50-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 6,000mAh బ్యాటరీతో VIVO T4 Lite 5G భారతదేశంలో ప్రారంభించబడింది

ఈ మొబైల్ కి మంచి కెమెరా సెటప్ కూడా చేశారు. ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, LED ఫ్లాష్ ఉన్నాయి. ఇక ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

50-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 6,000mAh బ్యాటరీతో VIVO T4 Lite 5G భారతదేశంలో ప్రారంభించబడింది

Photo Credit: Vivo

వివో T4 లైట్ 5G ప్రిజం బ్లూ మరియు టైటానియం గోల్డ్ షేడ్స్‌లో వస్తుంది

ముఖ్యాంశాలు
  • ఈ మొబైల్ 6000mAh బ్యాటరీ బ్యాకప్, 15W ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది
  • రెండు డిఫరెంట్ కలర్స్ లో అందుబాటులో ఉండనుంది
  • IP68 రేటింగ్ తో వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్
ప్రకటన

వివో కంపెనీ తాజాగా భారత మార్కెట్లోకి లాంచ్ చేసిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వివో T4 Lite 5G మొబైల్ వివో అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ మొబైల్ అద్భుతమైన లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్స్ తో అందుబాటులోకి వచ్చింది. వివో T4 అల్ట్రా 5G, వివో T4 5G మరియు T4x 5G వేరియంట్లతో పాటు కూడా ఇండియాలో అందుబాటులో ఉంటుంది.వివో T4 లైట్ 5G మూడు వేరియంట్లలో లభించనుంది. 4GB RAM + 128GB వేరియంట్ ధర రూ.9,999 కాగా, 6GB RAM + 128GB వేరియంట్ ధర రూ10,999 ఉంది.ఇక 8GB RAM + 256GB వేరియంట్‌ను రూ.12,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ జూలై 2నుంచి ఫ్లిప్ కార్ట్, వివో ఇండియా అధికారిక వెబ్‌సైట్ మరియు ఎంపిక చేసిన ఆఫ్లైన్ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ఇక కలర్ వేరియంట్స్ చూస్తే ప్రీజం బ్లూ, ప్రీమియం టైటానియం గోల్డ్ రంగులలో విడుదల కానుంది. ఎక్కువసేపు ఉపయోగించుకునేలాగా 6,000mAh బ్యాటరీ బ్యాకప్ ఇస్తున్నారు, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసేందుకు 15W ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా ఇస్తున్నారు.

ఇక ఈ ఫోన్‌ డిస్ప్లే విషయానికి వస్తే 6.74 అంగుళాల HD+ LCD స్క్రీన్ ఉంది, ఇది 90Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. దీన్ని TÜV Rheinland బ్లూ లైట్ సర్టిఫికేషన్ కలిగి ఉండటం వల్ల ఎక్కువ సేపు ఉపయోగించిన కూడా కళ్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ ఫోన్ 6nm MediaTek Dimensity 6300 చిప్‌ సెట్‌తో పనిచేస్తుంది. ఇది Android 15 బేస్డ్ FuntouchOS 15 పై రన్ అవుతుంది. RAM పరంగా చూస్తే 4GB నుంచి 8GB వరకు వేరియంట్లలో వస్తుంది. అంతర్గతంగా 128GB లేదా 256GB స్టోరేజ్ అందిస్తుంది. ఇందులో మైక్రో SD ఉపయోగించుకుని 2TB వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఈ మొబైల్ కి మంచి కెమెరా సెటప్ కూడా చేశారు. ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, LED ఫ్లాష్ ఉన్నాయి. ఇక ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఫోటోలు బ్యూటిఫికేషన్ చేసుకునేందుకు ఇందులోAI ఫోటో ఇన్హాన్స్, AI ఎరేస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ ఫోన్‌కి IP64 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉంది. ఈ మొబైల్ ప్రత్యేకంగా SGS 5-స్టార్ యాంటీ ఫాల్ ప్రొటెక్షన్, మిలిటరీ-గ్రేడ్ MIL-STD-810H ధృవీకరణ కలిగి ఉంది. బయట వారు ఫోన్ యూస్ చేసే అవకాశం లేకుండా ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తె ఇది 5G, 4G, వైఫై, బ్లూటూత్ 5.4, GPS, USB Type-C పోర్టును సపోర్ట్ చేస్తుంది. ఈ 167.30 x 76.95 x 8.19mm డైమెన్షన్స్ తో , 202 గ్రాముల బరువుతో వస్తుంది.

ఎక్కువ ఫీచర్స్ తక్కువ ధరలో వస్తున్న ఈ ఫోన్ ముఖ్యంగా విద్యార్థులకు, ఫ్యామిలీ మెంబెర్స్ కి, మొబైల్ ఎక్కువగా వాడే వారికి, ఇంకా తక్కువ ధరలో మంచి కెమెరా, పెద్ద స్క్రీన్, భారీ బ్యాటరీ కోసం చూస్తున్న వినియోగదారులకు పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Comments
Facebookలో షేర్‌ Gadgets360 Twitter Shareట్వీట్ షేర్ Snapchat రెడ్డిట్ వ్యాఖ్యానించండి

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. దయచేసి మీ ఫోన్లను రీస్టార్ట్‌ చేయండి అని ఎయిర్‌టెల్ వినియోగదారులకు సూచించింది
  2. లీకైన ఒప్పో ఎఫ్ 31 సిరీస్.. అదిరే లుక్స్‌తో రానున్న న్యూ మోడల్స్
  3. హానర్ మ్యాజిక్ వి ఫ్లిప్ 2 న్యూ మోడల్.. సేల్ ఎప్పటి నుంచంటే
  4. ఇప్పుడు బెంగళూరులోని హెబ్బాళ్ స్టోర్ ఈ అనుభవాన్ని మరింత విస్తృతం చేయనుంది
  5. రత మార్కెట్‌లోకి గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లు, అద్బుతమైన ఫీచర్లు, ఎక్కడ కొనుగోలు చేయవచ్చంటే?
  6. జెమినీ కెమెరా కోచ్, ఫేస్ అన్‌బ్లర్, మ్యాజిక్ ఈరేసర్ ఫీచర్లు ఫోటోలు అందంగా చేస్తాయి
  7. రూ. 249 ప్లాన్‌ను నిలిపి వేసిన ఎయిర్ టెల్
  8. ఇక కెమెరా విషయానికి వస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను సెట్ చేశారు
  9. అదిరే ఫీచర్స్, ధరతో హానర్ X7c 5G కొత్త మోడల్
  10. Apple IDని లింక్ చేయడం ద్వారా ఆపిల్ మ్యూజిక్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »