అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ లో లాయిడ్, డైకిన్, ఐఎఫ్‌బీ వంటి ఏసీలపై భారీ తగ్గింపును అందిస్తోంది
Photo Credit: Panasonic
Amazon Great Summer Sale is offering Panasonic ACs with discounts
Amazon Great Summer Sale 2026 : భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బయట ఉష్ణోగ్రతలు ఇప్పటికే 44 డిగ్రీల సెల్సియస్ దాటిపోవడంతో ఉక్కపోత భరించడం కష్టంగా మారింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వినియోగదారులకు చల్లని వార్త మోసుకొచ్చింది. ఇంట్లో లేదా ఆఫీసులో ఏసీ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఒక సువర్ణావకాశం. ప్రముఖ బ్రాండ్లు అయిన లాయిడ్, డైకిన్, ఐఎఫ్‌బీ వంటి ఏసీలపై గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ తగ్గింపులను అమెజాన్ అందిస్తోంది. కేవలం ఏసీలే కాకుండా స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు, రిఫ్రిజిరేటర్లపై కూడా ఈ సేల్ లో అదిరిపోయే డీల్స్ ఉన్నాయి.
ఈ వేసవి సేల్‌లో స్ప్లిట్, విండో ఏసీలపై గరిష్టంగా రూ.54,000 వరకు ఆదా చేసుకునే వెసులుబాటు ఉంది. ఉదాహరణకు, డైకిన్ 0.8 టన్ 2-స్టార్ స్ప్లిట్ ఏసీ అసలు ధర రూ.36,000 కాగా, ఈ సేల్‌లో కేవలం రూ.26,490కే లభిస్తోంది. అలాగే ఐఎఫ్‌బీ (IFB) 1.5 టన్ 5-స్టార్ స్ప్లిట్ ఏసీపై భారీ తగ్గింపు ఉంది. దీని అసలు ధర రూ.76,490 ఉండగా, సేల్‌లో భాగంగా కేవలం రూ.42,490కే సొంతం చేసుకోవచ్చు. షార్ప్ బ్రాండ్ కి చెందిన 1.5 టన్, 2 టన్ ఏసీలపై కూడా ఊహించని రీతిలో ధరలు తగ్గాయి. షార్ప్ 1.5 టన్ ఏసీ కేవలం రూ.30,490 కే అందుబాటులో ఉంది.
అమెజాన్ కేవలం ధరలను తగ్గించడమే కాకుండా బ్యాంక్ ఆఫర్లను కూడా జత చేసింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగించి ఏసీ కొనుగోలు చేసే వారికి 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీని ద్వారా గరిష్టంగా రూ.9,500 వరకు అదనంగా ఆదా చేసుకోవచ్చు. వీటితో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. తక్కువ బడ్జెట్ ఉన్నవారి కోసం ఓక్టెర్ వంటి బ్రాండ్ల నుంచి 0.5 టన్ విండో ఏసీలు కేవలం రూ.15,999 నుంచే ప్రారంభమవుతున్నాయి.
హిటాచీ 1 టన్ 5-స్టార్ ఏసీ రూ.36,999 కి లభిస్తుండగా, లాయిడ్ 1 టన్ 3-స్టార్ ఏసీ ధర రూ.28,990 గా ఉంది. పానాసోనిక్ 2 టన్ 4-స్టార్ ఏసీ కొనుగోలు చేయాలనుకునే వారికి రూ.58,990 కి లభిస్తోంది. హైసెన్స్ 1 టన్ ఏసీని కేవలం రూ. 26,990 కే కొనుగోలు చేయవచ్చు. ఈ ధరలన్నీ అదనపు బ్యాంక్ డిస్కౌంట్లు కాకుండానే ఇంత తక్కువగా ఉండటం విశేషం. మీరు కూడా ఎండల నుంచి ఉపశమనం పొందాలనుకుంటే, అమెజాన్ లో ఈ డీల్స్ ముగిసేలోపే మీకు నచ్చిన ఏసీని బుక్ చేసుకోండి.
| Model | List Price | Sale Price | Buy Now |
|---|---|---|---|
| IFB Split AC (1.5 Ton, 5-Star) | Rs. 76,490 | Rs. 42,490 | Buy Now |
| Daikin Split AC (0.8 Ton, 2-Star) | Rs. 36,000 | Rs. 26,490 | Buy Now |
| Sharp Split AC (1.5 Ton, 3-Star) | Rs. 74,990 | Rs. 30,490 | Buy Now |
| Sharp Split AC (2 Ton, 3-Star) | Rs. 96,990 | Rs. 42,990 | Buy Now |
| Sharp Split AC (1 Ton, 3-Star) | Rs. 67,990 | Rs. 26,990 | Buy Now |
| Hitachi Split AC (1 Ton, 5-Star) | Rs. 65,990 | Rs. 36,999 | Buy Now |
| Oakter Window AC (0.5 Ton, 1-Star) | Rs. 29,999 | Rs. 15,999 | Buy Now |
| Lloyd Split AC (1 Ton, 3-Star) | Rs. 49,990 | Rs. 28,990 | Buy Now |
| Panasonic Split AC (2 Ton, 4-Star) | Rs. 79,500 | Rs. 58,990 | Buy Now |
| Hisense Split AC (1 Ton, 3-Star) | Rs. 39,630 | Rs. 26,990 | Buy Now |
ప్రకటన
ప్రకటన