Japan Scientist Made Human Refrigerator that Cools Human Body in just 5 minutes: జపాన్‌లో ప్రసిద్ధి చెందిన రెఫ్రిజిరేటెడ్ వెండింగ్ మెషిన్ల సాంకేతికతను ఆధారంగా చేసుకుని ఈ డో హిమోన్ బాక్స్‌ను డిజైన్ చేశారు
Photo Credit: Trusco
Human Refrigerator
Japan Scientist Made Human Refrigerator that Cools Human body in just 5 minutes: జపాన్‌లో ఎండల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతుండటంతో అక్కడి ప్రజలు తీవ్ర తీవ్రమైన హీట్ వేవ్‌తో సతమతమవుతున్నారు. ఈ ఎండ దెబ్బ నుంచి ఉపశమనం అందించేందుకు జపాన్‌కు చెందిన సాంకేతిక కంపెనీలు వినూత్న ఆలోచనలతో ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఎస్డిఆర్ఎస్, ట్రస్కో నాకాయమ సంస్థలు సంయుక్తంగా ఒక సరికొత్త పరికరాన్ని రూపొందించాయి. అదే డో హిమోన్ బాక్స్. దీనిని స్థానికులు హ్యూమన్ రెఫ్రిజిరేటర్ లేదా మానవ శీతలీకరణ యంత్రం అని పిలుస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి విక్రయాలు ప్రారంభించుకున్న ఈ కూలింగ్ బూత్, ప్రస్తుతం అక్కడ అనేక పబ్లిక్ ప్రదేశాలలో దర్శనమిస్తూ విపరీతంగా ఆకట్టుకుంటోంది.
జపాన్ వెండింగ్ మెషిన్ ప్రేరణతో రూపుదిద్దుకున్న డిజైన్..
జపాన్‌లో ప్రసిద్ధి చెందిన రెఫ్రిజిరేటెడ్ వెండింగ్ మెషిన్ల సాంకేతికతను ఆధారంగా చేసుకుని ఈ డో హిమోన్ బాక్స్‌ను డిజైన్ చేశారు. మనుషులు నేరుగా లోపలికి వెళ్లి కూర్చునేలా ఉండే ఈ బాక్స్.. కేవలం మానవ శరీరాన్ని త్వరితగతిన చల్లబరిచేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. సాధారణంగా వాడే స్పాట్ ఎయిర్ కండిషనర్లతో పోలిస్తే ఇది సగానికి పైగా విద్యుత్‌ను ఆదా చేస్తుంది. ప్రత్యేకంగా ఎలాంటి ఇన్స్టాలేషన్ ఛార్జీలు లేదా పనులు అవసరం లేకుండానే, ఇండోర్ మరియు అవుట్డోర్ ప్రదేశాలలో దీనిని ఉపయోగించవచ్చు. కింద అమర్చిన చక్రాల సాయంతో ఎక్కడికైనా సులువుగా తరలించే వెసులుబాటు దీని సొంతం.
లోపల 15 డిగ్రీల ఉష్ణోగ్రత.. 5 నిమిషాల్లోనే ఉపశమనం..
ఈ కూలింగ్ బూత్ లోపల ఉష్ణోగ్రత స్థిరంగా 15 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంటుంది. లోపల ఉన్న ప్రత్యేకమైన కుర్చీలో కూర్చోగానే, సుమారు 5 డిగ్రీల సెల్సియస్ దాకా చల్లబరిచిన గాలి నేరుగా వ్యక్తి తల, మెడ, భుజాలు మరియు వీపు భాగాలపైకి ప్రసరిస్తుంది. దీనివల్ల లోపలికి వెళ్లిన ఐదు నిమిషాల్లోనే శరీరానికి తీవ్రమైన ఉపశమనం లభిస్తుంది. దాదాపు 10 నిమిషాలు గడిపితే శరీర ఉష్ణోగ్రత వేగంగా తగ్గి, హీట్ స్ట్రోక్ లేదా ఎండ దెబ్బ లక్షణాలు తక్షణమే మాయమవుతాయి. పైగా శరీరం మరీ చల్లబడిపోకుండా నివారించేందుకు, 20 నిమిషాల తర్వాత ఇది ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యేలా టైమర్ సెటప్‌ను కూడా ఏర్పాటు చేశారు.
Portronics Pure Sound Pro X2 : ఇంటికే థియేటర్ అనుభూతి.. భారత్‌లో 'పోర్ట్రానిక్స్ ప్యూర్ సౌండ్ ప్రో X2' లాంచ్!
నిర్మాణ రంగాలు, ఫ్యాక్టరీ కార్మికులకు వరం..
ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే కన్స్ట్రక్షన్ సైట్లు, ఫ్యాక్టరీలు, వేర్‌హౌస్‌లు, అవుట్డోర్ ఈవెంట్లలో నిరంతరం పనిచేసే కార్మికులకు ఈ హ్యూమన్ రెఫ్రిజిరేటర్ ఒక గొప్ప వరమని చెప్పవచ్చు. ఎండలో పనిచేసి అలసిపోయిన కార్మికులు కొద్దిసేపు ఈ బాక్స్‌లో సమయం గడపడం ద్వారా తిరిగి శక్తిని పుంజుకుని ఉత్సాహంగా పనిచేయడానికి ఇది ఎంతో దోహదపడుతుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
DoT’s SIM Binding Rules Set to Take Effect Beginning January 1 to Curb Cyber Fraud: Here’s What Changes