Foil Paper will Boost the Wi-Fi Speed, is that true..? Here what Science says: వైఫై రౌటర్ వెనుక అల్యూమినియం ఫోయిల్ అమర్చితే ఇంటర్నెట్ స్పీడ్ ఊహించని రేంజ్‌లో పెరుగుతుందని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది
Photo Credit: AI Generated
Wi-Fi
Tips to boost Wi-Fi Speed with Foil Paper: వైఫై రౌటర్ వెనుక అల్యూమినియం ఫోయిల్ అమర్చితే ఇంటర్నెట్ స్పీడ్ ఊహించని రేంజ్‌లో పెరుగుతుందని సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. వైఫై సిగ్నల్ సరిగ్గా అందక ఇబ్బంది పడేవారికి ఇది చాలా సులువైన, రూపాయి ఖర్చు లేని చిట్కా అని పలువురు నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ చిట్కా వెనుక కొంత శాస్త్రీయ కారణం ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో చెబుతున్నంత సులభంగా మాత్రం ఇది పనిచేయదు. అసలు దీని వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలేంటో వివరంగా తెలుసుకుందాం.
అసలు ఈ వైరల్ ప్రచారం ఏమిటి..?
సాధారణంగా వైఫై రౌటర్ నుంచి సిగ్నల్స్ అన్ని దిశలకూ సమానంగా ప్రసారమవుతాయి. అయితే రౌటర్ వెనుక భాగంలో అల్యూమినియం ఫోయిల్ పెట్టడం వల్ల, ఆ సిగ్నల్స్ వెనుకకు వెళ్లకుండా ఒకే దిశకు ఫోకస్ అవుతాయని, దీనివల్ల ఇంట్లో సిగ్నల్ బలహీనంగా ఉన్న ప్రాంతంలో కూడా ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందని నెట్టింట పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే ఈ ప్రచారాలు ఏ రీసెర్చ్ ఆధారంగా చెబుతున్నారనేది మాత్రం ఎవరూ స్పష్టంగా వివరించడం లేదు.
పరిశోధకులు అసలు ఏం చెప్పారు..?
అమెరికాకు చెందిన ప్రముఖ డార్ట్‌మౌత్ కాలేజ్ పరిశోధకులు వైఫై సిగ్నల్స్‌పై వైప్రింట్ అనే ప్రత్యేక సాంకేతికతతో ఒక అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా వారు ఇంటి నిర్మాణ శైలి, వైఫై అవసరాలకు అనుగుణంగా కంప్యూటర్ సాయంతో ఒక ప్రత్యేకమైన 3D-ప్రింటెడ్ రిఫ్లెక్టర్‌ను డిజైన్ చేశారు. దానిపై అల్యూమినియం పలుచటి పొరను అమర్చారు. ఈ రిఫ్లెక్టర్ ముఖ్య ఉద్దేశం వైఫై నెట్‌వర్క్ స్పీడ్‌ను పెంచడం కాదు, కేవలం సిగ్నల్స్ అనవసర దిశల్లోకి వృథాగా పోకుండా అవసరమైన దిశకు మాత్రమే మళ్లించడం. ఈ ప్రయోగంలో కొన్ని నిర్దిష్ట ప్రదేశాల్లో సిగ్నల్ బలం కాస్త పెరిగినట్లు గుర్తించారు.
సాధారణ కిచెన్ ఫోయిల్ పనిచేస్తుందా..?
ఇక్కడే చాలామందికి పెద్ద పొరపాటు జరుగుతోంది. సైంటిస్టులు రీసెర్చ్‌లో వాడింది మనం ఇంట్లో వంటకాల కోసం వాడే సాధారణ కిచెన్ ఫోయిల్ పేపర్ కాదు. వారు గది పరిమాణం, రౌటర్ ఉంచిన ప్రదేశం ఆధారంగా లెక్కలు వేసి తయారు చేసిన ప్రత్యేక 3D రిఫ్లెక్టర్. కాబట్టి కేవలం వంటగదిలోని అల్యూమినియం ఫోయిల్‌ను కట్ చేసి రౌటర్ వెనుక ఒక ఫ్లాట్ పేపర్‌లా అమర్చినంత మాత్రాన ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందని అనుకోవడం అపోహ మాత్రమే.
Redmi Note 17 Pro Max : రెడ్‌మి నుంచి మైండ్ బ్లోయింగ్ ఫోన్.. నోట్ 17 ప్రొ మాక్స్ ఫీచర్లు లీక్
ఈ చిట్కా ఎప్పుడు కొద్దిగా పనిచేస్తుంది..?
మీ ఇంట్లో కేవలం ఒకటో రెండో గదుల్లో మాత్రమే సిగ్నల్ బలహీనంగా ఉండి, రౌటర్ సరైన ప్రదేశంలోనే ఉన్నట్లయితే.. రేడియేషన్‌ను నిర్దిష్ట దిశకు మళ్లించడం ద్వారా కొద్దిపాటి మెరుగుదల కనిపించవచ్చు. కానీ సమస్య మీ ఇంటి మందపాటి కాంక్రీట్ గోడలు, బహుళ అంతస్తులు లేదా పాతకాలపు రౌటర్ హార్డ్‌వేర్ వల్ల వస్తుంటే మాత్రం ఈ అల్యూమినియం ఫోయిల్ ఎలాంటి అద్భుతాలు చేయలేదు. అలాంటి సమయంలో రౌటర్‌ను ఇంటి మధ్య భాగంలో అమర్చడం, మెష్ వైఫై లేదా వైఫై ఎక్స్‌టెండర్ వాడడమే సరైన పరిష్కారం.
చివరగా.. ఇది నిజమా? అపోహనా..?
అపోహ: రౌటర్ వెనుక ఏ అల్యూమినియం ఫోయిల్ పేపర్ చుట్టినా సరే వైఫై స్పీడ్ ఆటోమేటిక్‌గా పెరిగిపోతుంది.
నిజం: లోహాల సాయంతో వైఫై సిగ్నల్స్‌ను ఒకే దిశకు మళ్లించవచ్చనే శాస్త్రీయ సిద్ధాంతం నిజమే కానీ, వైరల్ ట్రిక్స్ చూపిస్తున్నంత సులభం కాదు. సైంటిఫిక్ రీసెర్చ్ అనేది ప్రత్యేకంగా డిజైన్ చేసిన రిఫ్లెక్టర్ల ఆధారంగా జరిగింది. కాబట్టి కిచెన్ ఫోయిల్ వాడితే కొన్ని సందర్భాల్లో స్వల్ప మార్పు రావచ్చు తప్ప, ఇది వైఫై స్పీడ్ పెంచే శాశ్వత పరిష్కారం మాత్రం కాదు.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
iPhone 18 Pro Series’ A20 Pro Chipset Appears on Multiple Benchmarking Platforms Showing Performance Gains