లూమియా సిరీస్‌ను మొదటగా ప్రముఖ మొబైల్ దిగ్గజం నోకియా 2011లో విండోస్ ఫోన్ ప్లాట్‌ఫామ్‌పై పరిచయం చేసింది.
Lumia
Nokia Lumia Phone : ఒకప్పుడు విండోస్ ఫోన్‌లకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఐకానిక్ లూమియా బ్రాండ్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. మైక్రోసాఫ్ట్ ఆధీనంలో ఉన్న లూమియా ట్రేడ్‌మార్క్‌తో పాటు దానికి సంబంధించిన పేటెంట్ హక్కులను తిరిగి కొనుగోలు చేయడానికి హెచ్‌ఎమ్‌డీ సంస్థ బిడ్ వేయడానికి సిద్ధమవుతోందని సోషల్ మీడియా లీక్‌ల ద్వారా సమాచారం బయటకు వచ్చింది. అయితే దీనిపై హెచ్‌ఎమ్‌డీ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 2018 నుంచే ఈ ట్రేడ్‌మార్క్ హక్కుల కోసం చర్చలు జరుగుతున్నప్పటికీ ఒప్పందం కుదరలేదని తెలుస్తోంది.
నోకియా నుంచి మైక్రోసాఫ్ట్‌కు లూమియా ప్రయాణం
లూమియా సిరీస్‌ను మొదటగా ప్రముఖ మొబైల్ దిగ్గజం నోకియా 2011లో విండోస్ ఫోన్ ప్లాట్‌ఫామ్‌పై పరిచయం చేసింది. ఆ తర్వాత 2014లో నోకియా మొబైల్ విభాగాన్ని మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయడంతో లూమియా హక్కులు మైక్రోసాఫ్ట్ చేతికి వెళ్లాయి. కొన్నాళ్ల పాటు మైక్రోసాఫ్ట్ లూమియా పేరుతోనే ఫోన్లు తెచ్చినప్పటికీ, ఆండ్రాయిడ్, ఐఓఎస్ పోటీని తట్టుకోలేక విండోస్ ప్లాట్‌ఫామ్ వైఫల్యం చెందడంతో ఈ సిరీస్‌ను పూర్తిగా నిలిపివేశారు. అయినప్పటికీ, నేటికీ ఆ కాలపు క్లాసిక్ లూమియా ఫోన్ డిజైన్లకు, కెమెరా టెక్నాలజీకి అభిమానులు ఉన్నారు.
ప్యూర్ వ్యూ తరహాలోనే మరో ప్రయత్నం?
హెచ్‌ఎమ్‌డీ సంస్థ మైక్రోసాఫ్ట్ నుంచి బ్రాండ్లను తిరిగి సొంతం చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2018లో నోకియా కెమెరా ఫోన్లకు గుర్తింపుగా ఉన్న ప్రసిద్ధ ప్యూర్ వ్యూ ట్రేడ్‌మార్క్‌ను మైక్రోసాఫ్ట్ నుంచి హెచ్‌ఎమ్‌డీ సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే తరహాలో లూమియా బ్రాండ్ పేరును, దానికి సంబంధించిన డిజైన్ పేటెంట్లను దక్కించుకోవడానికి ప్రయత్నాలు తీవ్రతరం చేస్తోంది.
Human Refrigerator : బాక్స్‌లో కూర్చుంటే చాలు.. ఎండ దెబ్బ నుంచి తప్పించుకోవడానికి జపాన్ శాస్త్రవేత్తల మాస్టర్ ప్లాన్
లూమియా ఫోన్లు మళ్లీ వస్తాయా?
ఒకవేళ హెచ్‌ఎమ్‌డీ లూమియా ట్రేడ్‌మార్క్‌ను సాధించినప్పటికీ, వెంటనే లూమియా పేరుతో కొత్త ఆండ్రాయిడ్ ఫోన్లను తెస్తుందా లేదా అనేది చెప్పడం తొందరపాటే అవుతుంది. కంపెనీలు కొన్నిసార్లు తమ బ్రాండ్ పోర్ట్‌ఫోలియోను విస్తరించుకోవడానికి లేదా భవిష్యత్తు డిజైన్ల రక్షణ కోసం మాత్రమే ట్రేడ్‌మార్క్ కొనుగోలు చేస్తుంటాయి. అయితే హెచ్‌ఎమ్‌డీ ఇటీవల లూమియా పోలికలతో కూడిన డిజైన్‌తో ఆండ్రాయిడ్ ఫోన్లను రూపొందిస్తున్న నేపథ్యంలో, ఈ లూమియా పేరును మళ్లీ మార్కెట్‌లోకి తెస్తుందో లేదో చూడాలి.
ప్రకటన
ప్రకటన