతోంది. దీని వెనుక భాగంలో ఏకంగా మూడు 200 మెగాపిక్సెల్ కెమెరాలను (200MP ప్రైమరీ కెమెరా + 200MP అల్ట్రా-వైడ్ కెమెరా + 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా) అందించనున్నట్లు తెలుస్తోంది. ఫోటోలలో రంగులు మరింత సహజంగా, స్పష్టంగా కనిపించడం కోసం 3 మెగాపిక్సెల్ మల్టీస్పెక్ట్రల్ కెమెరాను కూడా జోడించనున్నారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చనున్నారు.

Redmi Note 17 Pro Max : రెడ్‌మి నుంచి మైండ్ బ్లోయింగ్ ఫోన్.. నోట్ 17 ప్రొ మాక్స్ ఫీచర్లు లీక్

భారీ 8,000 mAh బ్యాటరీ అప్‌గ్రేడ్..

ఈ సారి బ్యాటరీ సామర్థ్యం విషయంలోనూ ఒప్పో రాజీ పడటం లేదు. ఒప్పో ఫైండ్ X10 సిరీస్‌లోని ఫోన్‌లలో సుమారు 8,000 mAh సామర్థ్యం గల రాక్షస బ్యాటరీని అందించనున్నట్లు లీక్స్ తెలుపుతున్నాయి. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుదీర్ఘ కాలం పాటు గేమింగ్, హెవీ యూసేజ్‌కు అద్భుతమైన బ్యాకప్‌ను అందిస్తుంది. ఫ్లాగ్‌షిప్ స్థాయిలో ఇంత పెద్ద బ్యాటరీని ఇవ్వడం వినియోగదారులకు నిజంగా పెద్ద ఉపశమనమనే చెప్పాలి.

బేస్ అండ్ ప్రో మోడల్స్ స్పెసిఫికేషన్లు..

ఈ సిరీస్‌లోని బేస్ మోడల్ అయిన ఒప్పో ఫైండ్ X10లో 6.59 అంగుళాల 1.5K డిస్‌ప్లే, నూతన మీడియాటెక్ డైమెన్సిటీ 9600 లైట్ చిప్‌సెట్ ఉండే అవకాశం ఉంది. ఇక  ఒప్పో ఫైండ్ X10 ప్రో మోడల్‌లో 6.78 అంగుళాల 1.5K డిస్‌ప్లేతో పాటు శక్తివంతమైన డైమెన్సిటీ 9600 ప్రో ప్రాసెసర్‌ను అందించనున్నారు. చిన్న సైజ్ ఫోన్లను ఇష్టపడే వారి కోసం 6.59 అంగుళాల 1.5K డిస్‌ప్లేతో కూడిన ఒక కాంపాక్ట్ మోడల్‌ను కూడా ఈ సిరీస్‌లో విడుదల చేసే యోచనలో కంపెనీ ఉంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »